గుర్తుతెలియని సాయుధుల కాల్పుల్లో మరణించిన నిజ్జర్‌కు మొన్న కెనడా పార్లమెంటు నివాళి అర్పించడం ఓ అసాధారణ పరిణామం… ఇండియా ఓ ఉగ్రవాదిగా, వాంటెడ్ పర్సన్‌గా ప్రకటించిన వ్యక్తి మరణిస్తే ఒక దేశం అలా అధికారికంగా నివాళి అర్పించడం అంటే ఇండియాతో సంబంధాలు ఎలా ఉన్నా పర్లేదనే తెంపరితనం ట్రూడో ప్రభుత్వానిది…
ఇండియన్ ఏజెంట్లే హతమార్చారంటూ ఆ దేశం రచ్చ చేస్తోంది… ఇతర దేశాలనూ లాగుతోంది ఇండియాకు వ్యతిరేకంగా… ఐతేనేం, ఆ గుర్తుతెలియని వ్యక్తులు చేసే హత్యలు ఆగుతున్నాయా..? లేదు… ఏకంగా పాకిస్థాన్‌లో కరడుగట్టిన ఉగ్రవాదుల్ని సైతం సింపుల్‌గా లేపేస్తోంది… గతంలో ఉగ్రవాదులకు జనం భయపడే స్థితి ఉంటే, ఇప్పుడు ఉగ్రవాదులే భయంభయంగా మసిలే సిట్యుయేషన్… తాజాగా మరొకడిని లేపేశారు గుర్తుతెలియని సాయుధులు… అదీ పాకిస్థాన్‌లోనే…
మాజీ డైరెక్టర జనరల్, ఎమర్జెన్సీ సర్వీసెస్ అకాడమీ ఆఫ్ పాకిస్థాన్ ఆర్మీ 1122 బ్రిగేడియర్ అమీర్ హంజాను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు… నల్లని దుస్తులు ధరించిన నలుగురు మోటారు బైకుల మీద వచ్చారు, కాల్పులు జరిపారు, పారిపోయారు… వేగంగా జరిగిపోయింది, హంజా కుప్పకూలిపోయాడు… అసలు ఎవరు అమీర్ హంజా..? ఎందుకు హత్య చేశారు..?
Ads
కశ్మీర్‌లో చెట్ల పొదల చాటున దాగి, హఠాత్తుగా రోడ్డు మీదకు రావడం, కాల్పులు జరిపి, తిరిగి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయి, అట్నుంచటే పాకిస్థాన్ సరిహద్దులు దాటి వెళ్లిపోయే టెర్రరిస్టులు హంజా శిక్షణ ఇస్తుంటాడు… అదీ తన నేపథ్యం… పది రోజుల క్రితం వైష్ణోదేవిని దర్శించుకుని వచ్చే భక్తుల బస్సుపై దాడికి అసలు బాధ్యుడు అమీర్ హంజానే…
ప్రణాళిక రచన, శిక్షణ అమీర్ హంజాది, అమలు చేసింది ఆయన మనుషులు… All Eyes on Raeisi అనే ప్రచారం చూశాం కదా… వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దాక్కున్న అమీర్ హంజా శిష్యులను మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు లేపేశారు… అమీర్ హంజాని కూడా సేమ్ అలాగే… పాకిస్థాన్ ఆ అపరేషన్ ఖతం అయిపోగానే కశ్మీర్‌లో వీళ్లకు సహకరించిన ముగ్గురిని సైన్యం మట్టుబెట్టింది… అలా రైసీ దుర్ఘటనకు కారకులు, బాధ్యుల పైకి పంపించబడ్డారు… (By పోట్లూరి పార్థసారథి)
Share this Article