కల్కి… ఈ సినిమా మీద ఇండస్ట్రీ చాలా హోప్స్ పెట్టుకుంది… టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్, ఆల్‌వుడ్స్ కూడా… చాన్నాళ్లుగా పెద్ద సినిమాల్లేవు… మరీ నార్తరన్ థియేటర్లు ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి… తెలుగులో కూడా ఓ పెద్ద సినిమా రాక చాన్నాళ్లయింది…
థియేటర్లకు జనం రావడం లేదు పెద్దగా… అసలే ఓటీటీ ప్రభావం కూడా ఎక్కువే ఉంది… టికెట్ల ధరలు, క్యాంటీన్ రేట్లు, పార్కింగ్ దందా, థియేటర్ దాకా వచ్చీపోవడానికి టైమ్, పర్స్, కాలుష్యం, ట్రాఫిక్ ఎట్సెట్రా వాయింపు ఉండనే ఉంది… పెద్ద సినిమా వస్తే ఫ్యామిలీలు కదులుతాయి… పిల్లాపీచు తరలివస్తేనే మళ్లీ థియేటర్లకు జనకళ, ధనకళ…
మలయాళంలో కొన్ని పెద్ద సినిమాలతో (నిజానికి చిన్నవే, కానీ కలెక్షన్లలో పెద్దవి) ఈ సంవత్సరం అక్కడ థియేటర్లు బాగానే నిండుతున్నయ్… ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడంలో సక్సెసయ్యాయి అవి… కానీ కన్నడం, తమిళం, తెలుగు, హిందీ అంతంతమాత్రమే…
Ads
పాన్ ఇండియా రేంజ్‌గా చెప్పుకునే పుష్ప-2 కూడా ఎప్పుడో డిసెంబరుకు వాయిదా పడింది… ఈ స్థితిలో ఓ పాన్ ఇండియా మూవీ వస్తే ఇండస్ట్రీకి కొంత పుష్… ఆ కరువు కల్కి తీరుస్తుందని ఆశ… పైగా ప్రభాస్‌కు నేషనల్ లెవల్ పాపులారిటీ ఉంది కూడా… కల్కి కోసం భారీగా ఖర్చు పెట్టారు, పైగా అందులో అమితాబ్, దీపిక పడుకోన్ తదితరులు నటించడంతో సహజంగానే దేశవ్యాప్తంగా సినిమా ప్రియుల అటెన్షన్ పడింది…
రిలీజ్ డేట్ దగ్గరకొస్తోంది… 27 కదా ప్రపంచవ్యాప్త విడుదల… కొద్దికొద్దిగా పబ్లిసిటీ పెంచుతున్నారు… ట్రెయిలర్, సాంగ్స్ విడుదల ఎట్సెట్రా… ఇంకా ముఖ్యనగరాల్లో మీడియా మీట్లు, ప్రిరిలీజ్ ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు గట్రా ఇంకా స్టార్ట్ కానట్టుంది… ప్రభాస్ సినిమా కాబట్టి తెలుగు నగరాల్లో కూడా క్యాంపెయిన్ తప్పదు…
ఈ నేపథ్యంలోనే అమరావతిలో ప్రిరిలీజ్ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారట… పైగా అశ్వినీదత్‌కూ అమరావతికి ‘మాంచి ఆర్థిక సంబంధాలు ప్లస్ ఇప్పుడు రాజకీయాధికార సంబంధాలు’ కూడా ఉన్నాయి కదా… కానీ ఈ మూమెంట్‌లో అక్కడ ప్రిరిలీజ్ ఫంక్షన్ పెడితే అనవసరంగా పొలిటికల్ రచ్చ జరుగుతుందని, అది సినిమాకు నెగెటివ్ అవుతుందనే సందేహంతో ప్రభాస్ నో అన్నాడని సమాచారం… ప్రభాస్‌కు పొలిటికల్ అఫిలియేషన్స్ లేవు, కానీ అశ్వినీదత్‌కు ఉన్నాయి…
నిజమే… ఏపీలో పొలిటికల్‌గా సెన్సిటివ్ వాతావరణం ఉంది… పోస్ట్ ఎలక్షన్ ఉద్రిక్తతలు చాలా ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి… పైగా హీరోల ఫ్యాన్స్ గొడవలు సరేసరి… అసలే ఓవైపు బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్, వైసీపీ వర్సెస్ యాంటీ- వైసీపీ సెక్షన్ల నడుమ సోషల్ వార్ జరుగుతోంది… ఆదిపురుష్ ప్రిరిలీజ్ తిరుపతిలో చేస్తే అదీ అచ్చిరాలేదు… సో, టాలీవుడ్ అడ్డా హైదరాబాదులో ప్రిరిలీజ్ పెట్టేస్తే సరిపోతుందనే ఆలోచనలో ఉన్నారట…
నిజమే, హైదరాబాద్‌లో అన్ని సినిమాలూ ఆడతాయి… పలు భాషల, పలు సంస్కృతుల మేళవింపు హైదరాబాద్… హిందీ చిత్రాలు కూడా సౌత్ ఇండియాలో స్ట్రెయిట్‌గా బాగా ఆడే ప్లేస్ హైదరాబాదే… సో, హైదరాబాదే పక్కా… చలో ప్రభాస్, అలాగే కానిద్దాం…!
Share this Article