కస్తూరి… కంట్రవర్సీ కేరక్టర్ అని కాదు… కాకపోతే కాస్త తిక్క మనిషి… జనం నవ్వుకుంటారనే సోయి కూడా లేకుండా సోషల్ మీడియా పోస్టులు పెడుతుంది, మాట్లాడుతుంది… ఏవో పిచ్చి వ్యాఖ్యలు…
పైగా తనకు గీర… సమాజానికి ఉపయోగపడే యాక్టివిస్టును అని… సోషల్ మీడియాలో ట్వీట్లు పెడితే చాలు సొసైటీని ఉద్దరిస్తున్నట్టే అనుకునే కొందరు టిపికల్ యాక్టివిస్టుల జాబితాలో ఆమె కూడా…
మొన్నామధ్య నా వయస్సు తక్కువ కనిపించడం వల్ల తెలుగు, తమిళ సూపర్ స్టార్లతో చేసే అవకాశాలు మిస్సయ్యానంటూ నవ్వు పుట్టించే వ్యాఖ్యలు చేసింది కదా… అదేదో మహేశ్ బాబు పక్కన నటించే చాన్స్ కూడా అందుకే కోల్పోయినట్టు…
Ads
సరే, ఆమె సోషల్ పోస్టుల క్వాలిటీ, వివాదాల గురించి రాస్తే ఓ రెండుమూడు నవలలవుతాయి, వాటిని అలా వదిలేస్తే… ఇప్పుడు తాజాగా ఇంకొకటి వదిలింది… ఆమె సోషల్ పోస్టులు నిజంగా బీపీలు, స్ట్రెస్ బస్టర్లు… నవ్వుకోవచ్చు…
ఈ ఫోటో తెలుసు కదా… అప్పట్లో బ్రెస్ట్ ఫీడింగ్, అమ్మతనం ప్రాధాన్యతల్ని తెలిపే ఓ ఫోటో షూట్ బాపతు… (ఓ మలయాళ నటి ఒక మ్యాగజైన్ కోసం ఇలాంటి ఫోటోషూట్ చేసింది… ఇతర దేశాల్లో ఇలాంటి ఫోటోలు బోలెడు… అయితే అమ్మతనం, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాధాన్యం చెప్పడానికి ఇలా అర్ధనగ్నంగా ఫోటోలు దిగి మరీ ప్రచారం చేయాలా అనేది పెద్ద ప్రశ్న, ఇక్కడ ఆ లోతు చర్చలోకి పోవడం లేదు…)
కస్తూరి 2000లో ఇండస్ట్రీని విడిచిపెట్టి, ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది… అప్పుడు తన నెలల పిల్లాడితోనే చేసిన ఫోటో షూట్ అట ఇది… (నెట్‌లో కొన్ని అశ్లీలంగా కనిపించే ఫోటోలు కూడా ఉన్నాయి… ఫేక్ కావచ్చు, కాకపోవచ్చు…)
ఇప్పుడు హఠాత్తుగా సందర్భం ఏమొచ్చిందో గానీ… ఆ ఫోటోలు అమెరికా మ్యాగజైన్ కోసం చేశాను, మన ఇండియన్స్ కోసం కాదు, అమెరికాలో ఇలాంటివి నెగెటివ్‌గా చూడరు, వాళ్లు అమ్మతనానికి ఇచ్చే మర్యాద అది… మన కల్చర్‌కు ఇది నప్పదు, మనవాళ్లు ఇచ్చే మర్యాద వేరు… బిడ్డకు పాలివ్వడాన్ని మనవాళ్లు చూసే ధోరణి వేరు… అమ్మయ్యాక శరీరంలో మార్పులు వస్తాయి, దాని మీద అవగాహన కల్పించడానికే ఆ ఫోటో షూట్ అని చెప్పుకొచ్చింది…
ఓహో, అమ్మతనం విలువ చెప్పాలంటే అర్ధనగ్న ఫోటోలు కావాలా..? పైగా తల్లయ్యాక దేహంలో వచ్చే మార్పులు చెప్పాలంటే ఇదా పద్ధతి..? పైగా మాతృత్వం గురించి ఇండియన్లు వేస్ట్, అమెరికన్లు బెస్టా..? దిక్కుమాలిన వ్యాఖ్యలు… పైగా నా అనుమతి లేకుండా ఓ పెద్ద పత్రికే నా ఫోటోల్ని వాడుకుంది… సెన్స్ లేదు అంటోంది…
మళ్లీ తనే ఏమంటుందంటే… ‘ఒక మీడియా నన్ను అడిగి పబ్లిష్ చేసింది… తరువాత అందరూ దొంగతనంగా వాడేసుకున్నారు’ అట… ఇండియన్ మార్కెట్‌కు ఈ ఫోటోలు నప్పవు అనుకున్నప్పుడు మరి ఒక మీడియాకు అనుమతి ఎందుకు ఇచ్చినట్టు..? డబ్బు కోసం… అంటే డబ్బిస్తే హఠాత్తుగా ఈ ఫోటోలు ఇండియన్ మార్కెట్‌లో యాక్సెప్టబుల్ అవుతాయా..?
అమ్మా, తల్లీ… పాలిచ్చే తల్లులను ఇండియాలో కామదృష్టితో ఎవడూ చూడడు, అంత నైచ్యం మన సొసైటీలో లేదు ఎప్పుడూ… ఒకరిద్దరు ఉంటారేమో… అలాంటోళ్లు అన్ని దేశాల్లోనూ ఉంటారు… పనికిమాలిన సమర్థనలు చేసుకుంటూ ఇంకా ఇజ్జత్ తీసుకోకు, ఇలాంటి ఫోటోల్లాగా..!!
Share this Article