నిజమే, వేణుస్వామి మీదే ఇప్పుడు అందరి దృష్టి… తను ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పాడు… ఇప్పటికే తన మీద భారీగా ట్రోలింగ్ సాగుతోంది… జగన్ గెలుపు మీద తను కాన్ఫిడెంటుగా తన మాట మీదే నిలబడ్డాడు తప్ప, తప్పించుకోవడానికి వీలుగా జ్యోతిష్యపరమైన ఏ మార్మిక భాషనూ వాడలేదు… కొందరు అటయితే అటు, ఇటయితే ఇటు చెప్పేందుకు వీలుగా భాషను తెలివిగా వాడుతుంటారు…
తను నిజంగానే తెలుగునాట సినిమా, టీవీ, క్రికెట్, పొలిటికల్ ముఖ్యుల వ్యక్తిగత జాతకాలను పబ్లిక్ డొమెయిన్‌లో చెబుతుంటాడు… ఏ తెలుగు జ్యోతిష్కుడూ అలా సాహసించడు… కానీ ఇప్పుడేం జరిగింది..? జగన్ మరీ ఘోరాతిఘోరంగా ఓడిపోయాడు… బహుశా వీర తెలుగుదేశం అభిమాని కూడా జగన్ మరీ ఇంత ఘోరంగా ఓడిపోతాడని ఊహించలేదేమో, పోనీ, అలా జరగాలని ఆశించలేదేమో…
సరే, జగన్ ఓటమికి కారణాల విశ్లేషణ ఇక్కడ, ఈ కథనంలో అసందర్భం… కానీ ఏపీ వోటరు గుంభనంగా కనిపించినప్పటికీ 2019లో ఏరకంగా వన్ సైడ్ తీర్పు చెప్పాడో, ఇప్పుడూ అంతే… వన్ సైడ్… అప్పుడు 151, 23 ఎంత అసాధారణమైన ఫిగరో, ఇప్పటి ట్రెండ్స్ కూడా అదే టైపు… వైనాట్ 175 అనే మైండ్ గేమ్ స్లోగన్ ఇప్పుడు జగన్‌నే చూసి పకపకా నవ్వుతున్నట్టుగా…
Ads
https://www.facebook.com/reel/1006840914482233
సరే, వేణుస్వామి సంగతికొద్దాం… తను ఓ రీల్ చేశాడు తాజాగా… ‘‘ఎస్, నేను చెప్పింది తప్పయింది, నా విద్వత్తు నా విద్య సూచించిన మేరకే చెప్పాను… నా జోస్యం తప్పయిందని చెప్పడానికి వెనుకాడటం లేదు… నామీద ట్రోలింగ్ ఇప్పుడు కొత్త కాదు, వాళ్లను నేను ఆపలేను’’ అని నిజాయితీగా, హుందాగానే తన జోస్యం తప్పిందని అంగీకరించాడు… అదీ చాలామంది జ్యోతిష్కుల వల్ల కాదు…
అంతేకాదు, ఇకపై సినిమా, టీవీ, పొలిటికల్, క్రికెట్ వంటి అంశాల్లో ముఖ్యుల వ్యక్తిగత జీవితాలు, జాతకాలను పబ్లిక్ డొమెయిన్‌లో చెప్పబోను అని ఓ కఠోర నిర్ణయాన్ని తీసుకున్నాడు… (పైన ఇచ్చి ఫేస్‌బుక్ లింక్ అదే…)
ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటంటే..? జోస్యాలు, జాతకాలు కూడా ఎగ్జిట్ పోల్స్ వంటివే… ఆయా వ్యక్తుల గ్రహస్థితి, మనం వేసే గ్రహసంచార లెక్కలు మనల్నే తప్పుదోవ పట్టించవని ఏమీ లేదు… అన్ని జోస్యాలూ ఫలించవు… స్ట్రయిక్ రేట్ ఎక్కువ ఉన్నవాడే పాపులర్ జ్యోతిష్కుడు… సరే, ఆయన నిర్ణయం ఆయనిష్టం… సో, ఇకపై తనను విశ్వసించే వ్యక్తులకే కాన్ఫిడెన్షియల్‌గా జాతకాలు చెబుతూ, వాళ్ల కోసం ఉపశమన, శుభయాగాలు చేయిస్తాడని లెక్క… గుడ్…
Share this Article