మొత్తం 16 పాటలు… ఈరోజుల్లో పెద్ద సాహసమే… పాత రోజుల్లో లెంగ్త్ ఎక్కువ సినిమాల్లో పాటలు ఎక్కువున్నా సరే, అవి బాగుండేవి… పదే పదే వినాలనిపించేవి… కొన్ని సినిమాలయితే పాటలతోనే నడిచాయి… రిపీటెడ్ వాచింగ్ పాటల కోసమే సాగేది… ఇప్పుడు ఆ సాహసం మనమే సినిమాలో…
దర్శకుడు శ్రీరామ్ ఆదత్యదే ఈ సాహసం… పైగా దీనికి ఏ తెలుగు సంగీత దర్శకుడో కాదు, మలయాళ కంపోజర్ హేశమ్ అబ్దుల్ వహాబ్‌ను ఎంచుకున్నాడు… ప్చ్, ఇలాంటి సాహసాలు చేసినప్పుడు తెలుగులో ఆలోచించి, తెలుగు తెలిసి, తెలుగులో కంపోజ్ చేసే తెలుగు దర్శకుడైతే బెటర్ ఉండేది… నిజంగానే పాటల విషయంలో సినిమా చూసిన ప్రేక్షకుడికి పెద్ద సంతృప్తి లేదు, వాటిల్లో ఒక్కటీ కనెక్ట్ కాలేదు… థియేటర్ బయటికి వచ్చాక చెవుల్లో పదే పదే రింగుమనే పాట ఒక్కటీ లేదు…
ఆర్ఆర్ మాత్రం వోకే… దానికి తెలుగుదనం అక్కర్లేదు కదా… ఏదో కొట్టేశాడు… నిజానికి ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం తీయబడిన సినిమా… కథ కూడా అదే… అలాంటప్పుడు సీన్లను ఎలివేట్ చేయాలి ఆర్ఆర్… బట్, వోకే… హీరో శర్వానంద్ సంగతికొస్తే… తను ఎప్పుడూ భిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటాడు… డౌన్ టు ఎర్త్…
Ads
ఫేక్ ఇమేజీ, బిల్డప్పుల కోసం ప్రయత్నించడు… అన్నింటికీ మించి తన సినిమాల్లో వల్గారిటీ ఉండదు… వెకిలితనం ఉండదు… డబ్బున్న ఆసామీయే కదా, డబ్బు కోసం కమర్షియల్ వాసనలకూ సై అనడు తను… ప్రయోగాలకూ రెడీ అంటాడు… (అంటే వేల కోట్లు, సొంత ఫ్లయిట్లు ఉన్నా కుమ్ముడు పాటలు చేసే ముసలి హీరోలు కూడా ఉన్నారు, అది వేరే కథ)
ఈ సినిమా కూడా అంతే… క్లీన్ ఫ్యామిలీ మూవీ… కథ కూడా ఎక్కడా పక్కదోవ పట్టదు… కాకపోతే దర్శకుడు ఎమోషనల్ సీన్లను అనుకున్నంత ఎఫెక్టివ్‌గా చిత్రించలేకపోయాడు… కేరక్టరైజేషన్ లోపాలు కూడా… మన తెలుగు సినిమా దరిద్రం ఏమిటంటే… హీరో, ప్రధాన పాత్రే ఎప్పుడూ అల్లరిచిల్లరిగా తిరిగే బేవార్స్ బ్యాచ్… చిల్లర దొంగతనాలు, అమ్మాయిల ఫ్లర్టింగ్ వంటి సుగుణాభిరాములు కదా…
ఇందులోనూ అంతే… సరే, అనుకోకుండా ఓ ప్రాణస్నేహితుడి సంతానాన్ని మరో అమ్మాయితో కలిసి పెంచాల్సి ఉంటుంది… వీడేమో బేవార్స్, ఆమె కాస్త మెటిక్యులస్, పద్ధతైన మనిషి… ఈ ఇద్దరికీ రిలేషన్ ఎలా ఏర్పడుతుందనేది స్టోరీ పాయింట్… గుడ్ స్టోరీ… కానీ అంతే ఇంప్రెసివ్‌గా, బలంగా దర్శకుడు కనెక్ట్ చేయలేకపోయినట్టు అనిపించింది… అక్కడక్కడా కాస్త కామెడీ… జస్ట్, వోకే…
సుభద్ర పాత్రలో కృతి శెట్టి బాగానే చేసినట్టు అనిపిస్తుంది గానీ… ఈ పిల్ల ఎమోషన్స్ పలికించే విషయంలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది… శర్వానంద్ పక్కన దీటుగా చేయగల మెరిటోరియస్ అయితే కాదు… శర్వానంద్ నో డౌట్, గుడ్ యాక్టర్…
భారీ లోకేషన్లు, అదిరిపోయే విజువల్స్, భారీగా పాటలు, ఆర్ఆర్… వీటికి తోడు శర్వానంద్… ఐతేనేం, బేసిక్‌గా కథనం ప్రభావవంతంగా లేకపోయాక..! అంటే లోపాలున్నాయా అనడక్కండి… లోపాల్లేని వంటకమే… కానీ రుచికరంగా లేదు… రాహుల్ రవీంద్రన్ విలన్… అంతగా విలనించలేదు… రాహుల్ రామకృష్ణుడికీ సరిపోయే పాత్ర కాదు… ఎప్పటిలాగే వెన్నెల కిషోర్ అక్కడక్కడా మెరిశాడు… ఇంకా చెప్పడానికి ఏమీ లేదు… హబ్బ, తొందరెందుకు..? ఓటీటీలో వస్తుంది కదా…!!
Share this Article