డిల్‌బర్ట్ ఓ అమెరికన్ హ్యూమరిస్టు వన్ లైనర్స్ చాలా ఫేమస్… క్లాసిక్ కూడా… వీటిల్లో ఏది మీకు బాగా నచ్చిందో మీకు మీరే చెప్పుకొండి…
కొన్ని వన్ లైనర్స్… (ఇంగ్లిషు నుంచి తెలుగులోకి అనువాదం కొంత సంక్లిష్టమే ఇవి…)(చాలావరకు మార్మికంగా ఉంటాయి… ఫన్ కాదు, డెప్త్) (అవి ఏయే సందర్భాల్లో ఎలా వర్తిస్తాయో మనకు మనం అన్వయించుకోవాల్సిందే…)
1. నేను ఆల్కహాల్‌కు నో చెప్పాను, అదేమో నా మాట వినదు
Ads
2. విడాకులకు ప్రధాన కారణమేంటో తెలుసా..? పెళ్లి చేసుకోవడం
3. పని ఎప్పుడూ మంచిదే, మన టైమ్ ఎక్కువ తిననంత కాలం
4. అన్నీ నీ బాటలోకి వస్తున్నప్పుడు, నువ్వేమో తప్పుదోవ పట్టావు
5. ఆ టన్నెల్ చివర కనిపిస్తున్న కాంతి, బహుశా ఇన్‌కమింట్ రైలేమో
6. ఉచితంగానే పుట్టాం… మరణమనేది చివరి భారీ పన్ను విధింపు
7. అందరిదీ ఫోటోగ్రఫిక్ మెమొరీయే… కానీ కొందరిలో ఫిలిమ్ ఉండదు
8. జీవితం బుద్బుధప్రాయం, వీలైనంత ముందే డెజర్ట్ తినేయాలి
9. చిరునవ్వు నవ్వండి, మీరేం ఆలోచిస్తున్నారో జనానికిక ఆశ్చర్యమే
10. మీ కాళ్ల మీద మీరు స్థిరంగా నిలబడితే… ప్యాంటు వేసుకోవడం కష్టమే
11. ఖర్చులు భరించడం కష్టమేమీ కాదు, అవెప్పుడూ ఉండేవే, తగ్గేవి కావు
12. రచయితగా ఉండటమే నాకిష్టం, కానీ పేపర్ వర్కే నాకస్సలు నచ్చదు
13. ప్రింటర్‌లో మూడు ముఖ్యభాగాలు, పైన కవర్, జామైన ట్రే, వెలిగే ఎర్ర లైటు
14. చక్రం తొలుత కనిపెట్టినోడు మూర్ఖుడు… మిగతా మూడు కనిపెట్టినోడే గొప్పోడు
15. మన సమయపాలనతో వచ్చే చిక్కేమిటంటే… ఎవడూ దాన్ని అభినందించడు
16. మన దేశంలో ‘ఫ్రీ స్పీచ్’ ఉందంటారు కదా… మరెందుకీ ఫోన్ బిల్లులు
17. మనసు మార్చుకోను అంటున్నారా, ఓహ్, మీకూ మనస్సుందని చెబుతున్నారా
18. సాయంత్రం ఐదు గంటల రద్దీ అధిగమించాలంటే, మధ్యాహ్నమే పని ఆపేయాలి
19. ఒకవేళ నువ్వు ఒప్పించలేకపోతే, వీలైనంత గందరగోళం క్రియేట్ చేసి వదిలేయి
20. హఠాత్తుగా నేలకొరిగావా… అయితే అది జీవితాంతంలో పడిన సడెన్ బ్రేక్
21. కారు బ్రేకులు రిపేరు కావడం లేదు సార్, వెంటనే మీ హారన్ సౌండ్ పెంచాను
22. వేడి గ్లాసు, చల్లటి గ్లాసు ఒకేలా కనిపిస్తాయి, వేళ్లు కాలితే కదా తెలిసేది
23. పొగ తాగేది సిగరెట్టే, మీరు కాదు, జస్ట్ మీరు ఆ పొగను పీలుస్తున్నారు
24. ఏదో ఒక రోజు వస్తుంది, అది వారంలో ఒక రోజు గాకుండా పోతుంది
25. నేను విజయపు తాళపు చెవిని కనిపెట్టాను, దేవుడు తాళం మార్చేశాడు
26. తప్పు చేయడం మానవ సహజం, కానీ క్షమించడం కంపెనీ సహజం కాదు
27. విజయానికి దగ్గర రహదారి, ప్చ్, అదెప్పుడూ అండర్ కన్‌స్ట్రక్షన్
28. ఆల్కహాల్ ఏ సమస్యకూ పరిష్కారం కాదు, కానీ పాలు కూడా అంతే కదా
29. నీకు రుణం శాంక్షన్ కావాలంటే, పెద్దగా అక్కర్లేదని నువ్వు నమ్మించగలగాలి
(అబ్బే, కొన్ని అస్సలు జీర్ణం కావడం లేదు అంటారా..? ముందే చెప్పుకున్నాం కదా, వన్ లైనర్స్ లోతు ఎక్కువ)
Share this Article