Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నీ మోడీ శకునములే… పవర్ కుర్చీ ప్రాప్త సూచనలే…

May 23, 2024 by M S R

మోడీ మళ్లీ ప్రధాని అవుతారు! బీజేపీకి స్వంతంగా 305 సీట్లు వస్తాయి! ఎవరో అనామకులు నుంచి వచ్చిన విశ్లేషణ కాదు ఇది!
ఇయాన్ ఆర్థర్ బ్రెమ్మర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ చెప్తున్న విశ్లేషణ! (ఇండియాలోని ఫేమస్ సట్టా బజార్లు కూడా ఇవే అంచనాలతో బెట్టింగు రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి… వాటి అంచనాలు చాలా లెక్కల్లో క్లిష్టంగా ఉంటాయి…)

ఇయాన్ ఆర్థర్ బ్రెమ్మార్ (Ian Aurther Bremmer ) పొలిటికల్ సైంటిస్ట్, రచయిత, ఎంటర్, వ్యవస్థాపక అధ్యక్షుడు యూరేసియ (Eurosia )గ్రూప్ కి. యురేసియ గ్రూపు అనేది పొలిటికల్ రిస్క్ పరిశోధన మరియు కన్సల్టెంట్ సంస్థ! ఇయాన్ ఆర్థర్ బ్రేమ్మర్ కి GZERO అనే డిజిటల్ మీడియా సంస్థ కూడా ఉంది.

వెల్! ఇయాన్ చేసే పని ఏమిటంటే వివిధ దేశాలలో ఉన్న రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేయడం. ఇయాన్ భారత్ గురుంచి ఇలా చెప్పారు:

Ads

‘‘భారత్ ఎప్పుడూ తన అంతర్గత విషయాల మీద దృష్టి పెట్టీ వాటితోనే పోరాడుతూ వచ్చేది! కానీ గత పదేళ్ళలో భారత్ అంతర్జాతీయంగా క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ గత కొంత కాలంగా అంతర్జాతీయంగా తన పరపతిని పెంచుకోవడమే కాకుండా క్లిష్ట సమయంలో ఇతర దేశాలకి సలహా, సూచనలు మరియు నమ్మకమైన అర్బిట్రెటర్ గా ఎదిగింది. ఇదేమీ సాధారణ విషయం కాదు భారత్ విషయంలో!

G7 గ్రూపు సమావేశాలు ఇటలీలో జరగబోతున్నాయి ఈసారి ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీ ఆధ్వర్యంలో G7 సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది, అది ఏమిటంటే G7 సమ్మిట్ కి రావాల్సిందిగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది ఇటలీ ప్రధాని!
ఇది ఇటలీ ప్రధానిగా జార్జ్ మెలొనీ స్వంత నిర్ణయం!

G7 గ్రూపులోని ఇతర దేశాలని ఇటలీ ప్రధాని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంది! ఇంతవరకూ ఏ దేశం కూడా భారత ప్రధానికి ఆహ్వానం మీద ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు! అంటే పరోక్షంగా మిగతా G7 దేశాలు ఒప్పుకున్నట్లే! ఎలాంటి సంకోచం లేకుండా ఇటలీ ప్రధాని జార్జ్ మేలోనీ తాను భారత ప్రధాని నరేంద్ర మోడీ అభిమానిని అని బహిరంగంగా ప్రకటించారు!

అయితే మరో యూరోపియన్ దేశం ఆయిన నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే (Mark Rutte) తో పాటు ప్రస్తుతం ప్రధాని అభ్యర్ధిగా ఉన్న గ్రీట్ విల్దర్స్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీకి అభిమానులు. రైట్ వింగ్ సంకీర్ణ పార్టీల ప్రధాని అభ్యర్ధిగా రేసులో ఉన్న గ్రీట్ విల్డర్స్ అయితే బీజేపీ సిద్ధాంతం నన్ను బాగా ఆకట్టుకుంది అని ప్రకటించాడు. భారత్ ప్రస్తుతం గ్లోబల్ లీడర్ గా అవతరించింది!

