కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ గురించి మనం మొన్నామధ్య చెప్పుకున్నాం కదా… అసలు చిత్రోత్సవం వార్తలకన్నా అక్కడ చిత్ర విచిత్రమైన డ్రెస్సులతో హొయలుపోయే క్యాట్ వాక్‌ల గురించి… వరుసగా 21 సార్లు వెళ్లిందట ఐశ్వర్యారాయ్ అక్కడికి… చేయి విరిగినా కట్టుకట్టుకుని, దాన్ని కూడా ప్రదర్శిస్తూ వాకింది ఐశ్వర్యా… సరే, బోలెడుమంది అందగత్తెలు, వుమెన్ సెలబ్రిటీలకు అదొక ఫ్యాషన్ పరేడ్…
కానీ మనవాళ్లు అక్కడికి వెళ్లి ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేయడమే తప్ప… ఆ చిత్రోత్సవంలో ఎప్పుడైనా చిన్నదైనా ఒక్కటైనా అవార్డు పొందారా…? లేదు, వాళ్ల దృష్టంతా ఆ ఫ్యాషన్ హడావుడిపైనే కదా… కానీ తొలిసారి ఇండియాకు చెందిన ఓ నటి ఈసారి ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది… సూపర్ కదా… ఎస్, ఆమె పేరు అనసూయ…
అనసూయ అనగానే మీరు ఎక్కడికో వెళ్లిపోకండి, ఆమెకు అంత సీన్ లేదు… ఈమె పేరు అనసూయ సేన్‌గుప్తా… సేన్‌గుప్తా అంటేనే సమాజైంది కదా, కోలకత్తా పిల్ల… ఈమె ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్, ఇప్పుడు గోవాలో ఉంటోంది… ది షేమ్‌లెస్ అనే సినిమాలో రేణుక అనే పాత్రలో నటించినందుకు ఆమెకు అన్ సర్టెన్ రిగార్డ్ అనే కేటగిరీలో ఈ అవార్డు దక్కింది… ఏదో ఓ దిక్కుమాలిన అవార్డు, కేటగిరీ పేరు… కప్పు కొట్టిందా లేదా… ఆమె మొహం గర్వంగా నవ్విందా లేదా..?
Ads
ఈ సినిమాకు దర్శకుడు ఒక బల్గేరియన్… పేరు బొజనోవ్… ఈ ఇద్దరూ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్… హఠాత్తుగా ఓరోజు నీ ఆడిషన్ టేపు పంపించు అన్నాడు… ఈ సినిమాలోకి తీసేసుకున్నాడు… అలా నటి అయిపోయింది… కొడితే ఏకంగా కేన్స్ అవార్డు ఒడిలో పడింది…
ఈ సినిమాలో ఆమె ఓ వ్యభిచారిణి… ఏదో సందర్భంలో ఓ పోలీసును కత్తితో పొడిచి వ్యభిచార గృహం నుంచి తప్పించుకుంటుంది… ఇక్కడ ఆ సినిమా కథ జోలికి వెళ్లడం లేదు… కానీ ఈ అవార్డు పొందిన తొలి ఇండియన్ నటి అని తెలియగానే ఉబ్బితబ్బిబ్బవుతోంది… సమాజం చీదరగా చూసే ఆ కమ్యూనిటీకి ఈ అవార్డు అంకితమిస్తున్నాను అంటోంది… గుడ్… ప్రౌడ్ ఇండియన్ గరల్…
Share this Article