Jagannadh Goud…… బలగం (Supporting System) : నా ద్రుష్టిలో మనిషికి మనిషికీ తేడా వాళ్ళ బలగం మాత్రమే ఇంకేది కాదు.
ఈ మధ్య గూగుల్ CEO సుందర్ పిచాయ్ మాట్లాడుతూ నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే కారణం నా భార్య అంజలి అని చెప్పాడు. మగవాళ్ళ విజయం వెనక భార్య ఉండోచ్చు, తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు ఇంకెవరైనా ఉండోచ్చు. అదే విధం గా ఆడవాళ్ళకి తల్లితండ్రులు, భర్త లేదా గురువులు ఎవరైనా ఉండొచ్చు. నా జీవితం లో నేను గమనించినది, పేర్లు ఏమైనా విజయం సాధించిన ప్రతి వ్యక్తి వెనక ఉన్నది ఏదో ఒక బలగం (సపోర్టింగ్ సిస్టం). మన దేశం లో గెలిచిన ప్రతి వ్యక్తి వెనక ఖచ్చితం గా ఉంది ఏదో ఒక బలగం మాత్రమే (నేను గమనించినదానిలో).
తమ తమ సపోర్టింగ్ సిస్టం లో ఉన్నవాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకుంటే విజయం సాధించి ఎదుగుతారు, లేదా చిన్న చిన్న కారణాలతో విమర్శించుకుంటే లేదా విడిపోతే సంక నాకిపోతారు ఇద్దరూ.
బలగం అంటే కుటుంబం కావొచ్చు, సామాజిక వర్గం కావొచ్చు, ప్రాంతం కావొచ్చు, దేశం కావొచ్చు, స్నేహితులు, గురువులు, డబ్బు, విధ్య, కష్టపడే గుణం, నిజాయతీ ఏ రూపం లో అయినా కావొచ్చు. చిరంజీవి కష్ట పడ్డాడు ఏమో కాని అల్లు రామ లింగయ్య, అల్లు అరవింద్ రూపం లో బలమైన సపోర్టింగ్ ఉంది. మై హోం రామేశ్వరావు అయినా, గ్రంధి మల్లిఖార్జున రావు అయినా, ఈనాడు రామోజీ రావు కి అయినా వాళ్ళ కష్టంతో పాటు బలమైన బలగం (సపోర్టింగ్ సిస్టం) ఉంది.
రాజకీయ రంగం లో KCR కి అయినా, రేవంత్ రెడ్డి కి అయినా, చంద్రబాబు నాయుడు కి అయినా, జగన్ కి అయినా, పవన్ కల్యాణ్ కి అయినా, నరేంద్ర మోడీ కి అయినా వివిధ రకాల సపోర్టింగ్ సిస్టంస్ ఉన్నై
మన దేశంలో ప్రధానం గా తల్లితండ్రులు తినీ తినక సంపాదించి పిల్లలకి ఇచ్చేది వాళ్ళకి ఒక సపోర్టింగ్ సిస్టం క్రియేట్ చేయడానికే. ప్రస్తుత ప్రపంచం లో గెలవాలి అంటే ముఖ్యమైనది బలగం మాత్రమే (సపోర్టింగ్ సిస్టం). ఈ మధ్య ఇద్దరు తెలుగు వ్యక్తులు (పవన్ & నాగ భరత్) అంతరిక్షంలోకి రాకెట్స్ పంపించే “స్కై రూట్ ఎయిరో స్పేస్” అనే సంస్థ ని 2018 లో హైదరాబాద్ లో స్థాపించి ఆనతి కాలం లోనే 2020 లో మొట్టమొదటి ప్రయివేట్ రాకెట్ ని అంతరిక్షం లోకి పంపించారు. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళకి తగిన సపోర్టింగ్ సిస్టం ఉంది, తగిన బలగం ఉంది అని. వాళ్ళ క్రుషితో పాటు మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు, స్నేహితులు, తల్లి తండ్రులు, ప్రభుత్వం అలా కొన్ని రకాల సపోర్ట్ ఉంది.
ఈ రోజుల్లో బాగా కష్టపడి చదివి మార్కులు బాగా వచ్చిన వారికి ఉద్యోగం వస్తుందో లేదో నేను చెప్పలేను కానీ బలమైన సపోర్ట్ సిస్టం ఉంటే మాత్రం ఉద్యోగం అయినా అమెరికా అడ్మీషన్ అయినా, అమెరికా లో ఉద్యోగం అయినా చాలావరకు ఈజీ అవుతుంది అనేది కాదనలేని సత్యం.
సాధారణ కాలేజ్ లో చదివిన వాడికి, IIT/ IIM ల్లో చదివిన వాళ్ళకి తేడా పుస్తకాలు, సిలబస్ కాదు – సపోర్టింగ్ సిస్టం మరియూ Exposure . బలమైన సపోర్ట్ సిస్టం/ బలగం ఉంటే విజయం సాధించటమే కాదు, మానసికం గా కూడా ఒత్తిడి, ఆత్రుత తదితర మానసిక రోగాలు కూడా దరిచేరవు అని అంతర్జాతీయ అధ్యయనాలు చెప్తున్నై.
ప్రస్తుత పెట్టుబడీదారీ వ్యవస్థ లో గెలవాలి అంటే ఖచ్చితం గా బలగం/సపోర్టింగ్ సిస్టం ఉండాలి. ఏ సపోర్ట్, ఎవరి సపోర్ట్ లేకపోతే మనకి మనమే సపోర్ట్ చేసుకొని నిలిచి గెలవాలి…. – జగన్ (పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)
Share this Article
Ads