కొన్ని విషయాల్లో ప్రభుత్వం డిఫరెంటుగా థింక్ చేయాలి… పరిస్థితులను బట్టి, వినవచ్చే డిమాండ్లను బట్టి… నష్టమేమీ లేనప్పుడు డిఫరెంట్ నిర్ణయాలు తీసుకోవాలి… తప్పులేదు… నిజానికి అలా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తే ఆహ్వానించాలి కూడా… రేవంత్ రెడ్డి వేలాది మంది గ్రూపు-1 ఆశావహుల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో చూాడాలి…
ముందుగా రెండు మూడు రోజులుగా టెలిగ్రాం, వాట్సప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతున్న ఓ మెసేజ్ చదవండి…
సీఎం గారూ..
1:100 ప్లీజ్
—————-
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
గ్రూప్ – అభ్యర్థుల మూకుమ్మడి విజ్ఞప్తి
సర్..
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రోజు ఉదయమే మా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి.. మా ఎగ్జామ్ టెన్షన్‌ను రిలీవ్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ముచ్చటగా మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష రాశాం. మొదటి రెండు సార్లు బాగా రాయని వాళ్లు కొందరు ఈ సారి బాగా రాశారు. అంతకు ముందు బాగా రాసిన కొందరు ఈ సారి సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయారు. పేపర్ ఎలా వచ్చింది? అనే అంశాల జోలికి ఇప్పుడు మేం పోవడం లేదు. కానీ ఒకే ఒక్క బాధ.
Ads
2011 తర్వాత మళ్లీ పుష్కర కాలం తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఈ రిక్రూట్ మెంట్ పూర్తయిపోతే..మళ్లీ మరో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా ఇన్ని పోస్టులు ఉంటాయో లేదో తెలియదు. కాబట్టి.. దయచేసి మెయిన్స్‌కు 1:100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలని మేమంతా కోరుతున్నాం. అభ్యర్థులందరూ మూకుమ్మడిగా ఇదే అభ్యర్థనను వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రాం గ్రూపుల్లో విన్నవిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌లో 70 మార్కులు (కొంచెం అటు ఇటుగా) దాటిన వారు మెయిన్స్‌కు క్వాలిఫై అవుతారు. 1:100 నిష్పత్తిలో అయితే.. 65 మార్కులు (కొంచెం అటు ఇటుగా) దాటిన వారు క్వాలిఫై అవుతారు. మెరిట్‌లో పెద్దగా డిఫరెన్స్ కూడా ఉండదు.
జీవిత కాలానికో అవకాశం అన్నట్టు.. వచ్చే ఈ నోటిఫికేషన్ కు ఇంత కాలానికి ఎగ్జామ్ రాయగలిగాం. చాలా మందికి ఇదే చివరి అవకాశం. కాబట్టి.. మీరు పెద్ద మనసు చేసుకొని 1:100 నిష్పత్తిలోమెయిన్స్ కు క్వాలిఫై అయ్యే విధంగా ఓ నిర్ణయం తీసుకుంటే.. మేమందరం మీకు జీవిత కాలం రుణపడి ఉంటాం. మీ మేలును మరిచిపోలేం…
ఇట్లు
గ్రూప్ – 1 అభ్యర్థులు
ఈ డిమాండ్ న్యాయబద్ధమే అనిపిస్తోంది… పేపర్ హార్డ్‌గా వచ్చినందున మొన్న ఆంధ్రప్రదేశ్‌లో .. అభ్యర్థుల డిమాండ్ మేరకు 1-100 చేశారు… ఇంటర్వ్యూ లేదు కానీ.. 1-2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. అంతే… పోస్టుల సంఖ్య… అంతే ఉంటుంది.. ప్రభుత్వానికి నష్టం లేదు… పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదు…
మెయిన్స్‌కు దిద్దేటప్పుడే పేపర్లు డబుల్ అవుతాయి అంతే… పైగా ఈ పని చేస్తే… సీఎంకు చాలా క్రెడిట్ వస్తుంది కూడా… ఎలాగూ ప్రిలిమ్స్‌కు కీ ఇవ్వడానికి ఓ వారం పడుతుంది… ఆబ్జక్షన్స్ టేకప్ చేసి మరో వారంలో ఫైనల్ కీ ఇస్తారు… ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల సెకండ్ వీక్‌లో ప్రిలిమ్స్ రిజల్ట్ ఇస్తారు… డిసెంబరు 9న సోనియాగాంధీ చేతుల మీదుగా గ్రూప్ -1 విన్నర్స్‌కు సర్టిఫికెట్లు ఇప్పించాలనేది గనుక రేవంత్ ఆలోచన అయితే ఈ ఆశావహుల డిమాండ్ ఆలోచించవచ్చు పాజిటివ్‌గా…
ఇలాంటి విషయాల్లో బ్యూరోక్రాట్ల సలహాలు కాదు, రేవంత్ తను పొలిటికల్ నిర్ణయం తీసుకోవాలి… బ్యూరోక్రాట్ల తాతల్లా ఆలోచించే మేధావుల సూచనల్నీ పట్టించుకోవాల్సిన పని లేదు… ఎస్, మంచి పేరు వస్తుంది అనుకున్నప్పుడు, చాలామంది ఆశలకు మనం కొంత సాయం చేస్తున్నాం అనుకున్నప్పుడు, మెరిట్‌కు అన్యాయం జరగదూ అని తెలిసినప్పుడు… ఆ దిశలో నిర్ణయం తీసుకోవడమే మేలు… ఏమో, రేవంత్ రెడ్డి ఈ ఆశలకు టిక్ మార్కు పెడతాడనే ఆశిద్దాం…
Share this Article