Subramanyam Dogiparthi…. కరెక్ట్ టైటిల్ . ఈ సినిమా చూస్తున్నప్పుడు , ఆ పసివాడి కష్టాలు చూసి పాపం అని అననివాడు ఉండడు . ఆడవాళ్లు కంట తడి కూడా పెట్టారు . వి రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ పాపం పసివాడు సినిమా 1972 సెప్టెంబరులో వచ్చింది . సుమారు ఒక నెల థార్ ఎడారిలో షూటింగ్ చేసారు . ఇలాంటి సినిమాలు మన తెలుగు సినిమా రంగంలో చాలా తక్కువ . 1969 లో వచ్చిన Jamie Uys ( జామీ ఉయిస్ ) లాస్ట్ ఇన్ ది డిజర్ట్ ( Lost in the desert ) ఆఫ్రికన్ సినిమా ఆధారంగా మన తెలుగు సినిమాను తీసారు . కధ , స్క్రీన్ ప్లే , మాటలు గొల్లపూడి మారుతీరావు సమకూర్చారు .
ఓ గొప్ప ధనవంతుడికి ఆలస్యంగా మగ పిల్లవాడు పుడతాడు . చుట్టాలు ఆ ఆస్తిని కాజేయటానికి ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు . గర్భవిఛ్ఛిన్నానికి విఫల ప్రయత్నం చేస్తారు . పిల్లాడు పుట్టాక కూడా ఎలాగోలా చంపాలని చూస్తుంటారు . ఇంతలో ఆ పిల్లాడికి క్షయ వ్యాధి రావటం , వైద్యం కొరకు స్విట్జర్లాండుకి విమానంలో బయలుదేరి , మధ్యలో పైలటుకి గుండె పోటు వచ్చి విమానం క్రాష్ అవుతుంది . పైలట్ చనిపోతాడు . పసివాడు , పెంపుడు కుక్క ఎడారిలో పడే రకరకాల కష్టాలు , అదృష్టం బాగుండి తల్లీతండ్రులను కలవటంతో సినిమా ముగుస్తుంది . టూకీగా ఇదీ కధ .
ఈ సినిమా పబ్లిసిటీకి కరపత్రాలు హెలికాప్టర్ ద్వారా జారవిడిచి , వినూత్న ప్రయోగం చేసారు . కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయింది . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు బాగా హిట్టయ్యాయి . ఆత్రేయ వ్రాసిన అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి అనే పాట సూపర్ హిట్ అయింది . అయ్యో పసివాడా అయ్యో పాపం పసివాడా , ఓ బాబు నీకన్నా మాకు పెన్నిధి ఎవరు అనే పాటలు కూడా బాగుంటాయి . ఆటవికుల గ్రూప్ డాన్స్ పాట మంచియన్నదే కానరాదు ఈ మనుషులలోన అనే పాట , గ్రూప్ డాన్స్ చాలా బాగా చిత్రీకరించారు .
Ads
మా నరసరావుపేటలో ఏ థియేటర్లో చూసానో గుర్తులేదు . తప్పక చూడవలసిన సినిమా . ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ఉంటాయి . ప్రధాన హీరోలు ఎవరూ లేకపోయినా కధే హీరోగా సక్సెస్ అయిన సినిమా ఇది . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడతగ్గ సినిమా . A watchable , entertaining , sentimental movie … #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
పాపం పసివాడు..! బాల్యం కరిగిపోయేసరికి ఇండస్ట్రీ అలా వదిలేసింది..!!
.
Share this Article