సిద్ధార్థ్… ఏదో చెప్పాలని అనుకుంటాడు… తను చాలా తెలివిగా చెబుతున్నాను అని కూడా అనుకుంటాడు… చివరకు ఏదో చెబుతాడు… అది ఇంకోలా జనానికి చేరుతుంది… జనం తిట్టిపోస్తారు… తను తెల్లమొహం వేస్తాడు…
తను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేనప్పుడు మౌనంగా ఉంటాడా..? ఉండడు..! పిచ్చి కూతలకు ఎప్పుడూ రెడీ అన్నట్టు ఉంటాడు… డ్రగ్స్ మీద పోరాటానికి సినిమాలు సపోర్ట్ చేయాలి, డ్రగ్స్ మీద అవేర్‌నెస్ పెంచే షార్ట్ ఫిలిమ్స్ తీసి థియేటర్లలో ప్రదర్శిస్తేనే టికెట్ రేట్ల పెంపు వంటి విషయాల్లో ప్రభుత్వం సహకరిస్తుంది అని రేవంత్ రెడ్డి మొన్నామధ్య చెప్పాడు…
నిజానికి అది ఆహ్వానించదగిన సూచన కమ్ నిర్ణయం… కానీ సిద్ధార్థ్ నిన్న భారతీయుడు-2 సినిమా ప్రమోషన్ మీట్‌లో ‘‘సీఎం చెబితేనే చేశామా..? ఆర్టిస్టుకు స్వతహాగా ఆ బాధ్యత ఉండాలి… నేను ఎప్పటి నుంచో ఫీల్డ్‌లో ఉన్నాను… ఓ సినిమాలో సురక్షిత సంభోగం సూచించేలా కండోమ్ పట్టుకుని కనిపిస్తాను… ఆర్టిస్టులందరూ ఆ బాధ్యతను ఫీలవుతున్నారా అంటే నేను ఏమీ చెప్పలేను… సిఎం చెబితే చేస్తాం, కానీ ఇది చేస్తేనే అది ఇస్తాం అనడం ఏమిటి..?’’ అని చెప్పుకొచ్చాడు… టికెట్ రేట్లు పెంపుకి, డ్రగ్స్ అవేర్నెస్ వీడియోలకు లింక్ ఏమిటి అని సిఎం నిర్ణయాన్ని అక్షేపిస్తున్నాడు తను…
Ads
ఇక్కడ తను చెప్పదలుచుకున్నది వేరు కావొచ్చు, ఆర్టిస్టులందరూ స్వతహాగా సోషల్ రెస్సాన్సిబులిటీ ఫీల్ కావాలని… కానీ ఇది ఎలా కన్వే అయ్యిందంటే… సీఎం చెబితేనే మేం చేస్తున్నామా..? సీఎం చెప్పాలా..? అన్నట్టుగా చాలామందికి అర్థమైంది… నేరుగా సీఎంను నేరుగా తప్పుపడుతున్నాడు అన్నట్టుగా వెళ్లింది… ఇలాంటి కూతలతో జరిగే నష్టమేమిటో నిర్మాతలో, డిస్ట్రిబ్యూటర్లో తలంటినట్టున్నారు…
వెంటనే మళ్లీ ఓ వీడియో రిలీజ్ చేశాడు… నేను సీఎంను తప్పుపట్టలేదు, ఐ సపోర్ట్ సీఎం డెసిషన్ అని చెబుతూనే… మళ్లీ ఆ వీడియోలో కూడా భారతీయుడు చూడండి, ఈ సినిమా కంటెంట్ అవినీతి మీద, డ్రగ్స్ మీద జీరో టాలరెన్స్… అంటూ ప్రచారం… మరో బ్రీఫ్ వీడియోలో ఎవరైనా హర్టయితే సారీ అంటున్నాడు… అది ఏ సబ్జెక్టు మీదో తెలియదు… (మీడియా పర్సన్స్ మీద కొన్ని విసుర్లున్నాయి తన మీడియా మీట్‌లో, ఓవరాక్షన్ ఉంది… బహుశా దానికి సారీ చెబుతున్నాడా..?)
అందుకే చెప్పేది మీడియా మీట్‌లలో కాస్త నోటిని అదుపు చేసుకోవాలని… ఏదో ఒకటి అనేయడం దేనికి..? తరువాత నాలుక కర్చుకుని, లెంపలేసుకుని, సారీలు చెప్పి, పెద్ద వివరణలు విడిగా వీడియోల్లో చెప్పుకోవడం ఎందుకు..? పైగా ఈ వివరణలు కాదు, సీఎం చెప్పింది చిన్న చిన్న అవేర్‌నెస్ వీడియోలను థియేటర్లలో ప్రదర్శించాలని..!
సో, మీడియా మీట్‌లలో ఇదే కాదు, విలేకరులు ఏవేవో అడుగుతారు, గోకుతారు, ఏదో చెప్పించాలని ప్రయత్నిస్తారు… అందుకని తాము ఏం మాట్లాడుతున్నామో కాస్త సోయితో ఉండి, జాగ్రత్తగా మాట్లాడటం బెటర్ అని సిద్ధార్థ్ అనే నోటిదూల కేరక్టర్ మరోసారి తెలియజెప్పాడు..!!
Share this Article