బీమార్, సారీ బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు ఈ ఫలితాల అనంతరం వేగంగా అనూహ్యంగా మారబోతున్నాయా..? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిశ్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశాడు… సో వాట్ అంటారా..? కొన్ని ఊహాగానాలు సాగుతున్నయ్…
నిజమైనా కాకపోయినా… ఏదో ఓ ఎగ్జిట్ పోల్ నంబర్ తీసుకుని చెప్పుకుందాం… అఫ్ కోర్స్, రేపెలాగూ అసలు రిజల్ట్ బయటపడుతుంది గానీ…
ఇండియాటుడేవాడు (మైయాక్సిస్) బీహార్‌లో ఎన్డీయే కూటమికి, అనగా బీజేపీ ప్లస్ నితిశ్ పార్టీ (జేడీయూ..?)కి కలిపి ఏకంగా 29 నుంచి 33 వరకూ సీట్లు వస్తాయంటున్నాడు… అదే ఇండి కూటమికి, అంటే కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీకి కలిపి 7 నుంచి 10 వస్తాయీ అంటున్నాడు…
Ads
నిజానికి లాలూ కుటుంబం మొత్తం… బిడ్డలు, కొడుకులు, అల్లుళ్లు అందరూ నానా రకాల కేసుల్లో ఉన్నవాళ్లే… అవినీతి, అక్రమాలు, కులప్రీతి, బంధుప్రీతి, మాఫియా, నేరగాళ్లు, కుటుంబపాలన, వారసత్వం బాపతు అనేకానేక దుర్వాసనలు ఉన్నా సరే… ఈరోజుకూ ఆర్జేడీ పవర్ ఫుల్లే బీహార్‌లో… అలా తయారు చేసి పెట్టారు…
ఇక నితిశ్ పరమ చంచలమైన పొలిటికల్ కేరక్టర్ భారతదేశ రాజకీయాల్లో… అప్పుడే లాలూ కుటుంబం గొప్పగా కనిపిస్తుంది, వెళ్లి అలుముకుంటాడు… దోస్త్ మేరా దోస్త్ అని పాట ఎత్తుకుంటాడు… హఠాత్తుగా ఆ బండి దిగిపోయి మోడీ బండి ఎక్కుతాడు… నువ్వు తోపు, నువ్వు టాపు అని మోడీని కీర్తిస్తాడు… లాలూ పాలనలో భ్రష్టుపట్టిపోయిన బీహార్‌ను ఈ నిజాయితీ నితిశ్ ఏమైనా ఉద్దరించాడా..? నెవ్వర్…
ఏమాత్రం పాలన విజయాలు లేవు… కానీ అటూ ఇటూ జంపుతూ తన అధికారాన్ని మాత్రం కాపాడుకుంటుంటాడు… ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు… కానీ, ఎంత భ్రష్టుపట్టిన రాజకీయ కుటుంబమైనా సరే, స్కూల్ డ్రాపవుట్ ఐనా సరే… లాలూ కొడుకు తేజస్వి యాదవ్ రాజకీయాల్లో నిలబడ్డాడు… తన పార్టీ కేడర్ కాపాడుకున్నాడు…
అదే నిజంగా అచీవ్‌మెంట్… కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు గానీ, సీట్ల బేరాలు గానీ పర్‌ఫెక్ట్‌గా చేసుకున్నాడు, ప్రచారాన్ని హోరెత్తించాడు… దీనికితోడు నితిశ్ మీద జనంలో అసంతృప్తి ఉంది… దాంతో ఈసారి బీహార్‌లో బీజేపీకి తేజస్వి బలమైన పోటీ ఇచ్చాడు… బెంబేలెత్తించాడు… మరి ఎగ్జిట్ పోల్ ఇలా చెబుతున్నదేమిటి..?
సరే, తేజస్వి ఆర్గనైజింగ్ కెపాసిటీని మోడీ పాపులారిటీ అధిగమించిందీ అనుకుందాం… ఐనా ఇంత తేడా ఉంటుందా..? ఏమో, నితిశ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి మోడీని కలిశాడు… ప్రస్తుత ఊహాగానాలు ఏమిటంటే… నితిశ్‌ను రాబోయే మోడీ కేబినెట్‌లోకి మంత్రిగా తీసుకుంటారు… బీజేపీకి ముఖ్యమంత్రి పదవి వదిలేస్తారు అని..!
ఎందుకు..? వచ్చే ఏడాది బీహార్‌లో ఎన్నికలున్నాయి… ఇలాగే నితిశ్ మీద వదిలేస్తే తేజస్వి ఇంకా బలపడతాడు, ఏకు మేకవుతాడు… అందుకని ఇప్పట్నుంచే ఆర్జేడీని కట్టడి చేసే వ్యూహాలు అమలు చేయాలి… ఎహె, ఈడీ, సీబీఐ, ఐటీ ద్వారా కాదు, పొలిటికల్‌గా… నితిశ్‌కు కూడా గత్యంతరం లేదు… అదుగో ఆ వ్యూహరచన కోసమే నితిశ్, మోడీ భేటీ అట… బాగుంది… సేమ్, మహారాష్ట్రలో శివసేన- బీజేపీ పాత బంధం పునరుద్ధరణ దిశలో కూడా ఊహాగానాలు సాగుతున్నయ్, మరోసారి చెప్పుకుందాం…!
Share this Article