కొన్ని… గుండెను మెలితిప్పుతుంటాయి… మరీ సున్నిత హృదయులైతే బాగా డిస్టర్బ్ అయ్యే ప్రమాదమూ ఉంది… కడుపులో దేవుతుంది… వాటిని నేరాలు అనాలా… ఘోరాలు అనాలా… ఇంకేదైనా క్రూరమైన పేరుందా..? ప్చ్, హారిబుల్ న్యూస్… వివరాల్లోకి వెళ్దాం…
ఉత్తరప్రదేశ్… మెయిన్‌పురి ఏరియాలోని ఘరోర్ థానా… ఆమె పేరు రీటా… భుగాయి వాళ్ల ఊరు… మెయిన్‌పురిలోని రాధారమణ్ రోడ్డులో సాయి హాస్పిటల్‌లో చేరింది… ప్రసవం కష్టం కావడంతో ఐదురోజుల క్రితం సిజేరియన్ చేసి ఆడ శిశువును బయటికి తీశారు…
ఇక్కడి వరకూ వోకే… బేబీకి ఏవో చిన్న చిన్న కాంప్లికేషన్స్… శిశువుల్లో సహజమే కదా… సింప్టమ్స్‌ను బట్టి ఏమైనా చికిత్స చేస్తుంటారు సాధారణంగా… గడువు లోపల పుడితే, ఎదుగుదల పూర్తిగా లేకపోతే, ఇంకేదైనా సమస్యలుంటే ఇంక్యుబేషన్ చాంబర్లలో పెడుతుంటారు… తల్లి కడుపులో ఉన్న వేడిని మెయింటెయిన్ చేస్తుంటారు… అందరికీ తెలిసిందే కదా…
Ads
కానీ ఇక్కడ డాక్టర్లు ఏం చేశారో తెలుసా..? రోజూ ఓ అరగంటపాటు ఎండ తగిలేట్టు చూడాలని ఆ బాలింతకు చెప్పారు… అసలే సిజేరియన్, అప్పటికి ఐదు రోజులే… పచ్చి బాలింత… ఆ పాపను తీసుకుని హాస్పిటల్ టెర్రేస్ పైకి వెళ్లి నిలుచుంది… తోడుగా ఆమె తల్లో, వేరే బంధువులో కూడా ఉన్నారు…
ఒక్కసారి ఊహించండి… 11- 12 గంటల నడుమ… హాస్పిటల్ టెర్రేస్ పైన… 42 డిగ్రీల ఎండ… అరగంటసేపు ఆ శిశువుతో అలా నిలబడింది ఆమె… ఆ శిశువు ఆ ఎండవేడిమికి ఎలా విలవిల్లాడిందో… సూర్యుడి కిరణాలు దేహాన్ని, చర్మాన్ని ఎర్రగా కోసేసి ఉంటాయి కదా… ఎండ చర్మాన్ని నేరుగా తాకితేనే బెటర్ అని చెప్పి ఉంటారు కదా… ఇక అరగంట తరువాత కిందకు తీసుకొచ్చింది… తీరా చూస్తే కాసేపటికే శిశువు ఊపిరి ఆగిపోయి ఉంది…
అసలు ఐదు రోజుల పసిగుడ్డును మనం బయట వాతావరణానికే ఎక్స్‌పోజ్ కానివ్వం… ఇన్‌ఫెక్షన్లు గట్రా సోకుతాయని… ఒకవేళ బయటికి తీసుకొచ్చినా చుట్టూ గుడ్డలు కట్టి జాగ్రత్తగా ఉంటాం కదా… అలాంటిది ఆ డాక్టర్లు రోజూ అరగంట ఎండలో ఉంచాలని అడగడం ఏమిటి..?
సరే, ఆ మూర్ఖులు ఏదో చెప్పారు సరే, వాళ్లకు కూడా తమ నిర్ణయాన్ని జస్టిఫై చేసుకునేలా ఏవో పిచ్చి కారణాలు ఉండవచ్చుగాక… ఆ తల్లి ఆ పసిగుడ్డును అలా ఆ మండే ఎండలో ఉంచింది… అసలే ఉత్తర భారతంలో ఎండలు బండలు పగిలేలా కాస్తున్నాయి ఇప్పుడు…
ఛిఛీ, ఈ ఎండలకు పెద్దలమే రెండు నిమిషాలు ఎండలో ఉండలేకపోతున్నాం… కానీ ఆ పసిగుడ్డు… ఊహించడానికే కష్టంగా ఉంది… పాప మరణం తరువాత బంధువులు గొడవ చేశారు, కానీ ఏం లాభం..? అప్పటికే డాక్టర్లు, కీలక సిబ్బంది పారిపోయారు… పోలీసులు వచ్చారు, పాప ప్రాణం రాదుగా… కేసు నమోదు చేశారు… హాస్పిటల్ సీల్ చేశారు…
డాక్టర్ల సలహాల మీద దర్యాప్తు ప్రారంభించారు… అవునూ, ఇదంతా దేనికి..? విటమిన్ డీ కోసమా..? వోకే, ఈమధ్య కొన్నిచోట్ల డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు సరే, కానీ గతంలో ఎప్పుడూ లేనిది ఏమిటీమధ్య ఈ కొత్త సూచనలు..? పైగా కాస్త లేత ఎండలో అయితే వోకే… కానీ మరీ ఈ నట్టనడి మధ్యాహ్నం బుసబుస ఎండల్లోనా..? పాపం ఆ తల్లి, తన అమాయకత్వంతో తన పాపను తన చేజేతులా పోగొట్టుకుంది… అన్యాయంగా..!
Share this Article