ఆమె హఠాత్తుగా తనిఖీకి వెళ్లింది… అవున్లెండి, తనిఖీలంటేనే చెప్పి వెళ్లరు కదా… గుడ్… పేరు ఆమ్రపాలి… సరే, ఆమ్రపాలిరెడ్డి… హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాత్రమే కాదు, మొత్తం ఐదు పోస్టుల్లో ఆమె అధికారిణి… బాగా యాక్టివ్… ఎనర్జిటిక్…
కొన్నాళ్లు ప్రధాని కార్యాలయంలో పనిచేసి, రీసెంటుగా తెలంగాణకు వచ్చేసి, మంచి పోస్టుల్లో చేరింది… అదంతా వోకే… కావాలని యాంటీ కాంగ్రెస్, ప్రొ బీఆర్ఎస్ గ్రూపులు ఆమె పేరు చివర రెడ్డి అని యాడ్ చేస్తున్నారు, ఆమె కులాన్ని సూచిస్తూ, అందుకే రేవంత్ రెడ్డి సర్కారుకు ఇష్టురాలైపోయింది, అందుకే ఇన్ని పోస్టులు అని అర్థమొచ్చేలా…
సరే… రెడ్డి కాబట్టి కాంగ్రెస్ సర్కారులో ప్రాధాన్యం వచ్చిందనే ప్రచారం పక్కన పెడితే… మరి ప్రధాని కార్యాలయంలోకి ఎలా చేరింది..? ఆమె గుజరాతీ కాదు కదా…! సో, ఇవన్నీ వస్తూనే ఉంటాయి… కానీ ఆమె డ్రెస్ సెన్స్ మాత్రం ఎప్పుడూ కంట్రవర్సీయే… ఖచ్చితంగా..!
Ads
బాగా గుర్తుంది… ఓసారి వరంగల్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు కావచ్చు, వేయి స్తంభాల గుడిలో ఏదో ప్రోగ్రామ్‌కు ఓ కాజువల్ డ్రెస్ వేసుకుని వెళ్లింది… విమర్శల పాలైంది… సందర్భాన్ని బట్టి దుస్తులు, లుక్, అప్పియరెన్స్ ఉండాలనే స్పృహ ఆమెకు తక్కువే… ఇదేందమ్మా అంటే మరీ అనసూయలాగా నా డ్రెస్సు, నా ఇష్టం, మా డ్రెస్సుల మీద కూడా మీ వివక్షలు ఏంటి..? విమర్శలు ఏంటి అని విరుచుకుపడదు… కానీ చాలామందికి నచ్చదు…
వరంగల్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు పలుసార్లు ఆమె డ్రెస్ సెన్స్ రాజకీయ నాయకులకు నచ్చలేదు… ఓసారి కేసీయారే అన్యాపదేశంగా ఉన్నతాధికారుల లుక్కు, డ్రెస్సు హుందాగా, గౌరవనీయంగా ఉండాలని హితవు చెప్పినట్టు కూడా గుర్తు… సరే, తరువాత ఆమె ఢిల్లీ వెళ్లిపోయింది… ఇప్పుడు మంచి బాధ్యతాయుత పోస్టులో ఉండి, తనిఖీలకు వెళ్లినప్పుడు ఓ జీన్స్ వేసుకుని, ఓ పిచ్చి టాప్ వేసుకుని కనిపించింది…
అరె, తనిఖీలు కదా, ఎవరూ గుర్తుపట్టకుండా అలా వెళ్లింది అనేది పిచ్చి సమర్థన… అందుకే సోషల్ మీడియాలో ఆమె డ్రెస్ సెన్స్ మరోసారి విమర్శలకు గురవుతోంది… ఒక విశ్వనగరానికి ఉన్నతాధికారివమ్మా తల్లీ నువ్వు..? కాస్త లుక్కు, గ్రేస్ ముఖ్యమని చెప్పినా ఆమె వినిపించుకోదు… మరీ కేసీయార్‌లాగా రేవంత్ ఆమె డ్రెస్సు మీద కామెంట్ చేసి, ఇదేంది అని నొసలు ముడుస్తాడో లేదో తెలియదు…
సో వాట్..? కమిషనర్ అయితే ఫలానా డ్రెస్ వేసుకోవాలని ప్రోటోకాల్ ఉంటుందా అనడిగితే సమాధానం ఉండదు… కానీ సందర్భాన్ని బట్టి, పోస్టును బట్టి డ్రెస్ ఉండాలనేది మాత్రం ముఖ్యమే… అది ఆ పోస్టు గౌరవాన్ని పెంచాలి… సదరు పోస్టులో ఉన్న వ్యక్తి గౌరవాన్ని పెంచాలి… ఆమెను ఆ పోస్టులోకి తీసుకున్న పాలకుడి విచక్షణ పట్ల గౌరవాన్ని పెంచాలి… అబ్బే, ఇవన్నీ ఐ డోన్ట్ కేర్ అంటుందా..? ఏమో… ఆమె ఇష్టం… తను అనసూయ కాదు, శ్రీముఖి కాదు… ఆమ్రపాలి… అది గుర్తుంచుకోవాలి..!!
ఈ ఫోటో చూశాక ఓ మిత్రుడి సూచన… అమ్మా, నీ డ్రెస్సు నీ ఇష్టం, కానీ నీ వెనుక ఒకరు పనిచేస్తున్నారు చూడు… వాళ్లకు గ్లవుజులు, షూస్ కొనివ్వు ముందు…!!
Share this Article