తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పుల గురించి బీఆర్ఎస్ శ్రేణులు గాయిగత్తర చేస్తున్నాయి… కేటీయార్ చార్మినార్ దగ్గరకు వెళ్లి మరీ ఆందోళన నిర్వహించాడు… అదేమంటే చార్మినార్, కాకతీయ తోరణాలు గంగా జమునా తెహజీబ్, తెలంగాణ చరిత్ర అంటాడు…
మరొక మిత్రుడు చార్మినార్ తెలంగాణ ప్రైడ్ అంటాడు… నిజానికి చార్మినార్, కాకతీయ తోరణం మతచిహ్నాలు కావు, వాటిని అధికార చిహ్నంలో ఉంచడం మతసామరస్యానికి సంకేతమూ కాదు… అవి రాచరికపు చిహ్నాలు కాబట్టి, ఆ ఆనవాళ్లను తొలగించడమే రేవంత్ రెడ్డి సర్కరు భావన అంటున్నారు కాబట్టి… మరి అశోక చక్రం, నాలుగు సింహాల బొమ్మ రాచరికపు ఆనవాలు కాదా అని మరో ప్రశ్న…
వోకే, రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ అవి మాత్రమే తెలంగాణ చరిత్రకు ఆనవాళ్లు కావు… అది నిజం, అదే చరిత్ర… చార్మినార్ తెలంగాణ ప్రైడ్ కాదు, అది అప్పట్లో తెలంగాణ సంస్థానంలో ప్రబలిన ప్లేగు నుంచి జనం కాపాడబడ్డాక ఆ స్మారకంగా కట్టబడిన ఓ కట్టడం… అలాగే తెలంగాణ రాజ్యం వేరు, ఇప్పటి తెలంగాణ ప్రాంతం వేరు… అప్పటి తెలంగాణలో మహారాష్ట్ర, కర్నాటకల్లోని ప్రాంతాలూ ఉన్నాయి…
Ads
కాకతీయ సామ్రాజ్య పరిపాలన రాజధాని తెలంగాణలో ఉండవచ్చుగాక, కానీ అప్పటి వాళ్ల సామ్రాజ్యం వేరు, ఇప్పటి తెలంగాణ వేరు… ఇప్పటి తెలంగాణ అంటే 1969 నుంచీ సాగిన ఉద్యమ పోరాటాల ఫలితంగా ఉన్న భౌగోళిక తెలంగాణ… సో, వాటిని తెలంగాణ అస్థిత్వ చిహ్నాలుగా పరిగణించాల్సిన పనీ లేదు… అదేమంత గొప్ప విషయమూ కాదు… సరే, ఎవరి మనోభావాలు వాళ్లవి…
ఆ అధికార చిహ్నం ప్రకటనను రేవంత్ సర్కారు వాయిదా వేసుకుంది, ఎందుకో తెలియదు గానీ, ఈలోపు పలు న్యూస్ వాట్సప్ గ్రూపుల్లో ఓ ఎక్స్ పోస్టు కనిపించింది… అందులో రేవంత్ రెడ్డి ప్రసంగం ఒకటి కనిపించింది… అది ఎప్పటిదో, ఏ సందర్భంలోనిదో తెలియదు గానీ… ఏ కామెంట్లూ అందులో కనిపించలేదు గానీ… అసలు వెలమలకూ రెడ్లకు ఎందుకు పడదు.., రెడ్లకు పడదు కాబట్టే వెలమలకు పట్టం కట్టిన నాటి కాకతీయ సామ్రాజ్యాధిపతులను వ్యతిరేకిస్తూ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ కళాతోరణాన్ని అధికార చిహ్నం నుంచి తొలగిస్తున్నాడు అనే అర్థమొచ్చేలా ఆ పాత వీడియోను వాడుకున్నారు…
గుడ్ కలెక్షన్… ఇంతకీ అందులో రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే..?
https://x.com/The4thestate_tv/status/1796193007818903943?t=-L0SMi9FDxJXNgR0qe-TfA&s=08
‘‘రాణి రుద్రమ ఉన్నప్పుడు… రాజ్యం నడిచినప్పుడు… రెడ్డి సామంతరాజుల చేతుల్లో కాకతీయ సామ్రాజ్యం నడిచింది… గోన గన్నారెడ్డి నుంచి మొదలుపెడితే ఆనాడు రాణి రుద్రమను కంచెలా కాపలా కాసి కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టింది రెడ్లు.., కానీ ఆమె వారసుడు ప్రతాపరుద్రుడు వచ్చిన తరువాత రెడ్డి సామంతరాజులను పక్కన పెట్టి, పద్మనాయకులకు పట్టం కట్టిండు…
పద్మనాయకులంటే ఎవరో కాదు, ఈరోజున్న వెలమ సామాజికవర్గం… ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యం మీద దండెత్తినప్పుడు రెడ్డి సామంతరాజును ముందు పెట్టి యుద్ధం చేయకుండా, యుద్దాన్ని పద్మనాయకులకు అప్పజెప్పి వాళ్లు చెప్పినట్టుగా రెడ్డిరాజులను వినమంటే, రెడ్డి సామంతులు తమ సైన్యాన్ని తీసుకుని వెనక్కి మళ్లిపోతే, కాకతీయ సామ్రాజ్యమే పతనమైంది… ఆనాటి నుంచి ఈనాటివరకు రెడ్లకు, పద్మనాయకులకు పొసగదు…’’
(ఇది ప్రచారంలో ఉన్న తెలంగాణ కొత్త అధికార చిహ్నం… ఇంకా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు…)
ఆ వీడియోలో ఉన్న రేవంత్ మాటలు యథాతథంగా, అవే అక్షరాలు ఇవి… సరే, వెలమలకూ రెడ్లకూ అందుకే పొసగదు అనుకుందాం… కానీ ప్రస్తుత ప్రభుత్వంలో వెలమలు లేరా..? కేసీయార్ ప్రభుత్వంలో రెడ్లు లేరా..? ఆ పాత చరిత్రతో వెలమల మీద, కాకతీయుల మీద ద్వేషం పెంచుకుని రేవంత్ రెడ్డి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ప్రజలు నమ్మేయాలా..?
సరే, అదే నిజం అనుకుందాం… అవునూ, కాకతీయులు అంటే కమ్మలా..? ఒకవేళ నిజంగానే రెడ్లను పక్కన పెట్టి, వెలమలను నెత్తిన మోసిన కాకతీయుల మీద కోపంతో రేవంత్ రెడ్డి ఈ పనికి పాల్పడ్డాడనేదే నిజమైతే… మరి చార్మినార్ చిహ్నాన్ని ఎందుకు పక్కన పెట్టినట్టు..? రెడ్లకు కుతుబ్ షాహిల నడుమ వైరం ఏమీ లేదే..! మరెందుకు దాన్ని తీసేస్తున్నట్టు..! సో, సింపుల్… రేవంత్‌రెడ్డి నాటి రాచరికపు ఆనవాళ్లు తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల్లో గానీ, తెలంగాణ రాష్ట్ర గీతంలో గానీ, తెలంగాణ అధికార చిహ్నంలో గానీ ఉండకూడదని అంటున్నాడు… అంటే సూటిగా చెప్పాలంటే… పాత కేసీయార్ నిర్ణయాలను మార్చిపారేసి ఆయన ఆనవాళ్లను తీసిపారేయడం… అంతే…!!
Share this Article