నో డౌట్… బిగ్‌బాస్ కొందరు ప్రేక్షకులకైనా సరే నచ్చే ప్రోగ్రాం… అనేకానేక రియాలిటీ షోలలో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో హిట్టయిన కాన్సెప్టు అది… కాకపోతే తెలుగులోకి వచ్చేసరికి సరైన ఎంపికలు లేక, లోకల్ క్రియేటివ్ టీం పైత్యంతో దాన్ని మరీ ప్రశాంత్, శివాజీ, యావర్ వంటి చిరాకు కేరక్టర్లతో భ్రష్టుపట్టించి విసుగు పుట్టించారు…
ప్రశాంత్ రైతుద్రోహి, ఎవ్వడికీ రూపాయి సాయం చేయలేదు అనే వార్తలు నవ్వొచ్చాయి… బిగ్‌బాస్‌లో వోటింగ్ కోసం లక్ష చెబుతారు, పైగా శివాజీ వంటి కేరక్టర్ తోడుగా ఉన్నప్పుడు ఏవో కథలు పడ్డాడు శివాజీ… నోరిప్పితే అబద్ధాలు… ఇలాంటోళ్ల కోసం వీథుల్లో ఘర్షణలు, కార్ల ధ్వంసాలు, పోలీసు కేసులు, ఉద్రిక్తతలు… ఆ కేసులు తెగేదీ లేదు, ఎవడికీ శిక్ష పడేది లేదు… ఒక్కడికి పగిలిపోతే, ఇకపై ఎవడూ వీథుల్లో మళ్లీ వీరంగం వేయకుండా ఉండేదేమో… కానీ పోలీసులకు చేతకాలేదు…
అదే స్టార్ మాటీవీలో అదే భ్రష్టుపట్టించబడిన బిగ్‌బాస్ షోతో పోలిస్తే నీతోనే డాన్స్ ప్రోగ్రాం కాస్త బెటర్ అనిపిస్తుంది… బిగ్‌బాస్, ఇతర చిట్‌చాట్, కిట్టీ పార్టీ షోలలో ఏముంది..? నాలుగు నవ్వులు, నలభై ఆరు పంచులు, ఇకిలింతలు… సుమ షోలన్నీ అవే కదా… వాటితో పోలిస్తే నీతోనే డాన్స్ కష్టం, క్లిష్టం… టీవీ సెలబ్రిటీలు, సీరియల్ నటులు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఎట్సెట్రా ఎంపిక చేసుకుని…
Ads
మన పెళ్లి సంగీత్‌లకు అందరికీ శిక్షణలు ఇచ్చి డాన్సులు చేయిస్తారు కదా… అలాగే ఇక్కడా సెలబ్రిటీలను రుద్దుతారు, మెరుడుపడతారు, రిహార్సల్స్ చేయిస్తారు, సర్కస్ ఫీట్లు నేర్పిస్తారు… సెట్టింగ్, డాన్స్ కంపోజింగ్, లుక్కు, ఈజ్, ఎనర్జీ అన్నీ ముఖ్యమే… ఏక్ సే ఏక్ రూపుదిద్దుతున్నారు… ఇవ్వాళ్రేపు టీవీ సెలబ్రిటీ కావడం, నిలదొక్కుకోవడం, నాలుగు డబ్బులు సంపాదించుకోవడం అంత వీజీ కాదు, అందరూ పల్లవి ప్రశాంత్‌లు కాదు కదా…
ఈటీవీలో ఢీ పేరిట చాలా ఏళ్లుగా డాన్స్ షో వస్తుంది… కానీ ప్రొఫెషనల్ డాన్సర్స్… కష్టమైన స్టెప్పులనైనా అథ్లెట్లు, జిమ్నాస్టుల్లా చేసుకుంటూ పోతారు… కానీ సెలబ్రిటీలను కూడా ప్రొఫెషనల్ డాన్సర్లుగా మార్చి, ఢీని మించి ఎపిసోడ్లు రూపుదిద్దుతున్నారంటే స్టార్ మాటీవీ క్రియేటివ్ టీమ్‌ను మెచ్చుకోవచ్చు… రేటింగ్స్ జానేదేవ్… ఇది మన ఎఫర్ట్ సత్తా ఏమిటో చూపించుకోవడం… జీతెలుగువాడికి రియాలిటీ షోలు చేతకావు, జెమిని ఇంకా ఫీల్డులో ఉండటమే గొప్ప, ఈటీవీ డాన్స్ షో ఎప్పుడో మసకబారింది… అదీ స్టార్ మావాడికి కలిసొచ్చింది…
ఒకప్పటి హీరోయిన్ రాధ, సదా యంగ్ సదా, చించేసే తరుణ్ మాస్టర్ జడ్జిలు… శ్రీముఖి హైపిచ్ అరుపులే కాస్త చికాకు, అవినాష్ కామెడీ పర్లేదు… కానీ కంటెస్టెంట్లు పడే శ్రమ నచ్చుతుంది… సరే, వోటింగులు, మార్కులు, ఫేక్ ఉద్రిక్తతలు టీవీ రేటింగులు, ప్రోమోల కోసం… సో, ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఏదో సీరియల్, ఏదో రియాలిటీ షోలో నాలుగు డైలాగులు, వచ్చీరాని కాస్త నటన అనేది ఈరోజు టీవీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సరిపోదు… సరిపోదు… అంకితభావం, శ్రమ, ప్రయాస… అన్నీ అవసరమే…!!
Share this Article