సోషల్ మీడియాలో నాని సినిమా ‘సరిపోదా శనివారం’పై ఇంట్రస్టింగు వార్తలు వినిపిస్తున్నాయి… మన సినిమాల్లో ఒక పోస్టర్, ఒక పాట, ఒక ట్రెయిలర్ రిలీజు కాగానే సోషల్ మీడియా ఠక్కున పట్టేసుకుంటుంది… అవి ఏయే సినిమాల్లోని కంటెంటుకు కాపీయే ఇట్టే చెప్పేస్తుంది…
అంతేకాదు, వాటికి సంబంధించిన పాత చిత్రాలు, ఆడియోలు, వీడియోలు కూడా పెట్టేసి, మీమ్స్‌తో ఆడుకుంటుంది కూడా… ప్రత్యేకించి సినిమా కథలు, పాటల ట్యూన్లపై సోషల్ మీడియా ఆసక్తి ఎక్కువ… తెలివైన నిర్మాతలు ఇలాంటి మీమ్స్‌ను కూడా ఆహ్వానిస్తారు, అదీ ఓ పబ్లిసిటీయే అన్నట్టుగా… కానీ తమ కాపీ బాగోతాలు బయటపడ్డాయని మాత్రం సిగ్గుపడరు… పడితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఉండలేరు…
నాని హీరోగా చేసిన ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రఖ్యాత రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి అప్పుడెప్పుడో రాసిన ‘శనివారం నాది’ సినిమాకు అనుకరణ అనేది తాజా చర్చ… ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు, డీవీవీ దానయ్య నిర్మాత… అప్పట్లో ఈ నవల పాపులరే… కాకపోతే అందులో ఒకతను ప్రతి శనివారం ఏదో ఒక సంఘటనకు పాల్పడుతూ ఉంటాడు… నెగెటివ్ షేడ్స్ ఉన్న ప్రధానపాత్ర…
Ads
ఐతే నాని ఆ టైపు కేరక్టర్‌కు అంగీకరిస్తాడా అనేది ప్రశ్న… నవలలో మంగళ అని ఓ పోలీసాఫీసర్ పాత్ర ఉంటుంది… కథకు కీలకం… ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక మోహన్ పోషించిన చారులత పాత్ర కూడా అదేననేది ఈ కాపీ ఆరోపణల వాదన… కాకపోతే ఇప్పటికీ తమ సినిమా కథ ఎవరిది అనే స్పష్టత సినిమా టీం నుంచి లేదు… బహుశా మల్లాది దృష్టికి కూడా ఈ విషయం వెళ్లి ఉండదు… ఇప్పుడు వినిపించే ఆరోపణలు కూడా సందేహాలు మాత్రమే, ఆధారాల్లేవు…
ఒకవేళ తనకు ఏమైనా డౌట్ వస్తే వెంటనే లీగల్‌గా అడుగులు వేస్తాడు, ఊరుకోడు… కాకపోతే కొన్నాళ్లుగా కొత్త పుస్తకరచన, అమ్మకాల మీద తను చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు… అసలే మంట మీదున్నాడు… సరే, ఇక్కడే మరికొన్ని సంగతులు…
నాని సినిమా కథల మీద గతంలోనూ ఆరోపణలున్నాయి… అందుకే ఈ కొత్త సినిమా కథ మీద కూడా ఇన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి… అప్పట్లో హాయ్ నాన్న అనే సినిమా చేశాడు… సినిమా విడుదలయ్యాక ఇది గతంలో శోభన్ బాబు, మంజుల నటించిన మంచి మనుషులు సినిమాకు అనుకరణ అనే విమర్శలొచ్చాయి… ఆ పాత తెలుగు సినిమా కూడా ‘ఆ గలే లగ్ జా’ అనే హిందీ చిత్రానికి రీమేక్…
ఏదో నవలలోని కంటెంటును తీసుకుని, కొన్ని మార్పులు చేసేసి, కొత్తగా రాయించుకుని, అబ్బే, ఆ కథకూ మా కథకూ అస్సలు లింకే లేదు అనే వాళ్లు ఇండస్ట్రీలో బోలెడు మంది… సో, ఒక సినిమా కథను సరిగ్గా ఇది ఫలానా నవల కంటెంటుకు కాపీ అని నిరూపించడం కష్టం… కానీ పోరాటం మాత్రం అవసరం… ఏమో, పాజిటివ్ రిజల్ట్ రావచ్చు… రీసెంటుగా ఒకటీరెండు సినిమా కథలు కోర్టుదాకా వచ్చాయి కదా..!!
Share this Article