అదుగో పుష్ప-2, ఇదుగో పుష్ప-2… అని ఊదరగొడుతున్నారు కొన్నాళ్లుగా… పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజులో దుమ్మురేపింది… ఊహించనన్ని కలెక్షన్లు నిర్మాతను ముంచెత్తాయి… దర్శకుడు, హీరోతోపాటు చివరకు ఐటమ్ సాంగ్ డాన్సాడిన సమంత దాకా అందరికీ పేరొచ్చింది… ఊ అంటావా పాడిన ఇంద్రావతి చౌహాన్ సహా…
ఈ నేపథ్యంలో పుష్ప-2 రేంజ్ ఇంకా పెరిగింది… అదే రష్మిక, అదే ఫహాద్ ఫాజిల్, అదే సునీల్, అదే అనసూయ ఎట్సెట్రా… ఈసారి అదేరేంజులో కిక్కిచ్చే ఐటమ్ సాంగ్ ఉంటుందా..? ఎవరు పాడింది..? ఎవరు ఆడింది..? ఈ ప్రశ్నలు వదిలేస్తే… మొదట ఏదో రిలీజ్ డేటా అన్నారు కదా… (ఆగస్టు 15..?)
తీరా చూస్తే ఇస్మార్ట శంకర్ అనబడే మరో సినిమా రిలీజు అవుతుందట… సో, దాంతో అందరూ అనుకున్నారు, పుష్ప-2 వాయిదా పడినట్టేనని..! ఎందుకంటే… రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావు, కానివ్వరు, సేఫ్ గేమ్ ఆడతారు అందరూ… మరి రెండో పుష్పం ఎప్పటికి వాయిదా పడింది..? ఎందుకు..?
Ads
తాజా డేట్ డిసెంబరు 24 అట… అంటే ఇప్పటి నుంచి ఆరు నెలలు… మరీ ఇంత ఆలస్యమా..? అందరిలోనూ ఇదే హాశ్చర్యం… తీరా ప్రచారంలోకి వచ్చిన అంశమేమిటయ్యా అంటే… ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజీ అల్లు అర్జున్‌కు నచ్చలేదట… అదీ సంగతి…
మరేమిటీ పరిష్కారం..? ఏముంది సింపుల్… 40 శాతం వరకూ రీషూట్ చేస్తారట… మళ్లీ ఆర్టిస్టులు డేట్స్, షూటింగ్ ప్లాన్, ఖర్చు, ప్రయాస… మొదటికొచ్చినట్టే కథ… సినిమా నిర్మాణ వ్యయం కాస్తా తడిసిమోపెడు… సరే, అయితే అయ్యింది, మరి రీషూట్ కాస్తా ఇలాగే ఉంటే..? అతి పెద్ద ప్రశ్న…
ఒకరకంగా ఇప్పటిదాకా షూటింగ్ ఫుటేజీ హీరోకే నచ్చలేదంటే అది ఒకరకంగా దర్శకుడికి అవమానకరమే… ఎందుకంటే, షూట్ చేసిన ప్రతి సీను తనకు నచ్చినట్టే కదా ఇప్పటిదాకా… అంటే హీరో ఇప్పటిదాకా షూటింగ్ ఎలా వచ్చిందో, ఫుటేజీ ఎలా ఉందో చూసుకోలేదా..? అంతా పెద్ద ప్రశ్న… అన్నింటికీ మించి ఆ దర్శకుడు సుకుమార్ ఇమేజీకి ఒక్కసారిగా పంక్చర్ పడినట్టే… సరే, ఈ 40 శాతం రీషూట్ అనేది నిజమైతేనే..! అదే జరిగితే చాలా పెద్ద వార్తే… పాన్ ఇండియా క్వశ్చన్..!!
Share this Article