ఎలన్ మస్క్… సింపుల్‌గా చెప్పాలంటే ఓ తెంపరి… సాహసోపేతమైన ప్రయోగాలు చేయగలడు… కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని తన వ్యాపారాలకు అన్వయించుకోగలడు… నష్టాలకూ, కష్టాలకూ రెడీ… కానీ కాస్త మెంటల్…
టెస్లా వరల్డ్ ఫేమస్ బ్రాండ్ వెహికల్… కానీ ఇండియాలో అడుగుపెట్టలేకపోతున్నాడు… కారణాలు పూర్తిగా తెలియవు… ఆమధ్య వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అన్నారు… చివరకు ఠాట్, కుదరలేదు అన్నారు… తీరా వెళ్లి చైనాలో దిగాడు… అక్కడేమైందో గానీ అదీ వర్కవుట్ కాలేదు… చైనాలో ఉన్న కంపెనీలు బయటికి పారిపోతున్నాయి…
విదేశీ కార్లపై ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ… (60 నుంచి 100 శాతం, ఈవీలయితే 100 శాతం… 40 వేల డాలర్ల ధర దాటిన వెహికిల్స్ అయితే)… తగ్గించాలన్నాడు… మోడీ ప్రభుత్వం కుదరదూ అనేసింది… పోనీ, చైనాలో తయారు చేసుకుంటాను, ఇండియాలో అమ్ముకుంటానూ అన్నాడు… అదీ కుదరదు, అది మా మేకిన్ ఇండియా పాలసీకి విరుద్ధం, ఇక్కడే తయారీ యూనిట్ పెట్టుకో అన్నారు కేంద్ర అధికారులు… అలా టెస్లాకు డోర్స్ క్లోజయ్యాయి…
Ads
హఠాత్తుగా మస్క్‌కు ఇక ఇండియాను గోకాలనిపించింది… టెస్లా ఈవీ కార్ల మంట లోలోపల ఉడుకుతున్నట్టుంది… ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు, వాటిని వాడకపోవడమే బెటర్ అన్నాడు… మోడీ ఈవీఎంలు హ్యాక్ చేశాడని అనలేదు, తెలివైన తిక్కోడు కదా… అసలు ప్రపంచంలోకెల్లా అత్యంత సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ, రిజల్ట్స్ వెల్లడి జరిగేది అమెరికాలోనే… ఆ అమెరికన్లు మనకు పాఠాలు చెబుతారు… రష్యన్ టెకీలు అమెరికా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుని కంపు కంపు చేశారనే వార్తలూ విన్నవే…
ఇక ఇండి కూటమి నేతలు రాహుల్ గాంధీ సహా మళ్లీ ఈవీఎంల మీద నెగెటివ్ వ్యాఖ్యలకు దిగారు… మళ్లీ రచ్చ… ఆల్రెడీ సుప్రీం దాకా విచారణ జరిగిన అంశం ఇది… మొన్నమొన్నటిదాకా తెలుగుదేశం ఈ పాటే పాడేది… ఇప్పుడిక వైసీపీ వంతు… కేసీయార్ వంటి నేతలు బెటర్… పనికిమాలిన, ఆధారరహిత ఈవీఎం వ్యతిరేక పాటలకు మళ్లలేదు… ఈవీఎంలు హ్యాకింగ్ అనేది పరాజితులు వెతుక్కునే ఓ సాకు… అంతే…
ఓ నిపుణుడు ఇలా అంటాడు… ‘‘ఈవీఎం అనేది విడిగా పనిచేసే యూనిట్… ఓ కామన్ నెట్‌వర్క్‌లో పనిచేసేది కాదు, వోట్ల లెక్కింపు కూడా విడివిడిగా ఈవీఎంల వారీగా మాత్రమే జరుగుతుంది… అవన్నీ ఒక్కచోట క్రోడీకరిస్తారు… ఫలితాల్ని ఎక్కడో ఓ చోట కూర్చుని ట్యాంపరింగ్ చేయడం గానీ, హ్యాక్ చేయడం గానీ ఎలా కుదురుతుంది..? సింపుల్‌గా చెప్పాలంటే ఇదీ ఓ రకమైన కాలిక్యులేటర్… అంతే…’’
మహారాష్ట్రలో ఎవరో మొబైల్ ఫోన్ ద్వారా ఓటీపీ సాయంతో ఈవీఎం తెరిచాడట… నిజంగా అంత తెలివే ఉంటే ఆ చివరి క్షణంలో ఎందుకు ప్రయోగిస్తాడు, మరీ చచ్చీచెడీ 48 వోెట్లతో ఎందుకు గెలుస్తాడు..? అసలు ఈవీఎంలు తెరవడానికి ఓటీపీ సిస్టమే లేదు… ఆర్వో కూడా అదే మొత్తుకున్నాడు… కానీ ఎవరు వింటారు..? ఓ కేసు నమోదు చేశారు… ఈ తాళ్లు తెగేది లేదు, బలిసేది లేదు…
నిజంగానే మోడీ టీంకు ఈవీఎం హ్యాకింగ్ చేతనైతే… తమ సంకల్పం మేరకు సొంతంగా 370, ఎన్డీయేకు 400 సీట్లు తెచ్చుకునేవాళ్లే కదా… మరీ చంచల మనస్కులైన చంద్రబాబు, నితిశ్ అనే ఇద్దరు అవిశ్వసనీయులైన నేతల మీద ఆధారపడే పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటారు..? అలా సాధ్యమైతే యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ నెగెటివ్ రిజల్ట్ దేనికి..?
చివరకు రాహుల్ గాంధీ వాయనాడు, రాయబరేలిలలో కూడా గెలిచాడు కదా… తమిళనాడులో ఒక్క సీటైనా ట్యాంపర్ చేసేవాళ్లు కదా… కేరళలో యూడీఎఫ్ కూడా గెలిచింది కదా… కర్నాటక, తెలంగాణల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసే కదా గెలుపు సాధించింది… అయోధ్యలోనూ బీజేపీ ఓడిపోయింది కదా…
అసలు ఈవీఎంల పాట హఠాత్తుగా ఎలన్ మస్క్ ఎందుకు ఎత్తుకున్నాడు..? అదీ అసలైన ప్రశ్న… సందర్భం లేదు, తనకు సంబంధం లేదు, టెక్నికిల్ సపోర్టింగ్ వాదన కూడా కాదు… నిజానికి ఇన్ని కోట్ల వోటర్లు, ఇంత వేగంగా… ఈసారి చెప్పుకోదగిన ఒక్క హింసాత్మక సంఘటన లేకుండా… ఇన్ని దశల్లో, ప్రశాంతంగా జరిగిన మన ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే ఓ రికార్డ్..!!
Share this Article