… బెంగళూరు రేవ్ పార్టీలో సెలబ్రిటీల పరిస్థితి రేపు నాకో, నా మిత్రులకో, తెలిసినవారికో తప్పకుండా రావచ్చు. మన చుట్టూ ఎవరో ఒకరు అలాంటి పరిస్థితుల్లో తెలియకుండానే ఇరుక్కునే అవకాశం ఉంది. సీరియస్లీ! కాబట్టి గట్టున నిలబడి నీతి వాక్యాలు వల్లించలేను. మనం ఎన్ని మాట్లాడినా Night Culture పెరిగి, ఎక్కడికక్కడ సోషలైజేషన్ ప్రాముఖ్యం పెరిగాక ‘నేను ఇంట్లోనే కూర్చుని ముద్దపప్పు, ఆవకాయ తిని, ఎనిమిదింటికి నిద్రపోతాను’ అనే పరిస్థితి లేదు. ఆశతోనో, అవసరంతోనో, ఏమీ తోచకో, ఒంటరిగా ఫీలయ్యో, తోడు కోసమో కొన్ని చోట్లకు వెళ్లక తప్పదు. అయితే ఎలాంటి చోట్లకు వెళ్తాం, వెళ్లాక ఎలా ఉంటాం, ఏం చేస్తాం అనేది మన నిగ్రహం, నియంత్రణ మీద ఆధారపడి ఉంటుంది.
… మనం వెళ్లిన చోట మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అలా ఇరుక్కుని వేలకువేలు పోగొట్టుకున్న మిత్రులు నాకు తెలుసు! ఆ ఒకటి, రెండు కథలే చాలా షాకింగ్‌గా అనిపించాయి. పోలీసులను పిలుస్తామని భయపెట్టి మరీ డబ్బులు వసూలు చేసిన ఘటనలు, ఫ్రెండ్స్ బలవంతం మీద వెళ్లి, మొత్తం డబ్బులు పోగొట్టుకున్న వాళ్ల కథలూ, ఆ చీకట్లో రహస్యంగా కొందరి జేబుల్లో డ్రగ్స్ పెట్టి ఇరికిస్తారన్న విషయాలూ విని ఉన్నాను.
… కాబట్టి సెలబ్రెటీలు మాత్రమే తప్పు చేస్తారనే ఓవరాల్ జడ్జిమెంట్ వద్దు. మనకు అవకాశం వస్తే మనమూ చేయగలం. మనమూ కొన్ని తెలియని పరిస్థితుల్లో ఇరుక్కుపోగలం. దోషులుగా నిలబడగలం. మనం తప్పు చేయకపోవడానికి మంచితనమే కాక, పిరికితనం, భయం కూడా కారణం కావచ్చు. కాబట్టి CLUB, PUB, PARTY, DISCO లాంటి పదాలను బూతులుగా చూడకండి. అక్కడికి వెళ్లే మనుషులు చేసే పనులను వాటి మీద రుద్ది, వెళ్లే అందర్నీ ఒకే గాటన కట్టకండి.
PS: Someday or Next day.. You can see anyone in Pub. ‘హమ్మో! వీళ్లు ఇలాంటి వాళ్లు అనుకోలేదు’ అని అప్పుడు అనుకోకండి! Everyone have Right to go Authorised Places. ఎటొచ్చీ అనధికారిక స్థలాలు, సమయాలు, విషయాలే తప్పు. వాటిని మాత్రం ఖండించండి…. Sai Vamsy (వి శీ)
Share this Article