ఉత్తర ప్రదేశ్ లోకసభ ఎన్నికలు – నా సమీక్ష !
ఉత్తర ప్రదేశ్ లో ఏ పార్టీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటుందో ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది!
ఇది మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆనవాయితీగా వస్తున్నదే!
2014 , 2019 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలిచింది!
2024 లో ఎందుకు వెనకపడింది?
కారణాలు అనేకం ఉన్నాయి కానీ రెండు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించాల్సి ఉంటుంది!
*******
అందరి దృష్టి అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్ సభ నియోజక వర్గంను ముందు విశ్లేషిస్తే అసలు విషయం బయటపడుతుంది.
1. ఫైజాబాద్ లోక్ సభ నియోజక వర్గంలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి అయోధ్య, బికాపూర్, రుదౌలి, మిల్కిపూర్, దరియాబాద్.
2. అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీకి ఆధిక్యం లభించింది.
3. మిగతా 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో SP కి ఆధిక్యం లభించింది.
బీజేపీ కంటే SP కి వచ్చిన ఆధిక్యం వరుసగా…. బికాపూర్ – 29,684, రడౌలి – 11,703, మిల్కిపూర్ – 7,733, దరియాబాద్ – 10,094
అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీకి ఆధిక్యం లభించింది కానీ మిగతా నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో SP కి ఆధిక్యం వలన ఫైజాబాద్ లోక్ సభ సీటు SP కి వెళ్ళిపోయింది .
4. ఫైజాబాద్ లోక్సభ మొదటి నుండీ అయితే BSP కి లేదా SP చేతులు మారుతూ వచ్చింది 2014 వరకు.
5.2014 లో మోడీ ప్రభంజనంలో ఫైజాబాద్ లో బీజేపీ నుంచి లల్లూ సింగ్ గెలిచాడు వరుసగా 2014, 2019 ఎన్నికలలో.
6. ఈసారి SP అఖిలేష్ యాదవ్ దళితుడు అయిన అవదేశ్ ప్రసాద్ ను పొటీలోకి దించింది. ఫైజాబాద్ రిజర్వుడు సీట్ కాదు కానీ దళితుడికి సీటు ఇచ్చాడు అఖిలేష్.
7. ఫైజాబాద్ నియోజక వర్గంలో 84.75% హిందువులు ఉండగా 14.8 % ముస్లిమ్లు ఉన్నారు.
8. 84.75% హిందువులలో 26% దళితులు, 35% obc లు ఉన్నారు.
9. లల్లూసింగ్ తెలివితక్కువగా టూథర్డ్ మెజారిటీ ఇవ్వండి, రాజ్యాంగం మారుస్తాము అని ఓటర్లను అడిగాడు.
10. SP, కాంగ్రెస్ లు లల్లూ సింగ్ వ్యాఖ్యని తీసుకొని ‘ SAVE CONSTITUTION AND SAVE RESERVATIONS ‘ నినాదంతో ప్రజలని భయపెట్టింది.
11. ఉత్తర ప్రదేశ్ అంతా ఇదే స్లోగన్ తొ ప్రచారం చేయడంతో బీజేపీకి ఆధిక్యం తగ్గింది!
12. ఫైజాబాద్ లో ఉన్న 26% దళితులు SP అభ్యర్ధి అవదేశ్ ప్రసాద్ కి వేశారు.
SO! అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్ వరకూ బీజేపీకి ఆధిక్యం లభించింది కాబట్టి అనవసరంగా ఆరోపణలు చేయకపోవడం ఉత్తమం!
*******”””
విచారకర విషయం ఏమిటంటే రాజ్యాంగ సవరణకి, రాజ్యాంగం మార్పుకి తేడా తెలియని వ్యక్తులు పార్లమెంట్ సభ్యులు అవుతున్నారు.
2023 సెప్టెంబర్ వరకూ 106 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయి.
వీటిలో 7 సవరణలు 2015 నుండి 2023 వరకూ బీజేపీ హయాంలో జరిగాయి ఇవన్నీ మైనర్ సవరణలు మాత్రమే!
కనీసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అభ్యర్థులు ఏం మాట్లాడాలి, ఏమీ మాట్లాడకూడదు అనే అంశాలను అభ్యర్థులకు సూచనలు ఇవ్వాల్సి ఉండేది కానీ ఆ పని చేయలేదు దేనికీ?
Ads
*******
ఒక విషయం స్పష్టముగా చెప్పుకోక తప్పదు!
జాతీయ, రాష్ట్ర స్థాయిలో RSS సలహాలు, సూచనలను బీజేపీ తీసుకోట్లేదు అని అనిపిస్తున్నది.
RSS తరువాతే ఎవరైనా!
RSS ను విస్మరించినా, లెక్కచేయక పోయినా ఫలితాలు ఇలాగే ఉంటాయి.
RSS లేకపోతే బీజేపీ ఉండదు.
********
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయినా పక్కన పెట్టి ఉండాల్సింది!
ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కార్యాలయాలకి వచ్చే కార్యకర్తలకి కనీసం భోజనము పెట్టలేని స్థితిలో ఉందా బీజేపీ?
ఆయన్ని తొలగించి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నియమించాలి!
********
దేశం కోసం ధర్మం కోసం!
భేష్! చాలా రమ్యంగా ఉంది స్లోగన్!
కడుపు మాడపెట్టుకొని దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలా?
ఉత్తర ప్రదేశ్ లో పేద ప్రజల వలసలు ఎక్కువగా ఉన్నాయి అన్నసంగతి బీజేపీ విస్మరించింది!
10, 15 వేల జీతం కోసం వేల మంది UP ప్రజలు ఇతర రాష్ట్రాలలో పని కోసం వెళుతున్నారు.
కాంగ్రెస్ ఇవ్వచూపిన నెలకి 8500/- కోసం ప్రజలు 40 పార్లమెంట్ సీట్లు SP, కాంగ్రెస్ కి ఇచ్చారు.
క్షేత్ర స్థాయిలో RSS సలహాలు తీసుకుని ఉంటే ఈ రోజున మెజారిటీ కోసం ఎదురు చూసే పని ఉండేది కాదు!
యోగి ఆదిత్య నాథ్ 74 వేల కోట్లు మిగులు బడ్జెట్ చూపించారు కదా?
ఎందుకు పేద ప్రజలకు కనీస మద్దతు ఇవ్వలేక పోయారు?
రోగం ఒక చోట ఉంటే మందు ఎక్కడ రాయాలి అన్న చందంగా ఉంది!
ఫైజాబాద్ సిట్టింగ్ ఎంపీ లల్లూ సింగ్ అసలు ఎన్నికలప్పుడు మాత్రమే కనపడతాడు కానీ మిగతా సమయాల్లో కనపడడు అని స్థానికులు ఆరోపిస్తున్నారు!
మళ్ళీ టికెట్ ఎందుకు ఇచ్చినట్లు?
లల్లూ సింగ్ లాంటి వాళ్లు చాలామందే ఉన్నారు బీజేపీ టికెట్ తో ఓడిపోయిన వాళ్ళు!
********
ప్రపంచంలోనే అతి పెద్ద ధనిక రాజకీయ పార్టీ బీజేపీ.
కానీ ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు ఇచ్చే కార్యకర్తలు లేరు UP లో!
SP, కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్ స్లిప్పులు ఇవ్వడమే కాదు నేరుగా పోలింగ్ బూత్ కి దగ్గరలో వాహనాలలో దించారు!
క్షేత్ర స్థాయిలో చాలా తప్పులు జరిగాయి.
ముస్లిమ్లు గత రెండు సార్లు ఓటు వేశారు కదా?
హిందువులు ఓట్లు వేశారు కదా?
ఇప్పుడు ఎందుకు వేయలేదు?
ప్రతీసారీ మోడీని చూసి ఓట్లు వేయరు!
అభ్యర్థులను కూడా చూస్తారు. రెండు సార్లు మోడీని చూసి ఓట్లు వేశారు కదా?
శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నియమించండి అన్నీ సర్దుకుంటాయి!….. (విశ్లేషణ :: పోట్లూరి పార్థసారథి)
Share this Article