అవును.., ఈటీవీలో జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ రెండు షోలనూ కలిపేసి ఒకటే జబర్దస్త్‌గా కుదించేసి ప్రసారం చేయబోతున్నారు… ఆ విషయం ప్రోమోల్లోనే స్పష్టం చేశారు… కానీ ఓ ప్రముఖ చానెల్ తన బూతు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్‌ను ఇన్నేళ్లు ఎవరెంత మొత్తుకున్నా, తిట్టిపోసినా కంటిన్యూ చేసి, హఠాత్తుగా ఇలా ప్రేక్షకులను కరుణించడం ఏమిటీ అంటారా..?
సింపుల్, జనం దాన్ని చూడటం మానేశారు… అదే కాదు, ఆ టీవీ రియాలిటీ షోలను ఎవడూ దేకడం లేదు… అందుకే కొత్త ప్రోగ్రాముల కోసం ప్రయత్నం ఇక తప్పడం లేదు… ఈ వారం తాజా బార్క్ రేటింగుల్లోనే చెప్పుకుందాం…
శ్రీదేవి డ్రామా కంపెనీ 3.53, జబర్దస్త్ 2.74, ఎక్సట్రా జబర్దస్త్ 2.67, సుమ అడ్డా, ఆలీతో సరదాగా ఏ ఒకటిన్నర దగ్గరో కొట్టుమిట్టాడుతుంటాయి, లిస్టులో దొరకలేదు, ఢీ 2.30… నిజానికి ఈటీవీ టాప్ 30 ప్రోగ్రామ్స్ లిస్టులో టాప్ 6 ప్లేసుల్లో ప్రైమ్ టైమ్ న్యూస్ బులెటిన్లే… అవి వినోద కార్యక్రమాలు కావు, కాబట్టి వాటిని కూడా తీసేస్తే, చివరకు ఈటీవీ ఏ స్థితిలో ఉందో తెలుసా..? ఒక్కసారి ఈ చార్ట్ చూడండి…
Ads
స్టార్ మా రేటింగ్స్ 757, దాంతో కాస్తో కూస్తో పోటీపడుతున్న జీతెలుగు వాడి రేటింగ్స్ 523… జెమిని వదిలేయండి, చివరకు అది సినిమా చానెళ్లకన్నా దిగజారిపోయింది… ఇక ఈటీవీ..? ఎస్, అదీ జెమిని బాటలోనే… మనం గతంలోనే చెప్పుకున్నాం… మూడో స్థానంలోనూ ముక్కుతూ మూలుగుతూ కొనసాగుతోంది…
జస్ట్, 254 జీఆర్పీలు… అంటే స్టార్ మాటీవీతో పోలిస్తే మూడో వంతు… అంతేకాదు, స్టార్ మా మూవీస్ చానెల్‌కు దీటుగా నిలబడింది ఫాఫం… చివరకు జెమిని మూవీస్ కూడా సేమ్ షేమ్… ఈ స్థితిలో దాన్ని పట్టించుకునేవాడే లేడు, రియాలిటీ షోలన్నీ నాసిరకం, సీరియళ్లు మరీనూ… ఇదిలాగే కొనసాగితే ఇంకెంత దిగజారిపోతుందో, చివరకు దాని న్యూస్ చానెళ్ల బతుకులాగే అయిపోయేట్టుంది…
ఎంతోకొంత బెటర్ చేయడానికి సుడిగాలి సుధీర్‌ను మళ్లీ రప్పించుకుని, అదేదే ఫ్యామిలీ స్టార్స్ అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు… అదీ జస్ట్, ఓ సరదా ప్రోగ్రామ్, జస్ట్ లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ… అక్కడ రష్మి, ఇక్కడ సుధీర్ హోస్టింగ్… కాకపోతే సుధీర్ తన ప్లేబాయ్ ఇమేజీతోనూ హోస్టింగ్ భలే చేస్తున్నాడు కాబట్టి ఫ్యామిలీ స్టార్స్ రక్తికట్టొచ్చు… ఆహా ఓటీటీలో సర్కార్ సీజన్ దుమ్ము రేపుతున్నాడు తను…
నిజానికి ఈటీవీలో మ్యూజిక్, డాన్స్, కామెడీ వంటి వైవిధ్యభరితమైన రియాలిటీ షోలుంటాయి… ఎటొచ్చీ వాటి నాణ్యతే ఎవరికీ పట్టడం లేదు… ఢీ షోలో హైపర్ ఆది కామెడీ విసిగిస్తోంది… రొటీన్ డాన్సులు… ఇక మ్యూజిక్ సంగతి తెలిసిందే… ఆ బాలు కొడుకు ఆ అడుగుల్లో నడక సాగించలేకపోతున్నట్టు కనిపిస్తోంది… కామెడీ షోల గురించి చెప్పుకున్నాం… సుమ అడ్డా అయితే మరీ సినిమా ప్రమోషన్ షో అయిపోయి, సుమ ధోరణి మొనాటనీ వచ్చేసి విసిగిస్తోంది… కొంతవరకూ ఆలీతో సరదాగా బెటరే, కానీ దానికి ప్రేక్షకులు తక్కువ…
సో, ఈ స్థితిలో ఈటీవీకి ఈ జబర్దస్త్, ఈ ఢీ, ఈ సుమ అడ్డా వంటి అనుత్పాదక… అనగా అండర్ రేటెడ్… అనగా యూజ్ లెస్ షోలను వదిలించుకోవడమో, కుదించుకోవడమో తప్పనిసరి అయిపోయింది… జబర్దస్త్ కుదింపు వెనుక ఇంత కథ ఉందనేది మన అంచనా, మన విశ్లేషణ…!!
ఈటీవి ప్రోగ్రామ్స్ ఈటీవి విన్ ott యాప్ లోనే కాదు, యూట్యూబ్ లో వేస్తున్నారు, మరి టీవీలో ఎవరు చూడాలి..? అదొక నష్టం, ఇక్కడ రెవెన్యూ ముఖ్యం కాదు, అంత పెద్ద టీవీ వ్యవస్థ పెట్టుకుని యూట్యూబ్ ఆదాయం కోసం ప్రయత్నించడం..!!
Share this Article