మీరు స్వరపరిచారు సరే, కానీ గీత రచయిత మాటేమిటి..? పాడిన గాన నైపుణ్యం మాటేమిటి..? అనడిగింది కోర్టు… ఇంకా కేసు మీద అంతిమ తీర్పు రాలేదు… కానీ ఇళయరాజా నోటీసులు పంపిస్తూనే ఉన్నాడు, కేసులు వేస్తూనే ఉన్నాడు… అతి పెద్ద కొర్రీల మాస్టర్… మరి మన పద్మవిభూషణాలంటే మజాకా…?
తనకు అనుకూల వాదనలు, ఎక్కువ శాతం చీదరించుకునే పోస్టులు కనిపిస్తున్నాయి… అవునూ, అసలు ఆయన రాయల్టీ, హక్కులు అని మాట్లాడటానికి చాన్స్ ఎక్కడ దొరుకుతోంది..? అసలు నిర్మాతే కదా తను డబ్బులిచ్చి చేయించుకున్న పాటల మీద హక్కుదారు… సరే, ఓసారి అదీ చూద్దాం… సోషల్ మీడియాలోనే దొరికింది ఇది…
పాట ఒక క్రియేషన్, దానిపై ఆ పాట రాసినవారికి, కంపోజ్ చేసినవారికి, దాన్ని నిర్మాత నుంచి కొన్న మ్యూజిక్ కంపెనీకి జీవితాంతం హక్కులు ఉంటాయట… ఆ పాటను కమర్షియల్ గా వాడుకున్న వారెవరైనా ఈ ముగ్గురికీ రాయల్టీ చెల్లించాల్సిందే… ఇందుకోసమే IPRS (Indian Performing Rights Society) అనే ఒక సంస్థ ఉంటుంది… ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్, రచయితలు తమ పాటలను MRM ద్వారా రిజిస్టర్ చేసుకుంటారు…
Ads
ఇక ఆ సంస్థ ఓ పెద్ద భూతద్దం పట్టుకుని ఈ పాటలకు సంబంధించి అన్ని tv ఛానల్స్ నూ, మ్యూజిక్ ట్రూప్ లనూ రోజూ గమనిస్తూ, వాడుకున్న వాటిని కౌంట్ చేసి, వాడుకున్న వారివారి స్థాయిని బట్టి రాయల్టీని (ఆడియో కంపెనీ కి 50%, మ్యూజిక్ డైరెక్టర్ కు 25%, రైటర్ కు 25%) వసూలు చేసి, అందులో తన ఖర్చు, కమీషన్ పోను మిగతాది వీరికి చెల్లిస్తూ ఉంటుంది…
ఈ ముగ్గురి పర్మిషన్ (పేమెంట్) లేకుండా వాడుకొని రాయల్టీ కట్టని వారి గురించి వీరికి రిపోర్ట్ చేసి, వీరు లీగల్ గా యాక్షన్ తీసుకోవటంలో సహకరిస్తూ ఉంటుంది. ఈ సాంగ్ క్రియేటర్స్ చనిపోయినా వారి కుటుంబాలకు ఆనాటినుండి 30 ఏళ్ళ పాటు రాయల్టీ దక్కుతుంది…
రాయల్టీ కట్టని వారిపై ఈ ముగ్గురూ కలిసి గానీ, విడివిడిగా కానీ కేసు వేయొచ్చు. పాటకు సంబంధించి.. ఆ పాటను సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్ కు, వ్రాసిన వారికి, ఆ హక్కులను కొన్న కంపెనికి చెందుతాయానే చట్టం ఇప్పటిది కాదు. 1970 కిందటి నుండే ఉండిన చట్టం…
అయితే అప్పట్లో వీరి దగ్గర, అంటే IPRS వారి దగ్గర వీటిని ఎవరు వాడుకుంటున్నారో తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉండేది. అందుకే మనం వినలేదు. ఇప్పుడు గత 10 ఏళ్ళ లోనే అన్ని ఛానల్స్ ను ఓ కంట కనిపెడుతూ, ఎవరు ఎన్నిసార్లు వాడారన్న కౌంట్ చేసే సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాతే వీళ్ళకు తెలిసీ, పర్మిషన్ లేకుండా వాడుకున్న వారిపై వీరి చర్యలు మనకు తెలుస్తున్నాయి…
ఆస్కార్ దాకా ఇదే కథ ఉన్నట్టుంది… అదేదో పిచ్చ నాటు పాటకు కీరవాణికి, చంద్రబోస్‌కు అవార్డులిచ్చారు తప్ప ఆడినోళ్లకూ లేదు, పాడినోళ్లకూ లేదు, ఆడించినోళ్లకూ లేదు… దిక్కుమాలిన పద్ధతి…
త్వరలోనే… హైలెవెల్ కుటుంబాల పెళ్లిళ్లలో జరిగే సంగీత్ లలో వాడే పాటలకూ రాయల్టీ వర్తించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట… ఆ పెళ్లిళ్లలో.. ప్రతి ఒక్క సర్వీస్ కూ పేమెంట్ చేస్తున్నప్పుడు.. ఎంటర్ టైన్ మెంట్ కు వీళ్ళ క్రియేషన్ అయిన పాటలను వాడుకొని ఎంజాయ్ చేసినప్పుడు ఎందుకు పేమెంట్ చేయకూడదు అని వీరి పాయింట్…
Share this Article