Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వెలిసిన మొహాలకు ర్యాంకుల తళతళ… పాపులర్ తారలు వెలవెల…

May 18, 2024 by M S R

ఆర్మాక్స్ వంటి ఆన్‌లైన్ సర్వే రిపోర్టులను క్రమం తప్పకుండా ప్రచురించే సంస్థలుంటాయి… కావాలనే చేస్తారో, అవీ కొనుక్కునే స్కోచ్ అవార్డులో, ఆన్‌లైన్ తప్పుడు రేటింగులో, నిజంగానే ఆన్‌లైన్ ప్రేక్షకుల టేస్టులు అలాగే ఉంటాయో తెలియదు, చెప్పలేం, వాళ్లు ఎలాగూ చెప్పరు… కానీ కొన్ని నవ్వు పుట్టిస్తాయి, పోనీ, కరెక్టు కాదనిపిస్తాయి…

ప్రతి నెలా వివిధ భాషల్లోని సినిమాలు, టీవీలు, ఇతర సెలబ్రిటీల ర్యాంకింగ్స్ పబ్లిష్ చేస్తుంటారు కదా… ఏప్రిల్ నెలకు సంబంధించి తెలుగు హీరోయిన్ల ర్యాంకింగులు పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది…

ormax

Ads

అనుపమ పరమేశ్వరన్ టెన్త్ ప్లేసు అట… నిజానికి మంచి ర్యాంక్ దక్కాలి… మొన్నటి టిల్లూ స్క్వేర్ ఆమె రేంజ్, పాపులారిటీని బాగా పెంచాయి… ఇప్పుడు డిమాండున్న హీరోయిన్ ఆమె… పూజా హెగ్గే తొమ్మిదో ప్లేసు అట… అవసరం లేదు, నిజానికి ఆమెకు ఇప్పుడు తెలుగులో అవకాశాల్లేవు, అడిగేవాళ్లు లేరు, హఠాత్తుగా ఐరన్ లెగ్ అయిపోయింది…

కీర్తి సురేష్ ఎనిమిదో ప్లేసు… నిజానికి ఆమెకు కూడా బెటర్ ర్యాంక్ దక్కాలి… డిమాండ్ ఉంది, బాలీవుడ్ దాకా వెళ్లిపోతోంది… తమన్నా భాటియా ఏడో ర్యాంకు అట… పర్లేదు, మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు… కాకపోతే తెలుగులోకన్నా తమిళంలో కాస్త ఎక్కువ చెలామణీలో ఉంది…

రష్మిక మంధాన ఆరో ప్లేసు… నిజానికి ఆమెకు బెటర్ ప్లేస్ దక్కాలి… పుష్పతో నేషనల్ క్రష్ అయిపోయి, యానిమల్‌తో టాప్ రేంజ్‌కు వెళ్లిపోయింది… డిమాండ్, పాపులారిటీ, రెమ్యునరేషన్ విషయాల్లో ఎక్కడికో వెళ్లిపోయింది.,. పుష్ప-2 గనుక అలాగే హిట్టయితే మాత్రం రష్మిక టాప్ వన్ హీరోయిన్ ప్లేసులో ఉంటుంది…

సాయిపల్లవి అయిదో ప్లేసు… అంత లేదు ఆమెకు, చాన్నాళ్లుగా ఆమె తెర మీద లేదు, కాకపోతే రామాయణంలో సీతగా.., మరో హిందీ సినిమాలో, ఒక తమిళ సినిమాల్లో చేస్తున్నట్టుంది… వార్తల్లో ఉంది, రామాయణం గనుక అనుకున్నట్టు ఓ రేంజుకు వెళ్తే అప్పుడు సాయిపల్లవి పాపులారిటీ, ర్యాంక్ పెరుగుతాయి, పెరగాలి…

నాలుగో ప్లేసులో శ్రీలీల… ఈ కుర్చీ మడతపెట్టిన పిల్లకు హఠాత్తుగా డిమాండ్ పడిపోయింది నిజానికి… డాన్సుల రోల్స్ తప్ప మంచి పాత్రలేమీ రావడం లేదు… కాకపోతే పాపులారిటీ ఇంకా తగ్గలేదు… సో, నాలుగో ప్లేసును తీసిపారేయలేం… మూడో ప్లేసులో అనుష్క శెట్టి… ఎందుకు..? ఆ ర్యాంక్ ఇచ్చినవాళ్లకే తెలియదు… ఆమె సినిమాలు ఏమున్నాయని..?

ఆమధ్య అదేదో పోలిశెట్టి సినిమాలో చేసింది… అంతకుముందు, ఇప్పుడు వేరే సినిమాలేమున్నాయి..? జనంలో పెద్ద పాపులారిటీ కూడా లేదు ఇప్పుడు… వెటరన్… సేమ్, కాజల్ అగర్వాల్… ఏవో అడపాదడపా పెద్ద ప్రాధాన్యమున్న రోల్స్ తప్ప ఆమెకూ ఆ ర్యాంక్ చాలా ఎక్కువ… మరీ రెండో ప్లేసు ఇచ్చేంత డిమాండ్ లేదు, పాపులారిటీ లేదు…

ఫస్ట్ ప్లేసులో సమంత అట… నిజమా..? అసలు తెలుగులో చేయక ఎన్నాళ్లయింది..? ఒకవైపు స్టార్ హీరోలందరూ ఆమెతో సినిమా అంటేనే పారిపోతున్నారు, వద్దంటున్నారు, తప్పించుకుంటున్నారు అని వార్తలు వస్తుంటే… ఆమె అనారోగ్యం తాలూకు వార్తల్లోనే అధికంగా కనిపిస్తుంటే… ఆమె దిల్ కా దడ్కన్‌గా ఎలా ఉంది..? హేమిటో… ఈ సర్వేలు, ఈ ర్యాంకులు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రజినీ- కమల్ భేటీ… ఆకర్షించింది ఆ వెనుక ఉన్న ‘ఆపనా ముద్ర’…
  • కేఏ పాల్‌కు అంత సీన్ లేదులే… బిడ్డ కోసం ఆ ‘అమ్మ’ పోరాటం…
  • కేసీయార్ తప్పిదం సరిదిద్దే దిశలో… కృష్ణా పాయింట్లలో టెలిమెట్రీలు…
  • కోమటిరెడ్డి అదే చేయగలిగితే… మోడీ, కేసీయార్‌‌లకన్నా తోపు తురుం..!!
  • మొత్తం 5 జంటలు… మరి ఈ ‘ముచ్చటగా ముగ్గురు’ టైటిల్ ఏమిటో…
  • AI ప్లాట్‌ఫామ్స్ … అతివాడకంతో మన బుర్రలు మొద్దుబారుతున్నయ్…
  • గుల్ఫాం ఉప-ద్రవం… తాగినా చస్తారు, తాగకపోయినా చస్తారు…
  • మీ కడుపులు చల్లంగుండ… సన్నబియ్యంతో పాశం చేసుకున్నం సారూ…
  • ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మంచు కన్నప్ప నేర్పిన పాఠం ఏమిటి..?
  • సంగమానంతరం శ్రీవారి నవ్వులు ఆమె తలపై చల్లిన అక్షతలయ్యాయట..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions