Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇతరుల చీకటి కోణాల విమర్శ… బలహీనత కాదు, బలహీన సమర్థనా కాదు…

June 7, 2024 by M S R

సుప్రసిద్ధ రచయిత Veerendranath Yandamoori నుంచి త్వరలో రాబోయే ఓ కొత్త పుస్తకం నుంచి ఓ పార్ట్ ఇది… తను షేర్ చేసుకున్నదే… ఇదంతా ఏ పాత్ర ఏ సందర్భంలో చెబుతుందో తెలియదు… కానీ నిజానికి దీన్ని పూర్తిగా అంగీకరించలేరు కొందరు… ముందుగా ఈ పార్ట్ యథాతథంగా చదవండి ఓసారి…



బాగా లేకపోవడం వేరు, నచ్చక పోవటం వేరు..! అర్థం పర్థం లేకుండా రాళ్లు విసిరే విమర్శకులు కూడా అంతే.ఒక సెలబ్రిటీ విజయాన్ని పోజిటివ్ దృష్టితో అస్సలు చూడరు. చూడటానికి ఇష్టపడరు. అది వాళ్ళ రక్తంలోనే జీర్ణించుకుపోయి ఉంటుంది.

“నీకు ఎప్పుడూ ఇతరుల చీకటి కోణాలు మాత్రమే కనబడుతున్నాయీ అంటే, నీవు నీ బలహీనతలని సమర్ధి౦చుకోవటానికి అవతలివారిని విమర్శిస్తున్నావన్న మాట” అన్నాడొక సైకాలజిస్టు.
ఎప్పుడూ ఫిజికల్ గా ఫిట్ గా ఉండటానికి ఒక నటుడు ఎంత కష్టపడతాడో తెలుసు కోకుండా, అతడి సినిమాలు చూడకుండా; ఒక రచయిత రచనలు చదవకుండా, ఒక క్రీడాకారుడు ఓడిపోయినప్పుడు అతడు ఆ స్థానానికి చేరుకోవటానికి ఎంత కృషి చేసాడో గుర్తించకుండా, ఒక వాద్యకారుడి నిద్రలేని రాత్రుల సాధన గుర్తించకుండా అతడి గురించి అంతా తమకు తెలిసినట్టే తమ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అతడు తమకు నచ్చకపోతే అక్కడిక్కడ విన్న మాటల ద్వారా ఏర్పడిన అభిప్రాయాలతో నిర్హేతుకమైన విమర్శలు చేసి, తమ మాటలతో మానసికంగా చంపేస్తారు. విజేతలు ఇలాంటి విమర్శలు పట్టించుకోరు. ఆ అవసరం లేదు కూడా.
అడివిలో ఒక లేడి అద్భుతంగా పాడుతూ ఉందట. కోతులూ, పక్షులూ, మృగాలూ అన్ని చేరి ఆ పాటని అస్వాదిస్తున్నాయట. అంతలో హఠాత్తుగా ఒక పులి ఆ లేడి మీదికి దూకి మెడ కొరికి చంపేసిందంట. ఊహించని ఈ సంఘటనకి చుట్టూ ఉన్న జంతువులు బిత్తర పోయాయట.
“అంత బాగా పాడుతోంది. దాన్ని ఎందుకు చంపేసావు?” అని ఏనుగు పులిని కోపంగా అడిగిందట. “పాడుతోందా? తెలిదే. నాకు చెవుడు” అన్నదట పులి.

ఇంటికి స్లాబ్ వేస్తున్నప్పుడు వర్షం రాకుండా చూసుకుంటాం. స్లాబ్ కాస్త గట్టి పడిన తర్వాత మనమే నీళ్లు కొడతాం. విమర్శలు కూడా అలాంటివే. నిరుపయోగమైన వాటిని పట్టించుకుంటే నాశనం చేస్తాయి. అవసరమైనవి పట్టిచుకుంటే అభివృద్ధికి తోడ్పడతాయి. ఉపయోగపడతాయి…

Ads



ఎందుకో గానీ , పైన చెప్పిన తత్వానికీ లేడిని పులి చంపే కథకూ నడుమ లింక్ సరిగ్గా కుదరలేదు అనిపించింది… స్థూలంగా చూస్తే ఈ నాలుగైదు పేరాలు వ్యక్తిత్వ వికాస పాఠాలే అనిపించినా… (యండమూరి గత కొన్నాళ్ల ప్రస్థానం కూడా అదే కాబట్టి ఇదీ ఆ రీతిలోనే సాగిందేమో)… కొంత గందరగోళం ఉన్నట్టుంది… మరో కోణంలో పరిశీలిస్తే… జస్ట్ ఫర్ డిబేట్ సేక్…

“నీకు ఎప్పుడూ ఇతరుల చీకటి కోణాలు మాత్రమే కనబడుతున్నాయీ అంటే, నీవు నీ బలహీనతలని సమర్ధి౦చుకోవటానికి అవతలివారిని విమర్శిస్తున్నావన్న మాట” అనేదీ కరెక్టు కాదు… ఒక క్రీడాకారుడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక హీరో, మరో ప్రముఖుడు, ఇంకో సెలబ్రిటీ… వ్యక్తిగత జీవనవిధానం, వ్యవహారశైలి నచ్చనప్పుడు విమర్శ చేయడంలో తప్పులేదు…

ఒక హీరో అడుక్కుతినే స్టేజ్ నుంచి, వాళ్ల వీళ్ల కాళ్లు పట్టుకుని హీరోగా ఎదిగాడనే సానుభూతితో తన పాత్రను చూడలేం… ఒక సినిమాలో తన నటన బాగుంటే మెచ్చుకుంటాం, లేదంటే విమర్శిస్తాం… అంతే… ఇక్కడ మన బలహీనతల్ని సమర్థించుకునే ప్రయత్నం ఏమున్నట్టు..?

జోరుగా ఓ ఐపీఎల్ మ్యాచ్ నడుస్తోంది… ఓ ప్లేయర్ రెండు క్యాచులు వదిలేశాడు నిర్లక్ష్యంగా, దెబ్బకు మ్యాచ్ పోయింది, కూలీ పని చేసుకుంటూ ఎదిగాడు కాబట్టి ఆ ప్లేయర్ నాసిరకం ఆటను సమర్థించలేం కదా… పాన్ డబ్బా నడుపుకునే ఓ వ్యక్తి పెద్ద ఇండస్ట్రియలిస్టు అయ్యాడు, సక్సెస్ స్టోరీ కాబట్టి తన నాసిరకం ప్రొడక్టును మెచ్చి, తనకు మేకతోలు కప్పలేం కదా… అలాగని యండమూరి రాసిందాంట్లో తప్పుందని కాదు… అకారణ, అసందర్భ, ఉద్దేశపూర్వక విమర్శలకు ఆ మాటలు సరిగ్గా వర్తిస్తాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions