Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హవ్వ… ఇదా ఎన్టీయార్ వంటి ప్రసిద్ధ హీరో పాత్ర ఔచిత్యం..?

July 9, 2024 by M S R

దీక్ష… ఈ సినిమా లవర్సుకు ఈ సినిమా గుర్తు ఉండిపోవటానికి ముఖ్య కారణం ఒకే ఒక్క పాట . సి నారాయణరెడ్డి వ్రాసిన పాట . మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలికా అనే చాలా చాలా శ్రావ్యంగా ఉండే పాట . సూరజ్ అనే హిందీ సినిమాలోని బహారో ఫూల్ బరసావో మేరా మెహబూబ్ ఆయా హై ట్యూన్ తో పెండ్యాల ఈ పాటను తయారు చేసారు . బాల సుబ్రమణ్యం కూడా పాటకు తగ్గట్లు గొప్పగా పాడారు . నిజానికి ఇది ఘంటసాల పాడాల్సిన పాటే…

ఈ సూరజ్ సినిమా గురించి ఓ మాట పంచుకోవాలి . రాజేంద్రకుమార్ , వైజయంతిమాలలు హీరో హీరోయిన్లుగా నటించారు . క్లాసిక్ . కాలేజీ రోజుల్లో నాకు నచ్చిన కళాఖండం . నేను హిందీ , ఇంగ్లీషు సినిమాలు చాలా తక్కువగా చూసేవాడిని . చూసిన వాటిల్లో ఒకటి సూరజ్ . చూడని మిత్రులు ఎవరయినా ఉంటే ఈ హిందీ సినిమాను తప్పక చూడండి . మళ్ళా మన దీక్ష సినిమాలోకి వద్దాం .

NTR , జమున నటించాల్సిన పాత్రలు కావు ఇవి… ఆరోజుల్లో ఉన్న చంద్రమోహన్ లాంటి కుర్ర హీరోలో , నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు వేసే కృష్ణంరాజు , హరనాథ్ వంటి నటులో నటించవలసిన సినిమా . తన తండ్రిని చంపి , తమ ఆస్తిని కాజేసిన విలన్ కు బుధ్ధి చెప్పే హీరో పాత్ర . బుధ్ధి చెప్పేందుకు విలన్ కూతురు జమునని ప్రేమించినట్లు నటించి , శీలాపహరణ చేస్తాడు హీరో NTR . తనకు సూటయ్యే పాత్ర ఏమాత్రం కాదు ఇది. ఆ కేరక్టరైజేషనే సరికాదు. హీరో పాత్ర ఔచిత్యమే దెబ్బతినిపోయింది. సరే, చివరలో హీరోయిన్ మంచితనం హీరో తెలుసుకుని పెళ్ళి చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది .

Ads

ప్రముఖ దర్శకుడు కె ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మిగిలిన పాటలు కూడా బాగానే ఉంటాయి . పూలమ్మే పిలిచింది , బుల్ బుల్ బ్యూటీ వయ్యారి , సరదాగా సంతకెళితే , నాన్న అనే రెండక్షరాలు పాటలు ఓకే . పూలమ్మే పిలిచింది పాటలో జమున చాలా హుషారుగా నటిస్తుంది .

ప్రభాకరరెడ్డి , జగ్గయ్య , రాజబాబు , సాక్షి రంగారావు , అంజలీదేవి , కె విజయ , పుష్పకుమారి , చలపతిరావు ప్రభృతులు నటించారు . అంజలీదేవి మొదటిసారిగా NTR కు తల్లిగా నటించింది ఈ సినిమాయే అనుకుంటా . ఆయనతో హీరోయిన్ గా నటించిన చాలామంది హీరోయిన్లు ఆయనకు తల్లులుగా నటించారు . తప్పించుకుంది సావిత్రి , కృష్ణకుమారిలే . ఈ దీక్ష సినిమా యూట్యూబులో ఉంది . NTR , జమున అభిమానులు చూడవచ్చు .

అందరూ తప్పక చూడవలసింది ఈ సినిమాలోని మెరిసే మేఘమాలికా పాట . ఈ పాట కన్నా గొప్ప పాట సూరజ్ సినిమా లోని బహారో ఫూల్ బరసావో . వైజయంతిమాల ఎంత అందంగా ఉంటుందో ! A thing of beauty is a joy forever . ఈ రెండు పాటల వీడియోలూ యూట్యూబులో ఉన్నాయి . ఆస్వాదించండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……. ( By డోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?
  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions