కొన్ని దిక్కుమాలిన వార్తలు హఠాత్తుగా కనిపిస్తుంటాయి… చిల్లర, బజారు స్థాయి, బురదజల్లే ఫేక్ వార్తలు… మీడియాకు అవే కదా కావల్సింది, కళ్లు మూసుకుని, ఆనంద పరవశంతో అచ్చేస్తుంటాయి… ఆహా, ఓ బకరా దొరికిండురా ఈరోజుకు అన్నట్టు పండుగ చేసుకుంటాయి… ఇదీ అలాంటిదే అన్నట్టుగా ఉంది…
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ… ఈయనది యూపీ… చాన్నాళ్లుగా బీజేపీ ఐటీ సెల్ వ్యవహారాలు చూస్తున్నాడు… తన ట్వీట్లు, తన వ్యాఖ్యలు గట్రా అచ్చంగా వాట్సప్ యూనివర్శిటీ వార్తల్లాగే ఉంటాయి… సహజమే, ఆ యూనివర్శిటీయే కదా…
ఇప్పుడు శంతను సిన్హా అనబడే ఓ బెంగాలీయుడు ఈయనపై తీవ్ర ఆరోపణలు చేశాడు… ఏమనీ అంటే… సదరు మాలవీయ బెంగాల్ వచ్చినప్పుడల్లా మహిళలతో శారీరకంగా గడిపేవాడు, స్త్రీలోలుడు, స్టార్ హోటళ్లే గాకుండా బీజేపీ ఆఫీసులను కూడా ఈ పనులకు వాడుకునేవాడు, బెంగాల్ బీజేపీ నాయకులు కొందరు తమ పదవులు కాపాడుకోవటానికి అమ్మాయిల్ని కూడా ఎర వేస్తారా అనడిగాడు… తను ఆర్ఎస్ఎస్ ప్రతినిధినీ అని చెప్పుకున్నాడు…
Ads
రియాలిటీకి వస్తే… ఇదంతా నిజమే అనుకున్నా సరే, తను ఎవరిమీద లైంగిక దాడులేమీ చేయడం లేదు… ఒకవేళ స్త్రీలోలత్వం కరెక్టు కాదు, అలా నాయకులు సరఫరా చేసే అమ్మాయిలతో గడపడం తన స్థాయికి తగింది కాదు అనుకుంటే… బెంగాల్ పదవుల్ని డిసైడ్ చేసేంత సీన్ ఈ మాలవీయకు లేదు… ఉన్నాసరే, బెంగాల్ బీజేపీ పదవులకు కూడా అంత డిమాండ్ కూడా ఏమీ లేదు… అక్కడ మమత రౌడీయిజాన్ని తట్టుకునే ముదుర్లు కావల్సిందే… వాళ్లు మాలవీయ వంటి ఐటీలు, బీటీలను అస్సలు దేకరు…
అసలు ఈ ఆరోపణలు చేసిన శంతనుడు అసలు ఆర్ఎస్ఎస్సే కాదు, ఆ సంస్థే చెబుతోంది… ఏదో తన ఆరోపణలకు బలం, పంచ్ ఉండటం కోసం నేను ఆర్ఎస్ఎస్ ప్రతినిధిని అని చెప్పి ఉంటాడు… ఆర్ఎస్ఎస్ ఇలాంటి స్త్రీలోలత్వం, అమ్మాయిల సరఫరా వంటి చిల్లర ఆరోపణలు చేయదు, ఒకవేళ సీరియస్‌నెస్ ఉంటే నేరుగా బీజేపీ హైకమాండ్ దృష్టికే తీసుకెళ్తుంది…
ఇలా కావాలని సోషల్ మీడియాకెక్కదు… పోనీ, ఇప్పుడు ఆర్ఎస్ఎస్, మోడీ మార్క్ బీజేపీ నడుమ టరమ్స్ బాగా లేవనుకున్నా సరే, ఆర్ఎస్ఎస్ వ్యక్తులపై ఇలాంటి బురదజల్లడం ఎప్పుడూ చూడలేదు… ఏదో దురుద్దేశంతో కూడిన ఆరోపణలు ఇవి…
వెంటనే మీడియా అందుకుంది, ఏదేదో రాసేస్తోంది… ఈ ఆరోపణలపై విచారణ ప్రారంభమైందట… ఎవరు విచారణ జరపాలి..? ఎందుకు..? తను చేసింది చట్టప్రకారం నేరమైతే కాదు… పైగా బీజేపీ ఆయన్ని వెంటనే తప్పించాలట, లేకపోతే సాక్షులను ప్రభావితం చేస్తాడట, ఇది కాంగ్రెస్ ఆరోపణ… ఈ ధోరణులతోనే బెంగాల్‌లో మళ్లీ లేవకుండా మట్టిగొట్టుకుపోయింది అది…
ఎవరో బెంగాల్ లీడర్ మాట్లాడుతూ… వెంటనే జాతీయ మహిళా కమిషన్ స్పందించాలట… మాలవీయ చేసింది నేరమే అయితే నేరుగా బెంగాల్ పోలీసులనే స్పందించాల్సిందిగా డిమాండ్ చేయొచ్చు కదా… ఈ డిమాండ్ చేసింది కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్‌పర్సన్ సుప్రియా శ్రీనేత…! బీజేపీ నాయకులే సరఫరా చేస్తున్నప్పుడు, ఇక అందులో లైంగిక వేధింపులు ఏమిటి..? లైంగిక దాడులు ఏమిటి…?
మాలవీయ కూడా వెంటనే సీరియస్‌గా స్పందించి, ఖండించి, 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు, అనవసరంగా ఎవడో ఏదో కూస్తే రియాక్ట్ కావడం కూడా నెగెటివిటీ పెంచుతుంది… ఈమాత్రం తెలియదా ఒక అధికార పార్టీ ఐటీ సెల్ చీఫ్‌కు… ఈ కేసులు పడేవి కావు, తెగేవి కావు… కొన్ని లీగల్ నోటీసుల దాకా కూడా వెళ్లవు… అవన్నీ మీడియా పిచ్చి వార్తల కోసం… అంతే… ఇవన్నీ నెగెటివ్ స్ట్రాటజీ క్యాంపెయిన్స్… వాటి ట్రాపులో మీడియా కూడా చిక్కుకుని గోక్కుంటూ ఉంటుంది…
Share this Article