ఇరాన్ 1951 – భారత్ 2024 ….. కొద్దిపాటి మార్పులతో ఒకే విధంగా పోలికలు ఉన్నాయి… ఇరాన్ 1951 కి భారత్ 2024 కి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? మొహమ్మద్ మోసాదేగ్ – నరేంద్ర మోడీ…
ఇరానియన్లు అమెరికాని ‘ లాండ్ ఆఫ్ డెవిల్స్ ‘ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? 1951 లో మొహమ్మద్ మోసాదెగ్ ( Mohammad Mosadegh) ఇరాన్ ప్రధాన మంత్రి అయ్యాడు. మొహమ్మద్ మోసాదెగ్ ప్రధాని అయ్యే నాటికే ఇరాన్ లోని ఆయిల్ నిక్షేపాల మీద బ్రిటీష్ ఆయిల్ కంపెనీల పట్టు ఉండేది!
ఇరాన్ లో ఉత్పత్తి అయ్యే క్రూడ్ ఆయిల్ లో 84% శాతం బ్రిటన్‌కి వెళ్ళేది. కేవలం 14 % ఇరాన్ వాడుకునేది! మొహమ్మద్ మోసాదెగ్ గొప్ప దేశ భక్తుడు. తన దేశ సంపద అయిన క్రూడ్ ఆయిల్ 84% బ్రిటన్ కి వెళ్లడం ఇష్టం లేదు. అలాగే తమ దేశ ఆయిల్ వ్యాపారం మీద విదేశీ సంస్థలు పెత్తనం చెలాయిస్తూ ఉండడం మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసే వాడు.
మార్చి 15,1951 లో మహమ్మద్ మోసాదేగ్ ఇరాన్ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాడు ఇరాన్ ఆయిల్ పరిశ్రమను జాతీయం చేయాలని. బిల్లు అత్యధిక మెజారిటీ తో ఆమోదం పొంది అది చట్టం అయ్యింది!
Ads
అప్పటి నుండి మొత్తం ఆయిల్ పరిశ్రమలు అన్నీ ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళాయి! ఇరాన్ ఆయిల్ కొసం ఎవరు ఒప్పండం చేసుకోవాలన్నా నేరుగా ఇరాన్ ప్రభుత్వంతో చేసుకోవాలి !
*******
మొహమ్మద్ మోసాదేగ్‌ను గొప్ప దేశ భక్తుడుగా అభివర్ణిస్తూ టైమ్స్ మాగజైన్ తమ పత్రిక ముఖచిత్రం మహమ్మద్ మోసాదేగ్‌తో ప్రచురించింది ‘ Man of the year 1951 ‘ అని టైటిల్ పెట్టి!
*******
ఇరాన్ ఆయిల్ పరిశ్రమ జాతీయం కావడం చేత బ్రిటన్ నష్ట పోయింది! ఆయిల్ పరిశ్రమ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నంత కాలం బ్రిటన్ ఆయిల్ సంస్థలు యథేచ్చగా తమ వ్యాపారం చేశాయి! బ్రిటన్ చూస్తూ కూర్చోలేదు! చిన్నవి, పెద్దవి కుట్రలు చేసింది మహమ్మద్ mossadegh కి వ్యతిరేకంగా!
1. మొదట మహమ్మద్ మోస్సదేగ్‌కి భారీ మొత్తంలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించి విఫలం అయ్యింది!
2. అందమైన అమ్మాయిలతో హనీ ట్రాప్ చేయడానికీ ప్రయత్నించి విఫలం అయ్యింది!
3. సైనిక కుట్ర చేయించి మహమ్మద్ మోస్సాదేగ్ ను కూలదోయాలని చూసింది కానీ సైన్యం ముందుకు రాలేదు, ఎందుకంటే ఇరాన్ ప్రజలలో మహమ్మద్ మోస్సదేగ్ కి ఉన్న ఆదరణ చూసి ప్రజలు తిరగబడతారు అని భావించింది సైన్యం!
చివరికి మహమ్మద్ mossadegh ను హత్య చేయించాలని ప్లాన్ చేసి విఫలం అయ్యింది బ్రిటన్.
*********
బ్రిటన్ చివరికి అమెరికా సహాయం కోరింది! అమెరికన్ CIA ఒక మిలియన్ డాలర్లు కేటాయించింది ఇరాన్ ప్రధానమంత్రి మహమ్మద్ మోస్సాదేగ్ ను పదవి నుండి దించడానికి. మిలియన్ డాలర్లు అంటే ఇరాన్ కరెన్సీ లో 4250 కోట్ల రియాల్స్ తో సమానం!
*********
4. CIA ప్లాన్ ఏమిటంటే ముందు ఇరాన్ పార్లమెంట్ సభ్యులు ఎవరెవరు డబ్బుకి లొంగుతారో సర్వే చేయాలి.
5. ఇరాన్‌లో జర్నలిస్ట్స్, ఎడిటర్స్, చిన్నా పెద్దా ముస్లిం మత గురువులు డబ్బుకి లొంగుతారో లిస్ట్ ప్రిపేర్ చేయాలి.
6. చాలా త్వరగానే అవినీతి పరుల లిస్ట్ CIA కి వచ్చింది.
********
CIA ప్లాన్ ఆఫ్ యాక్షన్!
CIA 631 కోట్ల రీయాల్స్ ను ఇరాన్ లోని పార్లమెంట్ సభ్యులకు, జర్నలిస్టులకు, ఎడిటర్స్ కి, మత గురువులకి పంచింది! ప్రార్థనల కోసం మసీదులకు వచ్చే వారికి ముల్లాలు మహమ్మద్ మోస్సాదేగ్ ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అంటూ విష ప్రచారం చేశారు.
జర్నలిస్టుల, ఎడిటర్లు శక్తి కొద్దీ మహమ్మద్ మోస్సాదేగ్ మీద వ్యతిరేక కథనాలు వండి వార్చారు.
ఇరాన్లోని పత్రికలు మహమ్మద్ మోస్సాదేగ్ మీద వ్యతిరేక కథనాలను ఉటంకిస్తూ ప్రపంచదేశాల పత్రికలూ అదే బాట పట్టాయి.
ఇదే అదనుగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనం ప్రచురిస్తూ మహమ్మద్ mossaadegh ‘ డిక్టేటర్ ‘ అని పేర్కొంది!
ఇరాన్ లోని ప్రతిపక్షం మహమ్మద్ mossadegh ను స్వలింగ సంపర్కుడు అని ఆరోపించింది.
ఇలా అన్ని వైపుల నుండి దాడి మొదలయ్యి అది పీక్ స్టేజ్ కి రాగానే మరింత డబ్బుని వెదజల్లి 5 వేల మందితో ఇరాన్ పార్లమెంట్ వైపు ఒక నకిలీ మార్చ్ ను నిర్వహించింది CIA.
********
అమెరికా, బ్రిటన్ లు తన మీద కుట్ర చేస్తున్నాయని తెలుసుకున్న మహమ్మద్ మోస్సాదెగ్ ఇరాన్ పార్లమెంట్ ను రద్దు చేసాడు. అమెరికా చివరి అస్త్రంగా ఇరాన్ రాజు షా మీద వత్తిడి తెచ్చి మహమ్మద్ మోస్సదేగ్ ను హౌస్ అరెస్ట్ చేయించింది.
విచారణ పేరుతో మహమ్మద్ మోస్సదేగ్ చనిపోయే వరకూ గృహ నిర్బంధంలోనే ఉన్నాడు.
********
మహమ్మద్ మోస్సాదెగ్ గృహ నిర్భంధంలో ఉన్న సమయంలోనే ఇరాన్ క్రూడ్ ఆయిల్ ను 40+40 నిష్పత్తి ప్రాతిపదికన అమెరికా బ్రిటన్ లు పంచుకున్నాయి ఇరాన్ రాజు షా తోడ్పాటుతో. మిగిలిన 20 శాతం ఆయిల్ ను యూరోపు దేశాలకి ఎగుమతి చేసింది ఇరాన్!
Mission accomplished!
*******
మహమ్మద్ మోస్సాదెగ్ ప్రధానిగా కొనసాగి ఉంటే 1955 కల్లా పూర్తి స్థాయి ప్రజాస్వామ్య దేశంగా అవతరించి ఉండేది! అంటే ఇరాన్ రాచరిక వ్యవస్థ అంతం అయి ఉండేది!
అమెరికా ఏ ముస్లిం మత పెద్దలని మహమ్మద్ మోస్సాదెగ్ ను పదవి నుండి దించడానికి వాడుకున్నదో అదే మత వ్యవస్థ 1978 లో ఆయతొల్లా ఖోమైనీ రూపంలో మత విప్లవం పేరుతో ఇరాన్ ను మత రాజ్యంగా మార్చేసింది! అదే ఆయతోల్లా ఖోమేనీ అధ్వర్యంలో టెహ్రాన్ లోని అమెరికా రాయబార కార్యాలయం ముట్టడించి అందులో ఉన్న అమెరికన్ ప్రజలని బందీలుగా చేసి ఒక ఆట ఆడుకుంటున్నాడు.
********
ఇంతకీ మహమ్మద్ మోస్సాదెగ్ చేసిన నేరం ఏమిటి?
తన దేశ సంపదను కాపాడే ప్రయత్నంలో భాగంగా తన దేశ పారిశ్రామిక సంస్థలు ఆయిల్ పరిశ్రమను సొంతం చేసుకొని లాభాలు బ్రిటీష్ పెట్రోలియం కార్పొరేషన్ కి వెళ్లకూడదు అని భావించడమే!
*********
ఇంతకీ ఈ విషయంలో ఎవరు విలన్లు? ఇరాన్ లోని జర్నలిస్టులు, ఎడిటర్లు, ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు, మత పెద్దలు, డబ్బుకి లొంగిపోయి ఫేక్ ఆందోళనకు దిగిన కొద్దిపాటి ప్రజలు.
********
మీకు ఏమన్నా పోలికలు కనపడుతున్నాయి అంటే మీకు అర్థమయినట్లే ! కొద్దిపాటి వ్యక్తులతో ఒక దేశాన్ని ఎలా నాశనం చేయవచ్చో మహమ్మద్ మోస్సాదెగ్ ఉదంతం తెలియచేస్తున్నది. 1951 కి 2024 కి మధ్య సమాచార సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చాలా మార్పు ఉండడం వల్ల 10 ఏళ్లు పట్టింది మోడీని ఇబ్బంది పెట్టడానికి!
అయినా ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు! సామాన్య ప్రజలకు ఇవేవీ తెలియవు, అర్థం కావు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దేశం కోసం పనిచేసే ఉద్దేశ్యం మొదటి నుండీ లేదు, ఇక ముందు ఉంటుంది అని అనుకోవడం మన అవివేకం! ఈ యుద్ధం ముగిసిపోలేదు… అభిమన్యుడు మరణించగానే భారత యుద్ధం ముగిసిపోలేదు! (రచయిత :: పొట్లూరి పార్థసారథి)
Share this Article