రామోజీరావు సంతాపసభ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు… అది ప్రెస్‌క్లబ్ అధికారికంగా నిర్వహించిన సంతాపసభను ఈనాడు స్పాన్సర్ చేసిందా..? ఈనాడు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించి ప్రెస్‌క్లబ్ సభ్యులందరినీ ఆహ్వానించారా… తెలియదు, స్పష్టత లేదు… అంత స్పష్టత ఉంటే అది ఈనాడు ప్రోగ్రామే కాదు… (ప్రెస్‌క్లబ్ ఈనాడు ఆఫీసు ఎదురుగా ఉండటమే తప్ప ఆయనేమీ అందులో సభ్యుడు కాదు, గతంలో పాత్రికేయ ప్రముఖులు మరణించినప్పుడు ఇలా సంతాపసభలు నిర్వహించినట్టు ఎరుక లేదు…) (Subject to Correction)…
ఈనాడుకు వెన్నుపోటు పొడిచి వేరే పత్రికల్లో చేరిన వాళ్లు కూడా చాలా నీతులు, నైతిక సూత్రాలు మాట్లాడారు… మీటింగులో పెత్తనం అంతా ఈనాడు పెద్దలదే… సరే, అవన్నీ ఎలా ఉన్నా… ఎడిటోరియల్స్ రాసే పర్వతం మూర్తి ప్రసంగంలో కొన్ని అంశాలు కనెక్టింగ్… ఆయన దాదాపు 27 ఏళ్లు రామోజీరావు పేరిట సంపాదకీయాలు రాసేవాడు… ఎఫిషియెంట్ పెన్…
ఆయన మరణానికి ఆరేళ్ల ముందు… అంటే 2018లో ఆయన కాలికి గాయమైంది… అస్వస్థుడయ్యాడు… అప్పుడిక తనకు మరణం తప్పదనే భావనకు వచ్చాడు… డిఫరెంట్ వీలునామా రాయించి, తన తరువాత తన సంస్థలు ఎలా నడవాలో ఓ వీలునామా రాయించాడు… అంతేకాదు, శిరసానమామి పేరిట ప్రజలకు ఓ బహిరంగ లేఖనూ రాయించాడు…
Ads
(ఫోటో, ఇన్‌పుట్స్ ::: బురుజు.కామ్ సౌజన్యం)
తన పేరిట స్మృతివనాన్ని ముందే నిర్మించుకోవడానికి కూడా అదే భావన కారణం… తన ‘చివరి లేఖ’ను రాశాక ఏడ్చేశానని మూర్తి దాదాపు కన్నీటిపర్యంతం అయ్యాడు… తను రాయించుకున్న వీలునామా, లేఖలను తన దగ్గరే ఉంచుకుని, ఆయన మరణానంతరమే ఈనాడు ఇతర పెద్దలకు అందించానని గుర్తుచేసుకున్నాడు…
ఈ సభలో రామోజీ సంతాపసభల స్థానే సంకల్ప సభలు నిర్వహించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు… అదేమిటీ అంటే… ఓ భ్రమపదార్థం… దేనికి సంకల్ప సభలు..? ఆయన జీవితాంతం జర్నలిస్టుల అసోసియేషన్లు, జర్నలిస్టులకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు, ఇతరత్రా ఏకతా ప్రయత్నాలను వ్యతిరేకించాడు… ఇప్పుడు అదే ఆయన సంస్మరణ, సంతాపానికి ప్రెస్‌క్లబ్ వేదికైంది… ఐరనీ…
ఈ మొత్తం మీటింగులో మరొకటి బాగా కనెక్టయిన అంశం ఒకటుంది… రామోజీరావు భార్య పేరు రమాదేవి… ఆమె పేరిటే ఓ పెద్ద కార్పొరేట్ స్కూల్ ఉంది… ఆమె మార్గదర్శి చిట్‌ఫండ్‌లో ఓ చీటి ఎత్తుకుందట… అది తెలిశాక సంబంధిత మేనేజర్‌కు రామోజీ కాల్ చేసి, సరైన ష్యూరిటీలు తీసుకున్నారా అనడిగాడట.,. అవును, రామోజీరావు ఎక్కడైనా వోకే గానీ, తన సంస్థలకు నిర్దేశించిన రూల్స్ విషయంలో నిక్కచ్చిగానే ఉండేవాడు… భార్య అయినా సరే, కొడుకు అయినా సరే… ఓ పద్ధతిని పాటించాల్సిందే… (నిజంగానే ఆయనకు తెలియకుండా ఆమె చీటి ఎత్తుకుందంటే ఆశ్చర్యమే…)
శ్రీకాకుళం జిల్లా రణస్థలం, లావేరు స్ట్రింగర్‌గా చేసి… రీసెంటుగా విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు కూడా మాట్లాడాడు… తనే కాదు, మాజీ మంత్రి కన్నబాబు కూడా మొదట్లో స్ట్రింగరే… అనంతపురం ఎంపీగా అప్పట్లో గెలిచిన కాల్వ శ్రీనివాసులు కూడా రామోజీరావు ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినవాడే…!!
Share this Article