ఇక భారత్ లో ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ గతంలో కంటే కనీసం అయిదు సీట్లు ఎక్కువగా గెలుచుకుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా ప్రస్తుత ప్రభుత్వము మీద ఎలాంటి అసమ్మతి లేదు భారత ప్రజలలో. అయితే గతంలో గెలిచిన చోట్ల కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంది కానీ వాటిని ఇతర చోట్ల గెలిచి నష్టాన్ని భర్తీ చేసుకుంటుంది.

ప్రస్తుతం భారత్ లో మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రతి పక్ష పార్టీలలో ఎవరూ లేరు అన్న అంశమే మోడీ గెలుపు అవకాశాలను పదిలంగా ఉంచగలిగింది! భారత ఓటర్లలో గత పదేళ్ల క్రితం ఉన్న వారితో ప్రస్తుతం కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారిలో 80% విద్యాధికులు ఉన్నారు వీళ్ళ మొగ్గు బీజేపీ వైపే ఉందని మా పరిశోధనలో వెల్లడైంది!’’ ఇదీ ఇయాన్ ఆర్థర్ బ్రిమ్మర్ వెల్లడించిన వివరాలు!

********
ఫలోడి satta బజార్ : క్రికెట్ , ఎన్నికల ఫలితాల మీద బెట్టింగ్ చేస్తూ ఉంటుంది. మూడు వారాల క్రితం బీజేపీ 364 సీట్లు గెలుస్తుంది అని బెట్టింగ్ కాసింది! కానీ వారం క్రితం బీజేపీ 301 సీట్లు గెలుస్తుంది అంటూ బెట్టింగ్ టార్గెట్ పెట్టింది. ఇప్పటికే 3000 కోట్ల రూపాయల మొత్తానికి బెట్టింగ్ చేరుకుంది అని అంచనా!

ఫలోడీ సట్టా బాజార్ కి తన స్వంత ఎలక్షన్ సర్వే నెట్వర్క్ ఉంది. తాను బెట్టింగ్ లో నష్ట పోకుండా ఉండేందుకు చాలా ఖచ్చితమైన సర్వే చేస్తుంది. ఫలొడి సట్ట బజార్ బెట్టింగ్ సర్వేలు 80% నిజం అయిన చరిత్ర ఉంది. అఫ్కోర్స్ ట్రంప్ గెలుస్తాడు అని బెట్టింగ్ కాసి నష్టపోయిన చరిత్ర కూడా ఉంది.

********
గత నెలరోజులుగా నేను అన్ని జాతీయ, అంతర్జాతీయ డిజిటల్ మీడియాలో నిరంతరం సెర్చ్ చేస్తూ వస్తున్నాను కానీ డజన్ల కొద్దీ కొత్త వాళ్ళు తమ అభిప్రాయాలని ఇండీ గ్రూపు గెలుస్తుంది అంటూ చెప్తూ వస్తున్నారు కానీ వీళ్ళు డబ్బులు తీసుకొని వ్రాస్తున్నారు అని అర్థం అయ్యింది నాకు. అలాగే దేనిని బేస్ చేసుకుని ఈ లెక్కలు చెబుతున్నారు అని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు.

అసలు వాళ్ళ రైటప్ చూస్తేనే అర్థమవుతుంది కొత్తగా ఇప్పుడే వ్రాయడం మొదలు పెట్టినట్లు అలాగే ఏ మాత్రం అనుభవం లేదనీ! ఇలాంటి మైండ్ గేమ్ కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్లే చేసి కాంగ్రెస్ లబ్ధి పొందింది అన్నది మాత్రం సత్యం!

కానీ హిందీ బెల్ట్ లో ఎలాంటి పట్టు లేని కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది అని అనుకుంటున్నారు? పైగా ఇవి పార్లమెంట్ ఎన్నికలు అనే విషయాన్ని చాలా కన్వీనియెంట్ గా విస్మరిస్తున్నారు! ఉత్తర ప్రదేశ్ లో indi గ్రూపు కి 38 సీట్లు వస్తాయి అని ఒకరు వ్రాశారు ఇంతకన్నా పెద్ద జోక్ ఏముంటుంటుంది? ఇంకొకరు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు వస్తాయి అని వ్రాశాడు. లోక్ సభ లో 272 సీట్లు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది! That’s it! (By పోట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions