Pardha Saradhi Potluri …. కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలులో లొంగిపోయాడు… బెయిల్ పొడిగింపుకి కోర్టు అంగీకరించలేదు… రూల్స్ ప్రకారం సూర్యాస్తమయం లోపే లొంగిపోవాలి కాబట్టి తప్పనిసరై వెళ్లాడు… ఇండి కూటమికి మెజారిటీ వస్తుంది, తను మళ్లీ జైలుకు వెళ్లే పనే ఉండదు అని ఏదో చెప్పాడు కదా… అందుకని ఏవో ఆరోగ్య సాకులు చెప్పి బెయిల్ పొడిగించాలన్నాడు… కోర్టు నో అనేసింది…
జైలుకు తిరిగి వెళ్లేముందు పార్టీలోని తన ముఖ్యులతో సమావేశమై, పార్టీలో అందరూ సమైక్యంగా ఉండాలంటూ విజ్ఙప్తి చేశాడు… కారణం, పార్టీలో అంతర్గత సమస్యలు బాగా పెరిగిపోయి, తన చేతులు కూడా దాటిపోతున్నాయి… ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ ప్రాపగాండా మాత్రమే, జూన్ 4న ఎగ్టాక్ట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి, మన కూటమే అధికారంలోకి వస్తుంది అని ఉద్బోధించాడు…
ఆప్ పార్టీ సభ్యలంతా సమైక్యంగా ఉండాలని ఎందుకంటున్నాడు కేజ్రీవాల్… ఓ కథ ఉంది…
Ads
- పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్‌కు కేజ్రీవాల్‌కు పడటం లేదు, వైరం ఉంది… కానీ బయటపడకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు కేజ్రీవాల్.
- పంజాబ్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ తరచూ పంజాబ్ సీఎంను హెచ్చరిస్తూ వస్తున్నా కేజ్రీవాల్ మాటల్ని ఖాతరు చేయడం లేదు భగవంత్ సింగ్ మాన్.
- అభిషేక్ మను సింఘ్వీకి వాగ్దానం చేశాడు కదా, రాజ్యసభ సీటు ఇస్తానని… కానీ స్వాతి మలీవాల్ ఎదురుతిరిగింది, దాంతో చేసేదేమీ లేక వేరే ఆప్షన్ కోసం రాఘవ్ చద్దాకి పంజాబ్ సీఎం పదవిని ఆశ చూపిస్తున్నాడు కేజ్రీవాల్.
- రాఘవ్ చద్దా రాజీనామా చేస్తే పంజాబ్ సీఎం పదవి నీకే అంటున్నాడు.
- వేరే దారిలేదు కేజ్రీవాల్‌కు. స్వాతితో కుదరదు, మిగిలింది హర్భజన్ సింగ్, తను కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినా సరే ఒక్క మాట తనకు అనుకూలంగా మాట్లాడలేదు, హర్భజన్‌ను ఏమీ అనలేడు, అంటే బీజేపీలోకి వెళ్లిపోతాడు.
- రాఘవ్ చద్దా యువకుడు, విద్యావంతుడు కాబట్టి రాను రాను తనకు అడ్డుపడతాడనేది కేజ్రీవాల్ సందేహం.
- భగవంత్ సింగ్ మాన్ చెప్పినట్టు వింటాడు అనుకుంటే తనే ఓ వర్గాన్ని తయారు చేసుకుని ఏకు మేకయ్యాడు.
– బెయిల్ పొడిగింపు కోసం తాను చెప్పిన సాకు బరువు బాగా తగ్గిపోతున్నాను, కీటోన్ లెవల్స్ పెరిగి కిడ్నీలు, గుండె పనితీరులో బాగా మార్పులు వచ్చాయి, PET – CT SCAN చేయించుకోవాలి అని కోర్టుకు చెప్పుకున్నాడు.
– ఇంతకీ కేజ్రీవాల్ బరువు ఎంతో తెలుసా బెయిల్ పొడిగింపు పిటిషన్ వేసిన రోజున..? 64 కిలోలు… వెంటనే తీహార్ జైలు అధికారులు తమ వైద్య పరీక్షల రిపోర్టులు బయటపెట్టారు. జైలులోకి వెళ్లిన రోజున 65 కిలోలున్న కేజ్రీవాల్‌కు ప్రతి 4 రోజులకొకసారి బరువు రికార్డ్ చేస్తూ వచ్చారు.
– మే 9 నుంచి 65, 65, 66, 65, 66, 65 ఇలా ఉంది బరువు… ఎన్నికల ప్రచారం వలన కావొచ్చు లేదా కావాలనే ఒక కిలో బరువు తగ్గించుకొని 64 కిలోలు బరువు ఉన్నాను అంటూ తప్పుడు పిటిషన్ వేశాడు కేజ్రీవాల్… అయితే తీహార్ జైలులో వైద్య పరీక్షల రిపోర్టు బయటకి రాగానే సైలెంట్ అయిపోయాడు…
*****************
కేజ్రీవాల్ బెయిల్ పొడిగించాలనే పిటిషన్ వెనుక తన అవసరాలు, ఆలోచనలు ఎలా ఉన్నా, ఎప్పుడయితే తీహార్ జైలు వైద్య పరీక్షల రిపోర్టు బయటకి వచ్చిందో, బరువు విషయంలో పెద్ద తేడా లేదని తెలిసిందో సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ చేత నాట్ మెయింటనబుల్ (not maintainable) అంటూ రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో అపీల్ చేసుకోమని కోరారు.
ట్రయల్ కోర్టులో ED తీహార్ జైలు వైద్య పరీక్షల రిపోర్టు చూపెడుతుంది కాబట్టి బెయిల్ దొరకదు. ఇలా ఫిక్సయిపోతున్నాడు కేజ్రీవాల్. చూద్దాం మరో 36 గంటలు….
Share this Article