Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హవ్వ… వేణుస్వామి పబ్బులో కనిపించాడట… ఇంకేం, లోకవినాశనమే…

June 17, 2024 by M S R

ఆశ్చర్యమేసింది… అదేదో హెలో పబ్బులో వేణుస్వామి దొరికిపోయాడట… ఇంకేముంది..? ఇంత అన్యాయమా..? అయిపోయింది, లోకం నాశనమే… ఇంత ఛండాలమా..,? ఏమిటీ దరిద్రం..? అన్నట్టుగా ఎడాపెడా పోస్టులు, ట్వీటులు… విమర్శలు, కారెడ్డాలు (వ్యంగ్యాలు)…

నిజానికి చాన్నాళ్లుగా వేణుస్వామి వ్యవహారశైలిని గమనిస్తున్న నాకు అధికాశ్చర్యం ఇది… ఈమధ్య టీడీపీ బ్యాచ్‌కు తను టార్గెటయ్యాడు ప్రముఖంగా… ఎందుకంటే, తను జగన్ మళ్లీ గెలుస్తాడని జోస్యం చెప్పడమే… అవును, అది తప్పే, ఇకపై ఏ సెలబ్రిటీకి జోస్యం చెప్పబోను, నా విద్య అనుమతించిన, చెప్పిన మేరకే ఆ జోస్యం చెప్పాను, ఐనాసరే, ఇకపై ఏ సెలబ్రిటీ గురించీ ఏమీ చెప్పబోను అని పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు తను…

ఐతే పబ్బులో దొరకడం గురించి అంటారా..? అబ్బ, భలే పట్టుకున్నాం ఆయన్ని అని ఒకటే గోల పొద్దుణ్నుంచీ… హహ… వాళ్లందరికీ తెలియని నిజం ఒకటుంది… వేణుస్వామికే ఓ పబ్బు ఉంది… వేరే పబ్బులో దొరకడం ఏమిటి..? ఐనా దొరకడం ఏమిటి..? అదేదో దొంగతనంలాగా…

Ads

తను వామాచార పద్థతిలో చేసే పూజల్లోనే మద్యం, మాంసం ఉంటాయి… ఆ పూజే ఓరకంగా అఘోరా టైపు… ఒరే బాబూ, నా పూజల తీరే ఇదీ అని చెబుతుంటే, పబ్బుల్లో దొరికాడు, మబ్బుల్లో ఉరిమాడు అనే భాషేమిటో… అదేం గొప్పతనపు ప్రకటనో అర్థం కాదు…

వేణుస్వామి

ఆయన కళామందిర్ ఓనర్… అంతకుముందు ఏదో పూజ చేయించుకున్నాడు… నగరంలోని ప్రముఖ వ్యాపారులు, వ్యాపారులకు హెలో పబ్బులో పార్టీ ఇచ్చాడు… ఆ పూజ చేసిన వేణుస్వామి నేరుగా పబ్బుకు కూడా వెళ్లి ఆయనేదో చెబుతుంటే వింటున్నాడు, అదీ కథ…

అసలు తన సోషల్ పోస్టుల్లోనే మటన్, మద్యంతో కనిపించే వేణుస్వామిని ఏదో దుష్టకార్యం చేస్తుంటే పట్టుకున్నట్టు తాజాగా పోస్టులు… నిజానికి ఇవి కాదు… ఎవరైనా నకిలీ బాబాలు, దేవుడి పేరు చెప్పి, వందల ఎకరాల్లో ఆశ్రమాలు కట్టి, అందులో నానా అరాచకాలు చేస్తుంటే… అసాంఘిక కార్యక్రమాలు సాగుతుంటే… వీడియోలు తీసి, కథలు రాసి, బహిరంగం చేయండి, పర్లేదు…

అదీ సమాజహితం… వాడెవడో పబ్బుల్లో కనిపించాడు, వీడెవడో దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు, ఇంకెవడో మటన్ తింటున్నాడు, మరెవడో మందు తాగుతున్నాడు… ఇవా పరిశోధనాత్మక కథనాలు..? యాణ్నుంచి వస్తర్ర భయ్ మీరంతా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions