!
ఇజ్రాయెల్ ఈజిప్ట్ మధ్య కాల్పులు!
ఇజ్రాయెల్ కి చెందిన సైనికులు, ఈజిప్టు సైనికుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి కొద్ది గంటల క్రితం!
ప్రదేశం: గాజాలోని రఫాలో ప్రస్తుతం IDF దాడులు చేస్తున్నది.
రఫా పట్టణం ఈజిప్టు దేశ సరిహద్దుల దగ్గర ఉంది.
ఈజిప్ట్ నుండి గాజా లోకి దారి ఉంది కానీ సరిహద్దు చెక్ పోస్టును మాత్రం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ఆధీనంలో ఉంటుంది!
అసలేం జరిగిందంటే…
హమాస్ ఉగ్ర సంస్థకి సంబంధించిన నాయకులు, హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించే లక్ష్యంతో IDF గాజాలో రఫా పట్టణం మీద దాడి మొదలు పెట్టింది పది రోజుల క్రితం!
రఫా పట్టణం చివరి టార్గెట్ IDF కి!
హమాస్ ఉగ్ర నాయకులతో పాటు బందీలు కూడా రఫా పట్టణంలో ఉండాలి కాని వేరే దారి లేదు. ఎందుకంటే మొత్తం గాజా స్ట్రిప్ ను జల్లెడ పట్టింది IDF ఒక్క రఫాను తప్ప!
రఫా పట్టణం ఈజిప్ట్ కి దగ్గరగా ఉండడం వలన IDF కి అక్కడ చివరలో సెర్చ్ ఆపరేషన్ చేయాలని అనుకుంది.
రఫాకి ఆనుకొని ఈజిప్ట్ 13 అడుగుల ఎత్తులో కంచె నిర్మించింది గాజా నుండి ఎవరూ ఈజిప్ట్ లోకి ప్రవేశించకుండా.
ఈజిప్ట్ ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోదు అని ఇజ్రాయెల్ నమ్మింది!
Ads
ఈజిప్టు నమ్మక ద్రోహం!
ఇజ్రాయెల్ నమ్మకం ఏమిటంటే ఈజిప్టు గాజాలో ఎలాంటి ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వదు అని!
కానీ ఈజిప్ట్ చాల పకడ్బందీగా మోసం చేసింది ఇజ్రాయెల్ ను.
పది రోజుల క్రితం IDF రఫా పట్టణంలో సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టినప్పుడు సొరంగ మార్గాలు బయట పడ్డాయి. అయితే గాజాలో మొత్తం 400 km ల సొరంగాలు తవ్వారు హమాస్ ఉగ్ర వాదులు, అవి గాజాకే పరిమితం అనుకున్నారు ఇన్నాళ్ళూ!
కానీ…
రఫాలో బయట పడ్డ కొన్ని సొరంగాలు ఏకంగా ఈజిప్ట్ దేశంలోకి దారి చూపిస్తున్నాయి.
2023 అక్టోబర్ 10 న IDF మొదలు పెట్టిన సైనిక చర్యలో ఇప్పటి వరకూ హమాస్ ముఖ్య నాయకులు కానీ వాళ్ళ చెరలో ఉన్న బందీలు కానీ ఎవరూ దొరకలేదు ఎందుకనీ?
హమాస్ ముఖ్య నాయకులతో పాటు బందీలను కూడా సొరంగ మార్గాల ద్వారా ఈజిప్ట్ కి తరలించి ఉంటారు అని భావిస్తున్నది IDF.
అయితే ఇప్పటికిప్పుడు ఈజిప్ట్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు IDF కానీ ఇజ్రాయెల్ దేశ రాజకీయ నాయకులు కానీ.
నిజం ఏమిటో కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నా అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ కి మద్దతు తెలపక పోగా పైగా వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి మరియు జరుగుతున్నాయి ఇప్పటికీ.
అక్టోబర్ 7,2023 న హమాస్ చేసిన ఉగ్ర దాడిలో 1500 మంది ఇజ్రాయెల్ పౌరుల హత్య జరిగినా, 250 మందిని బందీలుగా హమాస్ తీసుకెళ్లినా ఏదో ఫార్మల్ గా సంతాపం తెలిపి చేతులు దులుపుకున్న ప్రపంచ దేశాలు బందీలను విడిపించె ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్ సైనిక చర్య తీసుకుంటుంటుంటే మాత్రం మానవ హక్కులు అని గొడవ చేస్తున్నాయి.
చాలా రహస్యంగా, ప్లాన్డ్ గా జరుగుతున్న వ్యవహారం!
పది రోజుల క్రితం IDF RAFA మీద దృష్టి పెడుతుంది అని ముందస్తుగా అమెరికా, బ్రిటన్, జెర్మనీ దేశాలలో ఇజ్రాయెల్ వ్యతిరేక, హమాస్ అనుకూల ప్రదర్శనలు ఉధృతం చేశారు.
అంటే రఫా నుండి ఈజిప్ట్ లోకి ఉన్న సొరంగాల సంగతి బయటపడుతుంది అని తెలిసీ ముందస్తుగా అమెరికా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి సెర్చ్ ఆపరేషన్ ను ఆపేయించాలి అని ప్లాన్!
కానీ విషయం బయటపడ్డది.
సొరంగాలు ఈజిప్ట్ లోకి దారి తీస్తున్నాయి అన్న విషయం మీద అంతర్జాతీయ మీడియా స్పందన ఎలా ఉంది అంటే అదేదో మమూలుగా జరిగే వ్యవహారం అన్నట్లుగా ఉంది తప్పితే ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు.
