Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డైలాగ్స్..! సీన్ ఎలివేట్ కావడానికి దోహదం.,. ముళ్లపూడి మార్కే వేరు..!!

June 28, 2024 by M S R

ముళ్లపూడి వారి అక్షర మల్లెపూలు…

… ఇవాళ మన ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన్ని నిర్మించుకుంటూ సినిమాల్లో ఆయన డైలాగులు కొన్ని..
(‘ముత్యాలముగ్గు’ సినిమాలో సంగీత..)
“కన్నెపిల్ల మనసు అద్దంలా ఉంటుందట. అందులో తాళి కట్టే వాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపోతుంది. అని మా బాబాయి గారు చెప్పేవారు”

– – –
(‘గోరంత దీపం’ సినిమాలో వాణిశ్రీ, శ్రీధర్.. )
“ఎంత హాయిగా ఉంది! ఆ ఇంటికీ ఇక్కడికీ గాలివాన వెలిసినట్టుగా లేదూ!”
“ఉంది. భయపెట్టే వెన్నెల్లా ఉంది.”

Ads

– – –
(‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, గుండు సుదర్శన్..)
“ఏవోయ్! ఈ పూట వంటేంజేసావోయ్?”
“తగలేసాను”
“పోన్లెద్దూ! నాకో కప్పుడు కందిపప్పప్పిపిస్తావా?”
“ఇప్పిప్పించను”

– – –
(‘శ్రీనాథ కవిసార్వభౌమ’లో ఎన్టీఆర్)
“పిల్లా! ఏ ఊరి సరుకు?”
“తునాకుంది, కొల్లిపరుంది, పొదిలాకుంది. మాపటికా, రేపటికా?”
“ఈపటికే”

– – –
(‘రాధాగోపాళం’లో శ్రీకాంత్, స్నేహ)
“గోడౌన్‌లో అంతసేపు మంతనాలేమిటో?”
“అబ్జెక్షన్ యువరానర్! మంతనాలు అన్న మాట తగదు. తప్పర్థం వస్తుంది.”
“సంతకాలకు రోజుల తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా? తప్పర్థం వచ్చినా తప్పదు.”

– – –
(‘పెళ్లిపుస్తకం’లో దివ్యవాణి, ఝాన్సీ(సీనియర్ నటి))
“అంటే మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ దేనికీ తగాదాలు రాలేదా అండీ!”
“భలేదానివే! తగదాల్లేని బతుకు పోపు లేని చారులా చప్పగా చస్తుంది. ఒకరికొకరు రబ్బరు స్టాంపులా ఉండగూడదంటారాయన. మాకూ ఎన్నో గిల్లికజ్జాలు, యుద్ధాలు, పెడమొహాలు”

– –
(‘రాధాగోపాళం’లో శ్రీకాంత్, స్నేహ)
“వాడికి శిక్ష పడి తీరాలి”
“పడదు. నా క్లయింటు మీద ఈగ కూడా పడదు.”
“ఈగలు పడవు. ఈగలు వాలును”

– – –
(‘సుందరకాండ’లో ప్రేమ, ఛార్మి)
“ఆలిని నవ్వించాలంటే అమ్మను ఏడిపించాలి. అమ్మ నవ్వాలంటే ఆలిని ఏడిపించాలి. అదీ కథ.”
“కట్టుకున్న వాడి కోసం కన్నవాళ్లని వదిలేసొచ్చిన పెళ్లాన్ని ఏడిపించొచ్చేమిటి?”

– – –
(‘రాంబంటు’లో ఓ సన్నివేశం)
“నేను బడికెళ్లను. అడివికే ఎల్తాను.”
“అడవిలో ఏముంది? పులి, మేక, చంపడం. అంతేగా!”
“మా అడివిలో పులి మేకనే కరుస్తుంది. మేక గడ్డినే కరుస్తుంది. మీ అడివిలో మనిసే మనిసిని కరుస్తాడు”

– – –
(‘శ్రీరామరాజ్యం’లో నయనతార)
“నాయనా! దుడుకు పనులు చెయ్యకండి.”
“చెయ్యం.. చెయ్యం”
“ఎవరితోనూ తగాదాలు పెట్టుకోకండి.”
“పెట్టుకోం.. పెట్టుకోం”
“ఎవరైనా దానం, ధర్మం ఇచ్చినా పుచ్చుకోకండి.”
“పుచ్చుకోం.. పుచ్చుకోం”
“అల్లరి చెయ్యడం మానకండి.”
“మానం.. మానం”

– – –
(‘ముత్యాలముగ్గు’లో సంగీత, శ్రీధర్)
“నా నాలుక చూడు.. పండిందా?”
“అబ్బా! వెన్నెల్లో దీపంలా ఉంది.”

– – –
(‘వంశవృక్షం’లో అనిల్ కపూర్)
“సో! యువర్ నేమ్ ఈజ్ సరస్వతి. సరస్వతీ దేవికి అనగా సాక్షాత్తూ చదువుల తల్లికి కాలేజీలో సీటు కావాలా? దానికి సిఫార్సా? అంటే మా కాలేజీలో సరస్వతి లేనట్టేగా?” – – – విశీ  (సాయి వంశీ)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెరోల్..! అన్ని బంధాల్నీ గౌరవించే ఓ అనుబంధాల బాధితుడి కథ..!!
  • సీఎం ప్రసంగాల్లో గుణాత్మక మార్పు… విజన్ 2047 గురించి గుడ్ ప్రొజెక్షన్…
  • కేసీయార్ ఢిల్లీకి పోయేది లేదూ… పోయినా పలకరించే గొంతూ లేదు…
  • రీల్ హీరోలు కాదురా… ఇదుగో వీళ్లు రియల్ హీరోలు… మార్గదర్శులు…
  • గుడ్లగూబ కళ్లతో అదరగొట్టేస్తయ్… ఈ జీవులేమిటో తెలుసా..?
  • వరల్డ్ ఫేమస్ గాంజాకు అడ్డా… అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులు…
  • పులివెందుల… అప్పటి వైఎస్సూ లేడు, అప్పటి చంద్రబాబూ కాడు…
  • 74 ఏళ్లొచ్చినా… రజినీలో అదే స్టయిల్… అదే ఎనర్జీ… దీనికీ అదే ప్రాణం…
  • ఉద్యమ సంధానకర్తగా రేవంత్ గౌరవించాడు కాబట్టి… బీఆర్ఎస్ ట్రోలింగ్..!!
  • War-2 review ….. జూనియర్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions