ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీకి (అమెరికా రాజధాని) వెళ్లే ఫ్లయిట్ అది… స్ట్రెయిట్ ఫ్లయిట్… మధ్యలో ఎక్కడా దిగేది లేదు, ఆగేది లేదు… ఇప్పుడన్నీ అంతే కదా… ప్రత్యేకించి కొత్త విమాన సర్వీసులు ఆధునిక ఫ్లయిట్లను సమకూర్చుకున్నాక ఆగకుండా వెళ్తున్నాయి విమానాలు…
కాకపోతే సుదీర్ఘమైన ప్రయాణం… ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీ వరకు అంటే… దాదాపు 14, 15 గంటల ప్రయాణం… మనవాళ్లు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఎకానమీ క్లాసే… అవేమో ఇరుకిరుకు సీట్లు… కాసేపటికి కాళ్లు పట్టేస్తాయి, కాసేపు అలా లేచి బాత్రూం వైపు లేదంటే అటూఇటూ నడవాలి…
సరే, ఇంటర్నేషనల్ ఫ్లయిట్ కదా… టైమ్‌కు మీ చాయిస్‌ను బట్టి ఇండియన్, చైనీస్, అమెరికన్ బ్రేక్ ఫాస్ట్, లంచ్ సర్వ్ చేస్తారు… ఆ ఎయిర్ సర్వీసును బట్టి… ఎయిర్ ఇండియా అయితే కొన్నిసార్లు ఇడ్లీ కూడా ఉంటుంది… ఒక స్మాల్ పెగ్, మీరు అడిగిన మద్యం ఇస్తారు, మరీ మరీ అడిగితే మరో స్మాల్… అంతే… (కొందరు పక్కకున్న ప్యాసింజర్ తాగేవాడు కాకపోతే ఆ కోటా తీసుకొమ్మని చెప్పి, తాము తాగేస్తారు, అది వేరే కక్కుర్తి కథ…)
Ads
ఓసారి ఓ విమానం బయల్దేరింది… 400 మంది ప్రయాణికులు… హాయిగా టేకాఫ్ అయ్యింది… అందరూ సీట్ బెల్టులు విప్పేశారు… ముచ్చట్లలో పడ్డారు… కాకపోతే పొరపాటున 200 మీల్స్ మాత్రమే లోడ్ చేయబడ్డాయి… ఉన్న ప్రయాణికులేమో 400… అయ్యో, ఇప్పుడెలా… సుదీర్ఘ ప్రయాణం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కడుపులోకి ఏదైనా తీసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు…
విమానయాన సంస్థ పరువు పోకుండా, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో … సిబ్బంది తెగ ఆలోచన చేయటం మొదలు పెట్టారు… ఓ ఫ్లయిట్ అటెండెంట్‌కు మంచి ఆలోచన తట్టింది… ఆమె కెప్టెన్‌ను సంప్రదించి ఇలా ప్రకటించింది…
కథ యొక్క నీతి: మద్యపానం చేసే వ్యక్తులు చాలా దయగల హృదయాలను కలిగి ఉంటారు. దయచేసి వారిని గౌరవించండి..!….. (డౌటేముంది..? ఇది పక్కా వాట్సప్ పోస్టు… అజ్ఞాత రచయితకు ధన్యవాదాలు, కాకపోతే కథీకరణ నాది…)
Share this Article