మనకు లేడీ కమెడియన్లు చాలా చాలా తక్కువ… టీవీ షోలలో గానీ, సినిమాల్లో గానీ మంచి టైమింగుతో కామెడీ అదరగొట్టగలిగే అతి కొద్ది మందిలో రోహిణి పేరు కూడా చెప్పొచ్చు… ఏ స్కిట్టయినా సరే, ఏ పాత్రయినా సరే అలవోకగా చేసేయగలదు… ఇప్పుడామె పేరును ఓ వివాదంలోకి లాగుతున్నారు… ఇంకెవరు సోషల్ మీడియాయే..!
ఇంతకీ ఆమెను ఎందుకు ఆడిపోసుకుంటున్నారంటే..? ఒక వీడియోలో నటించింది… తన ఇన్‌స్టాలో ఉంది… నిజానికి అది The Birth Day Boy అనే ఓ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియో… అదేదో చిన్న సినిమా, ఏదో ఇలా పది మందికీ చేరవేసే ప్రయత్నం చేసుకుంటున్నట్టుంది… అయితే…
Ads
ఎవరిదో బర్త్‌డే పార్టీ అంటే అక్కడికి రోహిణి వెళ్తుంది… అక్కడికి పోలీసులు వస్తారు, ఇది రేవ్ పార్టీ, నువ్వు కూడా బండెక్కు, నడువ్ స్టేషన్‌కు అని దబాయిస్తారు… అయ్యో, నేను బర్త్‌డే పార్టీ అంటే వచ్చాను, నాకు టెస్టులు చేయలేదు, పాజిటివ్ కూడా రాలేదు అని అంటుంది పోలీసులతో… ఇక్కడ వచ్చింది ఇష్యూ…
ఇదంతా నటి హేమను వెక్కిరిస్తూ తమ సినిమా ప్రమోషన్ కోసం తీయబడిన వీడియో అనీ, అందులో రోహిణి నటించి తప్పు చేసిందంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు కొందరు… (సదరు సినిమా టీం కోరుకున్నదీ అదే)… నిజానికి ఇక్కడ రోహిణి చేసిన తప్పేముంది..? రేవ్ పార్టీలు, పాజిటివ్ రిజల్ట్స్, మీడియా ముందు అబద్ధాలు ఒక్క హేమకే పేటెంటా..?
పోనీ, హేమను పోలిన పాత్రే అనుకుందాం… తప్పేముంది..? హేమ వీడియోలు, వివాదం కథలుకథలుగా మీడియాలో వచ్చినవే కదా… ఇంకా ఎందుకు దాపరికం..? ఆ వార్తల్లో నుంచి తమ సినిమాకు ఓ ప్రమోషనల్ వీడియో చేసుకుంటే, ఉపయోగించుకుంటే హేమకు కొత్తగా వచ్చిన పరువు నష్టం ఏమిటట..? ఆల్రెడీ రచ్చ రచ్చ అయిపోయిన ఇష్యూయే కదా…
అనవసరంగా హేమ వంటి పలుకుబడి, సర్కిల్ ఉన్న వాళ్లతో సినిమా, టీవీ ఫీల్డులో ఉన్నవాళ్లు గోక్కోరు… రోహిణి ఆ పాత్ర చేయడాన్ని అభినందించాలి కదా… నీ పనైపోయింది, హేమకు కోపమొస్తుంది, నీ ప్రొఫెషనల్ కెరీర్‌కు దెబ్బే అంటూ భయపెట్టడం దేనికి..? కనీసం ఒక్కతైనా ఆ ధైర్యం కనబర్చింది కదా… అభినందించకుండా ఆమెను డిమోరల్ చేసే వార్తలు అవసరమా బ్రోస్..!!
హిందీలో గానీ, ఇతర భాషల్లో గానీ సెటైరికల్ వీడియోలు, స్కిట్స్ బోలెడు… ఎటొచ్చీ తెలుగులోనే కనిపించని పగ్గాలు నటీనటులను లాగేస్తుంటాయి… ఇదుగో సరిగ్గా ఇలాగే..!! రోహిణి చేసింది థౌజండ్ పర్సెంట్ కరెక్టు… #IAppreciateRohini…
Share this Article