ముందుగానే ఓ డిస్‌క్లెయిమర్… మన దేవాదాయ, ధర్మాదాయ శాఖలు అచ్చంగా హిందూ దేవుళ్ల ఆదాయాన్ని సుబ్బరంగా భోంచేయడానికి తప్ప ఎందుకూ పనికిరావు… పనికిరాని శాఖల్లో నంబర్ వన్ శాఖ అదే… ఐనాసరే, ఏ ప్రభుత్వమూ దాన్ని రద్దు చేయదు… గుడి పఢావు పడినా సరే ఆ శాఖ మాత్రం పచ్చగా కళకళలాడుతూ ఉండాల్సిందే… ఒక మత సంస్థలపై సర్కారు పెత్తనం ఏమిట్రా అని ఎవడూ అడగడు…! ఇక అసలు స్టోరీకి వద్దాం… అసలు లెఫ్ట్ పార్టీలు అంటేనే హిందూ వ్యతిరేకం కదా… అందులోనూ సీపీఎం అంటే కరడుగట్టిన హిందూ వ్యతిరేకి… వేరే మతమైతే పర్లేదు దానికి… కేరళలో వాళ్లదే కదా ప్రభుత్వం… గుళ్ల మీద, అర్చకుల మీద, హిందూ మనోభావాల మీద ఎనలేని మంట దానికి… ఈ మాట అంటే పార్టీ కూడా ఖండించదు, దాన్ని ఓ సర్టిఫికెట్టుగా భావిస్తుంది… రెండేళ్ల క్రితం ఓ గుడిలో ఏం జరిగిందంటే..?
వడక్కంచెర్రి, మచ్చడ్, తిరువణికావు భగవతి గుడి… అక్కడ ఓ ప్రధాన పూజారి… పేరు సురేష్ ఎంప్రాతిరి… ఓరోజు ఒకాయన వచ్చాడు గుడికి… దర్శనం చేసుకున్నాడు… హారతిపళ్లెం దగ్గర కనిపించిన రంగు దారాలు చూి… (కాశిదారం, దిష్టిదారం, కంకణం పేరు ఏదయినా సరే…) అయ్యా ఇది ఎంతకు ఇస్తారు అనడిగాడు… రశీదు కూడా అడిగాడు… ఆ పూజారి ఆయన చేతికి దాన్ని కట్టాడు… వీటికి రేట్లు ఉండవు, వీటిని అధికారికంగా ఎవరూ అమ్మరు, రశీదులు గట్రా ఏమీ ఉండవు అన్నాడు… దక్షిణగా మీకు ఎంత తోస్తే అంతివ్వండి అన్నాడు… 20 రూపాయలు ఇస్తే తీసుకున్నాడు… అంతే… ఓ భారీ స్కాం బద్ధలైనట్టు… ఓ భారీ అప్రాచ్యపు పనికి ఆ పూజారి పాల్పడ్డట్టుగా… ఆ ఆగంతకుడు పెద్ద ఇష్యూ చేశాడు… తన గుళ్ల విజిలెన్స్ మనిషట… ఈ కోటానుకోట్ల కుంభకోణాన్ని బరస్ట్ చేశాడట… తక్షణం ఆ పూజారిని సస్పెండ్ చేసిపారేశారు… గుడిలోని దేవుడు జాలిగా చూస్తూ ఉండిపోయాడు…
Ads
సదరు అర్చకుడు పలు రిక్వెస్టులు పెట్టుకుని, ఎవడూ గోడు వినిపించుకునేవాడు లేక… ఇక కోర్టుకు పోయాడు… తిరిగీ తిరిగీ అది కేరళ హైకోర్టుకు వచ్చింది… ‘‘అయ్యా, భగవతి గుడి అంటే భక్తులకు ఈ పవిత్ర దారాల్ని ఇవ్వడం అత్యంత సాధారణం… పీడకలలు, భయాల నుంచి రక్షణగా అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన దారాల్ని భక్తులకు కట్టడం కూడా సాధారణమే… భక్తులు ఇచ్చే దక్షిణను స్వీకరించడం కూడా పూజారి హక్కు… ఇందులో మోసం ఏముంది..? భక్తుల్ని పీడించి వసూలు చేయడం లేదు కదా’’ అనేది పూజారి వాదన… హైకోర్టు దాన్ని అంగీకరించింది… సదరు అర్చకుడి సస్పెన్షన్ ఆర్డర్‌ను కొట్టిపారేసింది… ‘‘దక్షిణ వద్దనడానికి నువ్వెవడివోయ్…’’ అని ఆ గుడిపై పెత్తనం చేసే కొచ్చిన్ దేవస్వామ్ బోర్డుకు తలంటింది… ప్చ్, పాపం, అంతటి భారీ కుంభకోణాన్ని బరస్ట్ చేసిన ఘనత దక్కనందుకు సీపీఎం ప్రభుత్వం, సదరు దేవాదాయ శాఖ తెగ బాధపడిపోతున్నాయట..!! ఇంతకీ ఈ హైకోర్టు తీర్పు మీద పినరై విజయన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందా..? 20 రూపాయలు కాదు కదా, 20 పైసల అవినీతిని కూడా సహించని అత్యంత పవిత్ర ప్రభుత్వ విశిష్టతను నిలుపుకుంటుందా..? సుప్రీంకోర్టు మరో శబరిమల తీర్పు స్థాయిలో ఆగమేఘాల మీద తీర్పులు వెలువరిస్తుందా..? చూస్తూనే ఉండండి…!! (అవునూ, కేసీయార్ ఎప్పుడూ ఓ మాట అంటుంటాడు… ఏమిటది…? థూమీబచె… అదే కదా…)
Share this Article