ఏపీ ఎన్నికల రిజల్ట్‌కు సంబంధించి అనేకానేక ఎగ్జిట్ సర్వేలు అంటూ సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి… నిజానికి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ చెబితే జైలుపాలు కావాలి… కానీ ఎవడికిష్టం వచ్చిన ఫిగర్ వాడు రాసేసి ప్రచారంలోకి తీసుకొస్తున్నారు… ప్రామాణికత ఏముంది..? అసలు సర్వే నిజంగా జరిగిందా లేదా ఎవడు చూడొచ్చాడు..? రాసేటోడి చేతికి మొక్కాలి, అంతే…
కేంద్రం విషయానికివస్తే స్టాక్ మార్కెట్ ఆమధ్య ఫుల్లు డౌన్… అయిపోయింది, ఇదే సూచన, బీజేపీ పని మటాష్ అని ప్రచారం పెరిగింది…. ఈమధ్య మళ్లీ స్టాక్ మార్కెట్ పెరిగింది, ఈ నెగెటివ్ ప్రచారంతో చివరకు మోడీ కూడా, జూన్ 4 తరువాత స్టాక్ మార్కెట్ పరుగుల్ని పట్టుకునేవాళ్లే ఉండరని వ్యాఖ్యానించాల్సి వచ్చింది…
ఏదో మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది బీజేపీ… సొంతంగా 370, ఎన్డీయేకు 400 అంటూ… అంత సీనేమీ లేదని అర్థమైంది ఇప్పటికే, కానీ సరిపడా సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే భావన మాత్రం నెలకొని ఉంది… ఏమో, రియాలిటీ ఏమిటో ఎవరూ చెప్పలేరు…
Ads
ఎన్నికల ప్రిడిక్షన్లకు అప్పట్లో ఫలోడీ సట్టా బజార్ ఫేమస్… తనదైన నెట్‌వర్క్‌తో సమాచారం తెప్పించి, క్రోడీకరించి, దాని ఆధారంగా బెట్టింగులు పెడుతుంది అది… మొదట్లో బీజేపీకి సొంతంగానే 330 దాకా వస్తాయని చెప్పిన సదరు బజార్ తరువాత 300కు ఏదో కుదించినట్టుంది… ఇప్పుడు ఇంకా తగ్గించినట్టుంది…
ఎప్పుడైతే ఫలోడీ సట్టా బజార్ పేరుతో బీజేపీ శ్రేణులు ‘మళ్లీ మనదే అధికారం’ అనే ప్రచారం స్టార్ట్ చేశాయో… ఇక కాంగ్రెస్ కూటమి కూడా రకరకాల సట్టా బజార్ల పేర్లతో ఏవేవో నంబర్లు వేసి, టఫ్ ఫైట్, ఇండి కూటమి గెలుపు అవకాశాలు అంటూ మొదలుపెట్టింది ప్రచారం, ఇలా…
Satta Bazar puts the NDA number below the majority marks of 272 and give a near majority to the Congress-led INDIA alliance. Interesting…
Phalodi Satta Bazaar
🔹Congress – 117
🔹INDIA – 246
🔹BJP – 209
🔹NDA – 253
Palanpur Satta Bazaar
🔹Congress – 112
🔹INDIA – 225
🔹BJP – 216
🔹NDA – 247
Karnal Satta Bazaar
🔹Congress – 108
🔹INDIA – 231
🔹BJP – 235
🔹NDA -263
Bohri Satta Bazaar
🔹Congress – 115
🔹INDIA – 212
🔹BJP – 227
🔹NDA – 255
Belgaum Satta Bazaar
🔹Congress – 120
🔹INDIA – 230
🔹BJP – 223
🔹NDA -265
Kolkata Satta Bazaar
🔹Congress – 128
🔹INDIA – 228
🔹BJP – 218
🔹NDA – 261
Vijaywada Satta Bazar
🔹Congress – 121
🔹INDIA – 237
🔹BJP – 224
🔹NDA – 251
Indore Sarafa
🔹Congress – 94
🔹INDIA – 180
🔹BJP – 260
🔹NDA – 283
Ahmedabad Chokha Baar
🔹Congress – 104
🔹INDIA – 193
🔹BJP – 241
🔹NDA -270
Surat Maghobi
🔹Congress – 96
🔹INDIA – 186
🔹BJP – 247
🔹NDA – 282
ఇందులో ఎన్ని నిజమో ఎవరికీ తెలియదు… అంకెలు రాసుకునే పనే కదా… ఇదొక్కసారి చూడండి…
ఏదో సట్టా బజార్ పెద్దమనిషి ఇలా ఫలితాలను రాష్ట్రాలవారీగా క్రోడీకరించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం… ఏకంగా ఎన్డీయేకు 407 సీట్లు ఇచ్చిపారేశాడు, అదే నిజమైతే ఇండి కూటమి నేతలకు కాదు, ముందుగా దాన్ని నమ్మలేక బీజేపీ పెద్ద మొహాలే ఆశ్చర్యపోతాయి… ఒకడు ఆల్రెడీ రాసేశాడు, ఒరేయ్, జమ్ముకశ్మీర్‌లో ఎన్డీయే మూడే స్థానాల్లో పోటీచేస్తే, ఈ నాలుగు సీట్లు ఎలా గెలుస్తుందిరా అని..!
ఆంధ్రప్రదేశ్‌లో 25కు 19 వస్తాయట… అంటే జగన్ ప్రభుత్వం కూడా కూలిపోతుందన్నమాటే కదా… నిజంగా ఆ సిట్యుయేషన్ ఉందా..? చూడాలి..! తెలంగాణలో 17కు గాను ఎన్డీయేకు, అనగా బీజేపీకి సెవన్ ప్లస్ వస్తాయట… ఇది రీజనబుల్ ఫిగరే… బీజేపీ కూడా అదే ఆశిస్తోంది, పేరుకు పది వస్తాయని చెబుతున్నా సరే…! హర్యానాలో పదికి పది అసాధ్యం, పంజాబ్‌లో అయిదు కూడా అసాధ్యమే… కేరళ 3, తమిళనాడు 8 అట… నవ్వొచ్చిందా..? భలేవారే, ఏమో గుర్రమెగురావచ్చు..!!
Share this Article