బాలయ్య సుప్రీం ఇగోయిస్టిక్ మాటల్లోనే చెప్పాలంటే… మరి ఆ బ్లడ్డు, ఆ బ్రీడు… మరి సాక్షాత్తూ నందమూరి పిల్లల్లోనే… చాలామంది అనామకులుగానే మిగిలిపోయారు కదా… రాజకీయాల్లో పురంధేశ్వరి, బాలయ్య కొంచెం కొంచెం ఫేమ్… నటులుగా బాలయ్య, తరువాత తరంలో జూనియర్ ఎన్టీయార్…
అంతే కదా, సంక్షిప్తంగా ఎన్టీయార్ అని పిలవగల నందమూరి తారకరత్న మొత్తం కుటుంబమంతా అండగా నిలబడినా క్లిక్ కాలేదు… అంతకుముందు హరికృష్ణ మరీ కాస్త నిలబడ్డాడు ఫీల్డులో… అంతేకదా… మొన్నీమధ్య చైతన్య కృష్ణ బరిలోకి వచ్చాడు… విసుగెత్తించాడు… సరే, బాబోయ్ అనిపించాడు…
ఇప్పుడు ఆ బ్లడ్డు, ఆ బ్రీడు వనంలో మరో కొత్త మొక్క మొలుస్తోంది… తన పేరు కూడా ఎన్టీయారే… నందమూరి తారక రామారావే… మరణించిన హరికృష్ణ మనమడు, తన పెద్ద కొడుకు జానకిరామ్ కొడుకు… ఆయన కూడా ఆమధ్య రోడ్డు ప్రమాదంలో మరణించాడు… ఇప్పుడు ఈ కొత్త ఎన్టీయార్‌ను నందమూరి కుటుంబ వీరాభిమాని వైవీఎస్ చౌదరి లాంచ్ చేయబోతున్నాడుట…
Ads
నిజానికి చౌదరి మొదట్లో కమర్షియల్‌గా మంచి హిట్స్ ఇచ్చాడు, తరువాత ఫ్లాప్, చాన్నాళ్లుగా అసలు కనిపించడం లేదు, వినిపించడం లేదు ఎక్కడా… ఆర్థికంగా కూడా నష్టపోయాడంటారు మరి… ఈమధ్య కాస్త కోలుకున్నాడేమో మళ్లీ మెగాఫోన్‌తో రెడీ… సరే గానీ…
ఆయన్ని సీనియర్ ఎన్టీయార్ అని రాస్తున్నాం… తరువాత జూనియర్ ఎన్టీయార్… తారక్ తారక్ అనే పిలిపించుకోవాలని ఎంతగా బలమైన కోరిక ఉన్నా, ఛ, ఈ జూనియర్ అనే పదమేమిటి అసహ్యంగా అని చీదరించుకున్నా… అదే పేరుతో పాపులర్ అయిపోయాడు… జూనియర్ ఎన్టీయార్‌గానే తన ఎరుక, తన గుర్తింపు, తనకు ఆదరణ… మరి ఇప్పుడు ఈ కొత్త ఎన్టీయార్‌ను ఏమని పిలవాలి… జూనియర్ తరువాత తరం కదా, సబ్ జూనియర్ ఎన్టీయార్ అనాలా..? (సరదాగా…)
నిజానికి వారసత్వం, కుటుంబ నేపథ్యం ఎంట్రీకి మాత్రమే పనికొస్తాయి… మరీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ కట్ థ్రోట్ కంపిటీషన్ ఉంది… చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం కుదరదు… కష్టపడాలి, కొత్తదనాన్ని చూపాలి, ప్రయోగాలకు సిద్ధపడాలి, ఒళ్లొంచాలి… (జూనియర్‌లో మంచి నటప్రతిభ ఉంది కాబట్టే నిలబడ్డాడు…) ఇవన్నీ చేసినా సరే పిసరంత అదృష్టం కూడా తోడవ్వాలి…
అసలే మూఢనమ్మకాలు, సెంటిమెంట్లకు పెద్ద పీట వేసే ఇండస్ట్రీ ఇది… లక్కీ హ్యాండ్, ఐరన్ లెగ్గు వంటి పదాలకే ప్రాముఖ్యం… నాటి ఎన్టీయార్‌కు మూడోతరం కదా అని ప్రేక్షకులు అంత సులభంగా నెత్తిమీద పెట్టుకోరు… ఈ నిజాలు తెలిసి, డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా వ్యవహరించి… కొన్నాళ్లు కష్టపడి ప్రూవ్ చేసుకుంటే… ఎస్, డెఫినెట్‌గా తెలుగు సినిమాల్లో స్కోప్ ఉంది, గ్యాప్ కూడా ఉంది… ఆ నెత్తురులోకి ఇంకిన కాసింత నటన కూడా ఉంటుంది కదా… సో, ఆల్ ది బెస్ట్ న్యూ జూనియర్ ఎన్టీయార్..!!
Share this Article