నిజంగా సినిమా ప్రభావం చాలా ఉంటుంది… నిన్న రాత్రి నా బిడ్డ నుంచి వీడియోకాల్…
ఎంతో ఎగ్జయిటెడ్ గా… అమ్మా, కల్కి బాగుందమ్మా… నాకైతే ఎంత నచ్చిందో… నేను అర్జెంటుగా మహాభారతం చదవాలి అంటోంది… హహ
ఎన్నిసార్లు చెప్పానో చదువూ చదువూ అని… సినిమా చూస్తేనే చదవాలనిపిస్తోందా అని అడిగా నవ్వుతూ… సరే, సులభంగా అర్థమయ్యే రాజాజీ వచన భారతం ఎక్కడో ఉండాలి… వెదికి పంపిస్తాలే అన్నాను…
Ads
నాన్న కాల్ లిఫ్ట్ చేయటం లేదు, పడుకున్నాడేమో… నాన్నను తప్పకుండా ఈ సినిమాను చూడమను అంటోంది… (తనేమో మొన్ననే , అదేమన్నా మా బాలయ్య సినిమానా రిలీజైన వెంటనే చూడ్డానికి, మెల్లగా చూస్తాలే అన్నాడు కొడుకుతో..)
నిజంగా భలే అనిపించింది… బిడ్డ అలా అడిగితే… చిన్నప్పటినుంచి పురాణేతిహాసాలు అంత ఆసక్తిగా ఏం వినేది కాదు… నా కొడుక్కేమో భారత, భాగవత కథలు ఇష్టం… ఎందుకో రామాయణం ఎక్కువగా అడగలేదు చిన్నప్పుడు…
నా బిడ్డకేమో అప్పటి నుంచే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటిక్స్ ఇష్టం… మొన్న కల్కి ప్రి-రిలీజ్ ఫంక్షన్ చూస్తూ అక్కాతమ్ముళ్లు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు… ‘వస్తావా… అక్కీ బావతో వెళ్దామనుకుంటున్నాను అని నా కొడుకంటుంటే, నేనూ హంసిక వెళ్తున్నాంరా ఇక్కడే అని తను…
అవునా, మంచి సినిమానారా, అమితాబ్ ఉన్నట్టున్నాడుగా అందులో అని నేనంటే… హా.. అశ్వత్థామ కేరక్టర్ అమ్మా అన్నాడు.. కేరక్టర్ పేరా అది అనడిగితే … అదేందమ్మా, అట్లా అడుగుతున్నవ్.. ద్రోణాస్ సన్ … మహాభారతం నుంచి మొదలుపెట్టి కల్కి అవతారం వరకూ ఉంటుందట అన్నాడు…
అప్పటికి నిజంగా అది భారతం ఆధారిత సినిమా అని తెలీదు… ఏదో ఓ సోషల్ మూవీ కావచ్చు అనుకుంటున్నా… అశ్వత్థామ పాత్ర ఇంకా గుర్తుందారా అంటే మధ్యలో మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా.. సద్గురు చెప్తే విన్నాను ఓసారి…. నువ్ కూడా ఆమధ్య ధర్మరాజు సత్యనీతి గురించి చెప్తూ అశ్వత్థామ హతః కుంజర గురించీ చెప్పావు కదా అన్నాడు…
మూడు రోజులుగా భారతం గురించే ఏదో ఒకటి మాట్లాడుతున్నాం మా ఇంట్లో… అప్పుడప్పుడు మా ఆయన కూడా నేను చెప్పేది శ్రద్ధగా వింటుంటాడు… నా కొడుకు పుస్తకాలు అడుగుతాడు, చదువుతాడు… చాలా ఏళ్లకి నా బిడ్డ మహాభారతం ఇవ్వు చదువుతా అంటోంది… ఈ తరం పిల్లలూ అడుగుతున్నారు… చర్చ నడుస్తోంది అంటే మంచిదే కదా……. By దేవికారెడ్డి
Share this Article