…… మనం చెప్పుకున్నదే కదా… తెలుగునాట మీడియా వార్ ఎలా నడుస్తున్నదో… ఏపీలో యెల్లో వర్సెస్ నాన్-యెల్లో మీడియా… తెలంగాణలో పింక్ వర్సెస్ ఆరెంజ్ మీడియా… క్లారిటీ కావాలా..?
యెల్లో మీడియా అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఎట్సెట్రా… నాన్ యెల్లో మీడియా అంటే సాక్షి… జగన్ విసిరే యాడ్స్‌తో రాజీపడి అవసరార్థం భజన చేసే ఆంధ్రప్రభ, ప్రజాశక్తి ఎట్సెట్రా ఎప్పటికప్పుడు రంగులు మార్చే కేటగిరీ… ఈమధ్య పోలవరంపై యెల్లో మీడియా రాతల బట్టలు విప్పిన సాక్షి ఈరోజు మరింతగా విరుచుకుపడింది… ఏకంగా రామోజీరావు పేరు రాస్తూ, రంగులు పూస్తూ, ఉద్దేశాలు ఆపాదిస్తూ… ఇదీ ఆ వార్తాకథనం…
…. సరే, సాక్షి చేయాల్సి పనే ఇది… తత్వం ఇన్నేళ్లకు బోధపడింది దానికి… ఏపీ మీడియా కులసమరాలు, రంగులపోరాటాలు వదిలేస్తే… కాస్త తెలంగాణకు వద్దాం… ఇన్నాళ్లూ ఇక్కడ పింక్ మీడియాదే పెత్తనం… భయమో, భక్తో జీహుజూర్ అనాల్సిందే మీడియా అయినా… ఇంకెవరైనా… కానీ ఎప్పుడైతే బీజేపీ దూకుడు మోడ్‌లోకి వచ్చేసిందో ఇక ఏ మీడియా హౌజు ఎటువైపో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చేసింది…
Ads
మాట్లాడితే యెల్లో మీడియాను మించిన నీతులు చెప్పే మీడియా కూడా… అవసరార్థం కాషాయం నిండా పులుముకుని, జజ్జనకరి అంటోంది… ఆంధ్రజ్యోతి, ఈనాడులను మించిన పోకడలతో ఆర్నబ్ గోస్వామి తాతను అని నిరూపించుకుంటోంది వెలుగు, వీ6… తప్పుపట్టడానికి ఏమీ లేదు… అలా చేయకపోతేనే తప్పు ఇప్పటి ట్రెండ్స్‌లో…
అసలే గ్రేటర్ ఎన్నికల వేడి… ఇక తప్పేదేముంది..? తప్పొప్పుల మీమాంస ఎక్కడిది..? ఓ కాషాయపు కొరడా పట్టుకుని పోతరాజులా కొట్టేసుకోవడమే… అదే సాగుతోంది… సరే, విషయానికొస్తే… నమస్తే తెలంగాణలో నిన్న ఓ వార్త వచ్చింది… అది ప్యూర్ కేసీయార్ సొంత పత్రిక కాబట్టి దానికి స్వామివారి భజన తప్ప ఇంకేమీ పట్టదు, ఆ దారి నుంచి మళ్లదు, మళ్లితే అది తనకు మాలిన ధర్మం అవుతుంది… ఇదీ ఆ వార్త…
దీని సారాంశం ఏమిటంటే…? బండి సంజయ్ సెలుపుతున్న మతం ఇష్యూ ఉంది కదా… ఒకవేళ బీజేపీ గనుక గెలిస్తే హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్యలు వస్తాయా అనేది ప్రశ్న… దీనిపై వీ6 ట్విట్టర్, యూట్యూబుల్లో ఓ పోల్ నిర్వహించింది… అయితే ఎక్కువ మంది కేసీయార్‌కు అనుకూలంగా స్పందించడంతో వీ6 అర్థంతరంగా పోల్ ముగించేసింది, తోకముడిచింది అనేది నమస్తే తెలంగాణ కథనం…
నిజంగానే వీ6 ట్విట్టర్లో ఆ పోల్ అర్థంతరంగా ముగించింది అనేది నిజం… కానీ దీన్ని ఎక్స్పోజ్ చేయడంతో వెలుగు, వీ6 మీడియా హౌజుకు కోపం తన్నుకొచ్చింది… ఎహె, మీ కారణంగానే మేం ట్విట్టర్ పోల్ క్లోజ్ చేయాల్సి వచ్చింది, మీరే మానిప్యులేట్ చేయడానికి ట్రై చేశారు, ఐనాసరే, మేం యూట్యూబులో కంటిన్యూ చేశాం, 60 వేల మంది వోట్లు వేశారు, 72 శాతం మంది టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వోట్లు వేస్తే, 28 శాతం మందే టీఆర్ఎస్ వాదను సై అన్నారు… ఐనా సరే, ఈ నమస్తే వాడికి బుద్ధిలేదు, సిగ్గులేదు… పోల్‌ను మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించడమే గాకుండా అన్నీ అబద్ధాలతో కూడిన వార్త రాసుకున్నారు….. అంటూ తన వెలుగు దినపత్రికలో ఓ ఫస్ట్ పేజీ వార్త కుమ్మేసింది…
టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం ఎలా తప్పులో కాలేసిందో సవివరంగా ఆ వార్తలో రాసుకొచ్చింది… నమస్తే రాసింది తప్పేమీ కాదు, వీ6 ఆ ట్విట్టర్ పోల్ ఆపేసింది అనే రాసింది… నమస్తే టీం కారణంగానే ఆపేశాం అని వెలుగు కూడా అంగీకరిస్తూనే ఉంది… ఈ సీన్ ఇక్కడ కట్ చేద్దాం…
మనం చెప్పుకునేది మీడియా అనేది పార్టీలపరంగా ఎలా చీలిపోయింది అనేదే… తెలుగు మీడియా ఏదీ రంగుల ప్రభావానికి మినహాయింపు కాదు.,. అన్ని పత్రికలు, అన్ని టీవీలూ అదే బాట… ఎవరూ శుద్ధపూస కాదు… కాకపోతే బయటికి నీతులు చెబుతాయి… గ్రేటర్ ప్రజలు కేసీయార్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారా లేదా అనేది కాదు ఇక్కడ ఇష్యూ… మీడియా వెన్నుపూసలు విరిగిపోయి, అవి నేల మీద పాకుతున్న చప్పుడు,.. సో, నీతులు చెప్పకండి… నిజాలు దరిద్రంగా ఉన్నయ్…!!
Share this Article