రచన బెనర్జీ… బెంగాల్ విజేతల జాబితాలో పేరు చూడగానే… ఎలాగూ మమత చాలామంది సినిమా తారలకు ఎంపీ టికెట్లు ఇస్తుంది కదా, ఈమె కూడా మనకు తెలిసిన పేరేనేమో అని చెక్ చేస్తే నిజమేనని తేలింది… మనకు బాగా తెలిసిన తార… కాకపోతే మన దరిద్రులు చాలామంది ‘గెలిచిన చిరంజీవి హీరోయిన్’ అని రాసేశారు… ఛ…
చిరంజీవి హీరోయిన్ ఏమిటి..? తనతో నటించింది ఒకటే సినిమాలో… బావగారూ బాగున్నారా..? నిజానికి అందులో చిరంజీవితోపాటు గెంతేది, ఎగిరేది, పొర్లే హీరోయిన్ రంభ… రచనది మరో ప్రధాన పాత్ర, అంతే… పైగా ఈమెకు పేరు తెచ్చినవి కన్యాదానం, మావిడాకులు, అభిషేకం వంటి సినిమాలు… ఐనా 51 ఏళ్ల ఈమెకు వేరే ఐడెంటిటీ లేదా..? ఆమె జీవితంలో మరేమీ లేదా..? చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తే ఇక ఆమె ఐడెంటిటీ చిరంజీవి హీరోయిన్ అనేనా..? ఆమె బాలకృష్ణతో కూడా సుల్తాన్ చేసింది… మరి బాలయ్య హీరోయిన్ అని రాయలేదేం… తెలుగులో ఇదొక పాత్రికేయ దరిద్రం… రచన అంటే రచన… అంతే…
1993 నుంచీ నటిస్తోంది ఈమె… ఊరు కలకత్తా… మిస్ కలకత్తా ఈమె, మిస్ బెంగాల్ ఈమె… మిస్ బ్యూటీఫుల్ స్మైల్… బెంగాల్ మాత్రమే కాదు, తెలుగు, ఒడియా, తమిళం, హిందీ, కన్నడంతోపాటు అచ్చంగా బంగ్లాదేశీ సినిమాలు కూడా చేసింది… అన్నింటికీ మించి ఆమె హోస్ట్ చేసిన దీదీ నెంబర్ వన్ చాలా పాపులర్ బెంగాలీ టీవీ షో… 2011 నుంచి 2013 ఆగకుండా…
Ads
అసలు సిసలు దీదీ నెంబర్ వన్ మమతా బెనర్జీని కలిసింది ఈ రచనా బెనర్జీ… జస్ట్, మూడు నెలల క్రితమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది… టికెట్టు దక్కించుకుంది… సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛటర్జీ వ్యతిరేకత ఉంది… పైగా టీఎంసీ సపోర్ట్… ఇంకేం..? హుగ్లీ నియోజకవర్గం నుంచి అనాయాసంగా గెలిచేసింది…
ఒక కొడుకున్న ఈమె వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదొడుకులున్నాయి… సిద్ధాంత్ మహోపాత్ర అని బెంగాలీ యాక్టర్‌ను ప్రేమించింది, పెళ్లి చేసుకుంది… పదేళ్లయ్యాక 2004లో బ్రేకప్, విడాకులు… 2007లో ప్రబోల్ బసుతో పెళ్లి… అదీ శృతి కలవలేదు… మరో పదేళ్లు… 2017లో అదీ పెటాకులు… సెలబ్రిటీల జీవితాల్లో అవి అసాధారణం ఏమీ కాకపోవచ్చు… కానీ ఓ పార్టీ తీర్థం పుచ్చుకుని మరీ మూడు నెలల్లో ఎంపీ కావడం విశేషమే… ఆల్ ది బెస్ట్ రచనా..!
Share this Article