‘‘BJD with vote share of 40.22% got 51 seats zero MP seats.
BJP with less vote share of 40.07% got 78 MLA seats and 20 MP.!!
Congress with 13.26% vote share won 14 MLA seats and one 1 MP seat.
Ads
How this magic of zero MP seats for BJD possible?’’
… తెలుగులో రఫ్‌గా చెప్పాలంటే… ఒడిశాలో బీజేడీకి (నవీన్ పట్నాయక్ పార్టీ) 40.22 శాతం వోట్లు… కానీ ఎంపీ సీట్లు జీరో… బీజేపీ వోట్లు 40.07 శాతం… కానీ 78 ఎమ్మెల్యే సీట్లు, 20 ఎంపీ సీట్లు… కాంగ్రెస్ 13.26 శాతం వోట్లతో 14 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు… ఇదేం మ్యాజిక్..? ఈమాత్రం అత్యంత స్వల్ప తేడాతో బీజేడీకి ఏమిటింతటి పరాజయం..?
ఇదీ సదరు పోస్టుల సారాంశం… హఠాత్తుగా ఈవీఎంల మీద మళ్లీ చర్చ ప్రారంభమైంది కదా… ఆంధ్రాలో, ఒడిశాలో ఏదో మాయ జరిగిందనే నమ్మకం, ప్రచారం పెరిగిపోతున్నాయి… ఒక్కసారి ఒడిశా వాస్తవ ఫలితాలను చూద్దాం…
Seats before | 23 | 112 | 9 |
---|---|---|---|
Seats won | 78 | 51 | 14 |
Seat change | 55 | 61 | 5 |
Popular vote | 10,064,827 | 10,102,454 | 3,331,319 |
Percentage | 40.07% | 40.22% | 13.26% |
Swing | 7.58% | 4.49% | 2.86% |
అది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్… నిజమే… బీజేపీకి బీజేడీకి నడుమ వోట్ల శాతం తేడా జస్ట్ 0.15 శాతం… అంతే… వంద రూపాయల్లో 15 పైసల తేడా… ఈ మాత్రం తేడాకు బీజేడీ 61 సీట్లు కోల్పోయింది, బీజేపీ 55 సీట్లు అదనంగా పొందింది… గెలుపు అటూఇటూ మారిపోయింది… మొత్తం ఒడిశా రాజకీయ, అధికార ముఖచిత్రమే మారిపోయింది… కానీ…
Seats won | 20 | 1 | 0 |
---|---|---|---|
Seat change | 12 | 12 | |
Popular vote | 11,335,549 | 3,264,769 | 9,382,711 |
Percentage | 45.34% | 13.06% | 37.53% |
Swing | 6.94% | 0.34% | 5.27% |
ఇది పార్లమెంటు నియోజకవర్గాల రిజల్ట్… బీజేపీకి ఏకంగా 6.94 శాతం స్వింగ్ ఉంది… బీజేడీ 5.27 శాతం తగ్గిపోయింది… రెండు పార్టీల నడుమ తేడా కూడా 7.81 శాతం… అదుగో అదే నవీన్ పట్నాయక్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా చేసింది… ఇవన్నీ ఎన్నికల సంఘం రికార్డులే… రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేడీల నుంచి బీజేపీ వోట్లు లాక్కుంది… అసెంబ్లీ వోట్ల శాతానికీ, ఎంపీ సీట్ల వోట్ల శాతానికీ నడుమ చాలా తేడా ఉంది ఎందుకు..?
గతంలో కూడా అసెంబ్లీ అయితే నవీన్ పట్నాయక్ నాయకత్వానికి, పార్లమెంటు అయితే మోడీకి పాజిటివ్ ధోరణి కనిపించింది… ఇదే నిష్పత్తిలో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పంచుకుందామని నవీన్ పట్నాయక్ పార్టీ బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తే కుదరలేదు… నిజానికి జమిలి ఎన్నికలు బీజేపీ కోరుకునే కారణం ఇదే… సరే, అది వేరే చర్చ…
మోడీ పాపులారిటీ బలంగా ఉన్నప్పుడు… పార్లమెంటులో తన నాయకత్వానికే జనం జై కొడుతున్నప్పుడు… అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రాంతీయ పార్టీ నష్టపోతుంది… ఎస్, గతంలో కేసీయార్ ఇది గ్రహించే… అసెంబ్లీని ముందే రద్దు చేసి, అసెంబ్లీ ఎన్నికలకు విడిగా వెళ్లాడు… తద్వారా ఎన్నిక పూర్తిగా రాష్ట్ర స్థాయి నాయకత్వం మీదే కాన్సంట్రేటై జనం కేసీయార్‌కు వోట్లేసి గెలిపించారు… సరే, మొన్నటి ఎన్నికల ఫలితాలు వేరు…
నిజంగా నవీన్ పట్నాయక్ గనుక… ఎలాగూ బీజేపీతో పొత్తు పొసగదు అనుకుని ఉంటే… తను కూడా అసెంబ్లీని ముందే రద్దు చేసి, విడిగా ఎన్నికలకు వెళ్లి ఉంటే… ఈ 0.15 శాతం వోట్ల తేడాతో నిండా మునిగిపోయేవాడు కాదు… ఖచ్చితంగా గెలిచేవాడు… మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవాడు… పాండ్యన్ మీద వ్యతిరేకత, నవీన్ కావాలనే బీజేపీని గెలిపించాడు వంటి శుష్క, అర్థరహిత వాదనలు కూడా వచ్చేవి కావు…!! (photo courtesy :: indiatoday) అవునూ, ఆ 0.15 వోట్లు అటు గాకుండా ఇటు పడి ఉంటే…?!
Share this Article