Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ కోమటాయన పత్రికలో ఈ అజాతశత్రు గురించి నెగెటివ్ ప్లాంటెడ్ స్టోరీ..!!

July 4, 2024 by M S R

ఆయనో రాజకీయ విశ్వవిద్యాలయం . ఊరకూరకనే ఆయాసపడే ఈతరం రాజకీయ నాయకులు రోశయ్య గారి సంయమనం , క్రమశిక్షణ వంటి ఎన్నో మంచి లక్షణాలను అధ్యయనం చేయాలి , నేర్చుకోవాలి . ఈరోజు ఆయన జయంతి . వారికి నివాళులను అర్పిస్తూ , ఓ సంఘటనను మిత్రులతో పంచుకుంటా …

1978 లో అనూహ్యంగా ఇందిరా కాంగ్రెస్ ఆం.ప్ర లో గెలిచింది . చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి . శాసనమండలిలో రోశయ్య గారు చెన్నారెడ్డి గారికి చుక్కలు చూపించేవారు . అంతటి ఘటనాఘటన సమర్ధుడు చెన్నారెడ్డి గారు కూడా ఇరుకున పడుతుండే వారు .

అటుచేసి ఇటుచేసి ఆయన్ని కాంగ్రెస్ లోకి తీసుకుని వచ్చి మంత్రిని చేసారు చెన్నారెడ్డి గారు . ఆయన తర్వాత రెండవ కృష్ణుడిగా అంజయ్య గారు CM అయ్యారు . ఆ మంత్రివర్గంలో కూడా రోశయ్య గారు మంత్రిగా ఉన్నారు . మూడవ కృష్ణుడిగా భవనం వెంకటరామిరెడ్డి గారు CM గా అయ్యారు . కానీ రోశయ్య గారికి మంత్రి పదవి ఇవ్వలేదు .

Ads

రాష్ట్రమంతా ఆశ్చర్యం . ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘాలు బాగా ఆసంతృప్తికి గురయ్యాయి . గుంటూరు జిల్లా ఆర్యవైశ్య మహాసభ Fancy Merchants Association Hall లో సమావేశమయి , బంద్ కు నిర్ణయం తీసుకున్నాం . ఇంతలో ఆయన గుంటూరు వచ్చారని , వియ్యంకులు కోట శంకరరావు గారింట్లో ఉన్నారని తెలిసింది .

మేమంతా ఆయన దగ్గరకి వెళ్ళి , మా బంద్ నిర్ణయాన్ని తెలియపరిచాం . ఆయన హడావుడి ఏమీ చేయకండి . మరో వైశ్య MLA ఓ పత్రికను సృష్టించి , తాను ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఇందిరాగాంధీ గారిని దుర్భాష ఆడినట్లు , ఆ పత్రికలో ముద్రింపచేసి ప్రధానమంత్రి కి చేర్చారు , టైం పడుతుంది , హడావుడి చేయవద్దనీ మా అందరి నిర్ణయాన్ని ఆపేసారు .

ఆయన సంయమనం పాటించి , వాస్తవాలను ఇందిరాగాంధీ గారికి తెలియచేయటం , ఆ తర్వాత నాలుగవ కృష్ణుడు విజయభాస్కరరెడ్డి గారి మంత్రివర్గంలో మరలా మంత్రి కావటం జరిగి పోయింది .

అలానే మరోసారి జనార్ధనరెడ్డి గారి మొదటి కేబినెట్లో కూడా మంత్రిగా లేరు . అలా ఎప్పుడూ హడావుడి పడటం , వివాదం సృష్టించటం వంటి విన్యాసాలు చేయలేదు . కాబట్టే తర్వాత కాలంలో ముఖ్యమంత్రి , ఆ తర్వాత గవర్నరు పదవులు ఆయాసం లేకుండా వరించాయి ఆయన్ని . కేంద్రంలో NDA ప్రభుత్వం వచ్చినా ఆయన్ని గవర్నరుగా కొనసాగించారు .

ప్రశాంత జీవితానికి , రాజకీయానికి , సంతృప్తికి నిలువెత్తు రూపం రోశయ్య గారు . పదవి/బాధ్యత ఇస్తే చేస్తారు . లేకపోతే గాంధీ భవన్ కు వెళ్లి కూర్చుంటారు . అంతటి సంయమనం సహనం . ఆయనకు నేను తెలుసు , నేనంటే ఇష్టం అని చెప్పుకోవటం నాకెప్పుడూ గర్వమే …. By     డోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions