సురేష్ గోపి… కేరళ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన తొలి నాయకుడు… తన వాస్తవ వృత్తి సినిమాల్లో నటన, టీవీ హోస్టింగ్, అప్పుడప్పుడూ పాడటం… మలయాళమే కాదు, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా నటించాడు…
నిజానికి తను తొలిసారి పార్లమెంటు సభ్యుడు కాదు… 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ సభ్యుడు… కాకపోతే ఈసారి లోకసభకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు వచ్చాడు… బీజేపీ గెలుపు అక్కడ లెఫ్ట్, కాంగ్రెస్ పక్షాలకు ఓ షాక్…
కేరళలో బీజేపీకి ఓ సీటు రావడం ఆ పార్టీకి కూడా ఆనందదాయకమే… ఆ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ఎన్నేళ్లుగానో లెఫ్ట్ మీద పోరాడుతోంది… అనేక మరణాలు, దాడులు… కేరళలో లెఫ్ట్ వర్సెస్ సంఘ్ హింసాత్మకమే పలుచోట్ల…
Ads
గతంలో కేరళ నుంచి జార్జి కురియన్ కూడా బీజేపీ కేబినెట్‌లో చేరినవాడే… ఇప్పుడు త్రిసూర్‌లో సురేష్ గోపి గెలవగానే మోడీ 3.0 కేబినెట్‌లోకి తీసుకున్నాడు… కేరళలో పార్టీ విస్తరణకు బీజేపీకి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి… వాటిని ముందుకు తీసుకెళ్లే ఓ దూకుడు లీడర్ కావాలి… ఆ దిశలో సురేష్ గోపి పార్లమెంటు సభ్యుడిగా పెద్ద పర్ఫామ్ చేసిందేమీ లేదు… ఐనా సరే, కేంద్ర మంత్రిగా తనకు కేరళలో ఎటు వెళ్లినా, ఎటు తిరిగినా ఓ అడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఆ కోణంలో తనకు కేంద్ర మంత్రి పదవి దక్కినట్టుంది…
కానీ సురేష్ గోపికి కాస్త తిక్క ఉన్నట్టుంది… ఒకవైపు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే, ఇంకా ఏ పోర్ట్‌ఫోెలియో కూడా అప్పగించకుండానే… అబ్బే, నాకు ఈ కేంద్ర మంత్రి పదవిలో ఉండటం అస్సలు ఇష్టం లేదు తెలుసా అని ఓ ప్రాంతీయ భాషా చానెల్‌తో ఢిల్లీలో మాట్లాడుతూ అన్నాడు… (ఇండియాటుడే కథనం మేరకు…)
ఈ ముక్క ఏదో ముందే చెప్పాలి కదా… ఇష్టం లేకపోతే ప్రమాణ స్వీకారం ఎందుకు చేసినట్టు..? ఎవరైనా మెడ మీద కత్తి పెట్టి, మంత్రిగా ప్రమాణం చేయకపోతే మర్యాద దక్కదు అని మలయాళ సినిమాల్లో విలన్‌లాగా బెదిరించారా..? పైగా ఇదే నాయకుడు మొన్నటి ఎన్నికల్లో ‘‘త్రిసూర్‌కు కేంద్ర మంత్రి పదవి, ఇదీ మోడీ ఇచ్చిన హామీ’’ అని ప్రచారం చేసుకున్నాడు… అప్పుడు తెలియదా కేంద్ర మంత్రి పదవి అంటే ఏమిటో…
ఇప్పుడేమంటాడు అంటే… నేను చాలా సినిమాలు చేయాల్సి ఉంది… వాటిని పూర్తి చేయాలి… అందుకే ఈ మంత్రి పదవి నుంచి రిలీవ్ అయిపోతా… ఎంపీగా మాత్రం త్రిసూర్ ప్రజలకు సేవ చేసుకుంటాను అంటున్నాడు… మరీ కేంద్ర మంత్రి పదవి అంటే తమాషా అయిపోయినట్టుంది ఈ 65 ఏళ్ల హీరోకు… అయ్యా బాబూ… ఏ సోయిలో ఉన్నావ్ నాయనా..? ఐనా ఇలాంటోళ్లతో పార్టీ విస్తరణ ఎలా సాధ్యం మోడీ బాబూ..!?
ఇదేమిటోయ్, ఇలా అంటున్నావట అని ఏ అమిత్ షాయో, ఏ మోడీయో ఫోన్ చేస్తే… ‘‘అబ్బే, సదరు రిపోర్టర్ నేను చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేదు, తప్పు రాశాడు, నిక్షేపంగా కేంద్ర మంత్రి పోస్టులో భరతమాత సేవ చేసుకుంటాను సర్’’ అని ప్లేటు తిప్పేస్తాడేమో… అసలే సినిమా వాళ్లకు ఇది అలవాటే కదా… అఫ్‌కోర్స్, పొలిటిషియన్స్‌కు కూడా… మరి ఈయనలో ఆ ఇద్దరూ ఉన్నారు కదా..!!
.
.
అయినా మోడీ కేబినెట్ లో ఎవరికీ పెద్దగా పని ఉండదు గోపీ… నీ సినిమాలు నువ్వు చేసుకోవచ్చు… అంతా PMO చూసుకుంటుంది… మరీ విదేశాంగ, రక్షణ, ఆర్థిక గట్రా నీకేమీ ఇవ్వరు కదా… Why fear..!!
Share this Article