నిన్న అంటే, సోమవారం 27-05-2024 న ఈజిప్ట్ సైనికులు IDF సైనికుల మీద కాల్పులు జరిపారు Rafah చెక్ పోస్టు దగ్గర. ప్రతిగా IDF సైనికులు కూడా కాల్పులు జరిపారు.
ఈజిప్ట్: ఇజ్రాయేల్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నది.
ఇజ్రాయెల్: ముందు ఫైరింగ్ ఓపెన్ చేసింది ఈజిప్ట్ సైనికులే.
ఈ కాల్పులలో ఒక ఈజిప్టు సైనికుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
Times of Israel మరియు Al Jazira లు ఈ వార్తని రిపోర్టు చేశాయి.
రఫాలో సొరంగ మార్గాలు ఈజిప్ట్ లోకి వెళ్తున్నాయి అనే అక్కసుతో IDF సైనికులు మొదట కాల్పులు జరిపి ఉండవచ్చు అనే అనుమానాన్ని ప్రపంచ దేశాలలో కలుగచేయటం అనేది ఒక ప్లాన్!
కాంప్ డేవిడ్ ఒప్పందం నుండి ఇజ్రాయెల్ వైదొలుగుతుందా?
The Camp David Accords!
1967 లో అరబ్ దేశాలకి ఇజ్రాయెల్ కి మధ్య జరిగిన 6 రోజుల యుద్ధం ( Six days war – June 5 – 11, 1967) లో ఇజ్రాయెల్ 70 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. సిరియా నుండి గొలన్ హైట్స్, జోర్డాన్ నుండి వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, ఈజిప్ట్ నుండి సినాయ్ ద్వీపకల్పం ( Sinai Peninsula) లు ఉన్నాయి.
మళ్ళీ యెంమ్ కిప్పూర్ యుద్ధంలో కూడా అరబ్ దేశాలు ఓడిపోయాయి ఇజ్రాయేల్ దేశం చేతిలో.
సెప్టెంబర్ 17, 1978 లో అమెరికాలోని కాంప్ డేవిడ్ లో ఈజిప్ట్ అద్యక్షుడు అన్వర్ సాదత్, ఇజ్రాయేల్ ప్రధాని మేనచెమ్ బెగిన్ ల మధ్య శాంతి ఒప్పందం జరిగింది అప్పటి అమెరికా అద్యక్షుడు అయిన జిమ్మీ కార్టర్ సమక్షంలో. దీనిని కాంప్ డేవిడ్ ఒప్పందం అని పిలుస్తారు.
అయితే రెండు ఫ్రేం వర్క్ లు ఫిక్స్ అయ్యాయి.
మొదటి ఫ్రేమ్ వర్క్ లో ఇజ్రాయెల్ ఈజిప్ట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉండడం, శాంతియుతంగా చర్చలు జరిపి ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవాలి.
తరువాత ఈజిప్టు అద్యక్షుడు అన్వర్ సాధత్ ఇజ్రాయేల్ దేశంలో పర్యటించడం, శాంతి ఒప్పందం జరిగింది.
శాంతి ఒప్పందం జరగడం వల్ల ఇజ్రాయేల్ ప్రధాని మేనచెమ్ బేగిన్, ఈజిప్ట్ అద్యక్షుడు అన్వర్ సాదత్ లకి ఉమ్మడిగా నోబెల్ శాంతి బహుమతి లభించింది!
అన్వర్ సాదత్ ఇజ్రాయేల్ దేశంలో పర్యటించడం ఇష్టం లేని ఈజిప్ట్ లోని జిహాదీ గ్రూపులు అన్వర్ సాదత్ ను హత్య చేశారు.
ఇదీ క్లుప్తంగా కాంప్ డేవిడ్ ఒప్పందం!
నిన్నటి ఈజిప్ట్ ఇజ్రాయెల్ దేశాల మధ్య జరిగిన కాల్పుల ఘటన చిన్నదే అయినా ముందు ముందు రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది.
అయితే ఇటు ఇజ్రాయెల్ కానీ అటు ఈజిప్ట్ కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి యుద్ధం చేయాలి అంటే!
ప్రస్తుత ఈజిప్ట్ 70 లలో ఉన్న ఈజిప్ట్ కాదు ఇజ్రాయేల్ దేశం ముందు మోకరిల్లడానికి.
ఈజిప్ట్ ఇప్పుడు అరబ్ దేశాలలో శక్తివంతమైన మిలటరీ శక్తిగా ఎదిగింది.
రాఫేల్, F-16, Su – 35 లాంటి మోడరన్ ఫైటర్ జెట్ లతో పాటు 260 M1A1 యుద్ధ టాన్కులతో పటిష్టంగాఉంది.
ఈజిప్ట్ కి తెలిసే హమాస్ సొరంగాలు తవ్విందా? ఈజిప్ట్ హమాస్ కి సహకరించిందా అనే విషయాలను నిర్ధారించుకున్న తర్వాతే ఇజ్రాయెల్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది!
So! యుద్ధం మెల్లగా విస్తరించే అవకాశం ఉంది!
చైనా – తైవాన్ ల మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
నిన్న కొత్తగా ఈజిప్ట్ ఇజ్రాయేల్ మధ్య ఘర్షణ….. (Article By Potluri Parthasarathi)
Share this Article