సో వాట్..? దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఓ వారస హీరో… అందరిలాగే ఉద్వేగరహితుడు… వాళ్లదే సినిమా… నిర్మాణం నుంచి పంపిణీ దాకా… హీరో దాకా… అన్నీ వాళ్లే… సో వాట్..? బాగుండాలని ఏముంది..? ఏదో ఓ దిక్కుమాలిన స్టోరీ లైన్… దాన్ని అత్యంత గందరగోళంగా అటు పీకి, ఇటు పీకి… సాగదీసి… చితగ్గొట్టి… చివరకు ప్రేక్షకుడిని చావగొట్టారు…
డబ్బులున్న సినిమా వ్యాపారికి… సినిమా ఇండస్ట్రీని శాసించే వ్యాపారికి మంచి టేస్ట్ ఉండాలని ఏమీ లేదు… దిల్ రాజు అతీతుడు ఏమీ కాదు… జస్ట్, తనొక వ్యాపారి మాత్రమే… తానేమీ కళాఖండాలు తీసి ఉద్దరించే కేరక్టరేమీ కాదు… కనీసం ఆ కమర్షియల్ వాల్యూస్ అయినా పాటిస్తున్నాడా అంటే తమ సొంత సినిమాకే అవి కనిపించడం లేని దురవస్థ…
ఛ, నిజానికి లవ్ మి అనే ఈ సినిమా గురించి ఒక రివ్యూ వేస్ట్… కానీ దిల్ రాజు సినిమా అనేసరికి ఓ ఇంట్రస్ట్ క్రియేటవుతుంది కదా… తన అన్న కొడుకు ఆశిష్ రెడ్డి ఈ సినిమాలో హీరో… గతంలోనే ఓ డెబ్యూ సినిమా కొట్టేసినట్టుంది… పోనీ, ఇదయినా అనుకుంటే, ఇది మరింత దయనీయం..?
Ads
వందల కోట్ల టర్నోవర్‌తో పెద్ద పెద్ద హీరోలను ప్రమోట్ చేసి, మోసి, పైసలు లెక్కపెట్టుకునే దిల్ రాజుకు సొంత అన్న కొడుకు అంటే లెక్క లేకపోవడం ఏమిటో అర్థం కాదు… ఈ సినిమా తీరు చూస్తేనేమో ఏ రీతిలోనూ లేదు… ఇదొక పిచ్చి టేస్ట్… దెయ్యాన్ని పడేయడం ఏమిటో, లవ్వడం ఏమిటో, పెళ్లడం ఏమిటో ఓపట్టాన జీర్ణం కాదు… పోనీ, ఏమైనా జస్టిఫికేషనో మన్నో మశానమో ఉందాంటే అదీ లేదు…
కాకపోతే ఒక్క రిలీఫ్ ఏమిటంటే… అంతటి ఫేమస్ దిల్ రాజు ఫ్యామిలీ కదాని పెద్ద పెద్ద హీరోలకు దీటుగా స్టంట్స్, స్టెప్స్, గ్రూప్ డాన్స్, ఇమేజీ బిల్డప్పులు, తొక్కాతోలూ ఏమీ లేవు… ఆ దుర్వాసనలేమీ లేవు… ఉన్నదంతా జస్ట్, స్మశానంలో ఘాటుగా సోకే ఆత్మలు, ప్రేతాత్మలు, దెయ్యాల వాసనే…
కీరవాణి ఆస్కార్ విజేత అట… ఈ సినిమా చూడండి, ఎంత పేలవంగా, నాసిరకంగా మ్యూజిక్ ఇచ్చాడో, అసలు ఈయనేనా ఆ ఆస్కారుడు అనిపిస్తుంది… ఏమో, రాజమౌళి సినిమాలకు సొంతంగా బుర్ర ఉపయోగిస్తాను తప్ప ఇక మిగతా సినిమాల పని తన అసిస్టెంట్లకు అప్పగిస్తున్నాడేమో… థియేటర్ వదిలాక ఒక్క పాట గుర్తుంటే ఒట్టు…
పోనీ, దెయ్యంతో పెళ్లి అనేది పెద్ద నావెల్ పాయింటేమీ కాదు, మొన్నీమధ్యే ఏదో సినిమాలో కనిపించిందే… ఏదో కామెడీకి అక్కరకొచ్చే సబ్జెక్టు అది… దాన్ని సీరియస్‌గా జనం నెత్తికి రుద్దారు… ఈ సినిమాలో కాస్త చూడబుల్ ఏమిటంటే హీరోయిన్ వైష్ణవి చైతన్య… నిజంగా ఆమెకు మంచి పాత్రలు పడాలే గానీ ఇంకా బాగా హైలైట్ అవుతుంది, పక్కా…
కాగితాలపై సీన్లు, స్క్రీన్ ప్లే, కథ, కథనం బొంగూభోషాణం ఏం రాసుకున్నారో గానీ… శుభం కార్డు పడేవరకూ అసలేం జరుగుతుందో అర్థం కాదు… పదే పదే చెప్పుకుంటాం కదా… తీసేవాడికి చూసేవాడు లోకువ అని… మరో పర్‌ఫెక్ట్ ఉదాహరణ… సినిమా టైటిల్ లవ్ మి, If you dare అనేది ట్యాగ్ లైన్… సింపుల్‌గా చెప్పాలంటే… వాచ్ మి, If you dare…
Share this Article