పాకిస్థాన్, ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కయానీ ఆ దేశ అడిషనల్ అటార్నీ జనరల్‌కు సూటిగా ఓ ప్రశ్న వేశాడు… అదీ ఈ కేసులో ఇంట్రస్టింగ్… ‘‘కశ్మీర్ అనేది ఓ విదేశం అంటున్నారు కదా.., దానికి సొంత రాజ్యాంగం, సొంత కోర్టులు ఉన్నాయంటున్నారు కదా… మరి పాకిస్థాన్ సైన్యం, రేంజర్లు ఎందుకు ఆ ప్రాంతంలోకి ప్రవేశించారు..? ప్రజల్ని పాక్ గూఢచార సంస్థలు బలవంతంగా అపహరించడమనేది ఆగకుండా నడుస్తూనే ఉంది దేనికి..?’… ఇదీ జస్టిస్ కయానీ అడుగుతున్న వివరణ…
ఆహా… ఎందుకు ఈ కేసు ఇంట్రస్టింగు అంటే… పీవోకే తన అధికార పరిధి కాదని పాకిస్థాన్ ఓ కోర్టు ఎదుట అంగీకరించడం ఇంట్రస్టింగు… (నిజానికి పీవోకే అంటేనే పాక్ ఆక్రమిత కశ్మీర్ అని)… ఈ ప్రాంతానికి వేరే రాజ్యాంగం, వేరే కోర్టులు ఉన్నాయని చెప్పడం మరీ ఇంట్రస్టింగు… అంతేకాదు, పాకిస్థాన్‌లో కోర్టులు ఇచ్చే తీర్పులు ఆ ప్రాంతానికి వర్తించవు అన్నట్టుగా సాక్షాత్తూ ప్రభుత్వమే అంగీకరించడం ఇంకా ఇంట్రస్టింగు…
కేసు పూర్వాపరాలు కావాలంటారా..? కశ్మీరీ కవి, జర్నలిస్టు అహ్మద్ ఫర్హాద్ షాను పాకిస్థాన్ గూఢచార సంస్థ కిడ్నాప్ చేసింది… ఇది మే 15న జరిగింది… ఈ కేసును ఇస్లామాబాద్ హైకోర్టు విచారిస్తోంది… ఆ కవి భార్య వేసిన పిటిషన్ ఆధారంగా ఫర్హాద్‌ను కోర్టులో హాజరు పరచాలని న్యాయమూర్తి కోరాడు…
Ads
ఫర్హాద్ షా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో పోలీసు కస్టడీలో ఉన్నాడని, అతడిని ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరు పరచలేమని జస్టిస్ కయానీ ఎదుట పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ వాదించాడు…
( కాశ్మీరీ కవి అహ్మద్ ఫర్హాద్ షా. (చిత్రం: ANI)
అహ్మద్ ఫర్హాద్ షాను ధీర్కోట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కోర్టు విచారణలో వెలుగులోకి వచ్చింది… ఇతనిపై పీఓకేలో రెండు కేసులున్నాయి… ఫర్హాద్ షా పాక్ ఆక్రమిత కాశ్మీర్, ప్రజల హక్కుల కోసం పనిచేసే ఒక కార్యకర్త… అతను బలమైన విమర్శకుడు… గతంలో పీఓకేలో జరిగిన అనేక ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు ఆయన నాయకత్వం వహించాడు…
అదీ పాకిస్థాన్ కన్నెర్రకు కారణం… పైగా ఈమధ్య కాలంలో పీవోకేలో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఉద్యమిస్తున్నారు… నియంత్రించలేకపోతోంది పాకిస్థాన్ ఆర్మీ, పోలీస్… అందుకని తన ఇంటి నుంచి షాను లిఫ్ట్ చేశారు… అదీ నేపథ్యం…
1947 నుండి పీవోకేగా పిలవబడుతున్న ప్రాంతం భారత దేశంలో భాగమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించడం, పీవోకేను విముక్తం చేయకతప్పదని బీజేపీ మంత్రులు గట్టిగా చెబుతున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ కోర్టు న్యాయమూర్తే ఒకరు స్వయంగా ఈ విధమైన వ్యాఖ్యానాలు చేయడమే ఇక్కడ గమనార్హం…
Share this Article