భారతీయుడు-2… ఈ ప్రాజెక్టు అప్పుడెప్పుడో స్టార్ట్ చేస్తే ఎక్కడో ఆగిపోయింది… అసలే లైకా ప్రొడక్షన్స్… శంకర్, కమలహాసన్ వదిలేశారు దాన్ని… తిరిగి పట్టాల మీదకు తీసుకొచ్చి, ఎలాగోలా చుట్టేసి జనం మీదకు వదిలారు… జస్ట్, శంకర్ ఓ పనైపోతుంది అన్నట్టుగా హడావుడిగా పూర్తి చేశాడు… అరెరె, చేయలేదు, భారతీయుడు-3 కూడా ఉంటుందట… ఓరి దేవుడా..?!
నిజానికి ఇది ఆ సినిమా సమీక్ష కూడా కాదు, సమీక్ష అవసరం లేదు దీనికి..! భారతీయుడు ఫస్ట్ పార్ట్ వచ్చి 28 ఏళ్లు… అప్పటికే కమలహాసన్ తాత అయిపోయాడు అందులో… 28 ఏళ్ల తరువాత ఇంకెంత ముసలివాడు అయిపోవాలి, తననలాగే, కాదు, మరింత పవర్‌ఫుల్ అన్నట్టుగా చూపించడం బేసిక్‌గా ప్రేక్షకుడిని కనెక్ట్ కాలేదు, చిరాకెత్తించింది… భారతీయుడు-3 నాటికి ఇంకా సూపర్ మ్యాన్‌ను చూపిస్తాడేమో శంకరుడు…
ఏ సినిమాకైనా కాస్త ఎమోషన్ ఉంటేనే అది ప్రేక్షకుడిని కనెక్టవుతుంది… భారతీయుడు సినిమాలో కూతురి గురించి కమలహాసన్ పడే వేదన ప్రేక్షకుల్ని కదిలించింది… ఏదీ ఈ సెకండ్ పార్ట్‌లో ఒక్కటీ ఎమోషన్ బేస్డ్ సీన్ లేకపాయె…
Ads
శంకర్‌కు, మణిరత్నంకు అలవాటే… ప్యూర్ తమిళ్ సినిమా తీస్తారు… అదే కల్చర్, అదే ఇండస్ట్రీ, అవే వేషభాషలు… జస్ట్, ఇతర భాషల్లోకి డబ్ చేస్తారు… ఇదీ అంతే… వాళ్లను మనం చూస్తాం, మనల్ని వాళ్లు చూడరు, అదే తేడా… ఇందులో కూడా వెటరన్ నెడుముడి వేణును, వివేక్, మనోబాలలను ఎఐ సాయంతో రీక్రియేట్ చేస్తే హిందీ, తెలుగు ప్రేక్షకులకు ఏం థ్రిల్..? (షూటింగ్ ప్రారంభమయ్యాక వాళ్లు మరణించారు)…
రకుల్, సిద్ధార్థ్, ప్రియా ఉన్నారంటే ఉన్నారు… కాజల్ లక్కీ, తప్పించుకుంది… అనిరుధ్ సంగీతమేనా ఇది..? అక్కడక్కడా బీజీఎం అలా మెరిసింది తప్ప హోప్‌లెస్… అసలు అవినీతి అనేది ఇప్పుడు విస్తృతమైంది, రూటు మార్చి కొడుతోంది జనాన్ని… ఓ పోలీసాయనో, ఓ గుమస్తానో 1000 రూపాయలు అడిగితే అదిప్పుడు నథింగ్… పొలిటిషియన్స్, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్, వ్యాపారులు, కంపెనీలు వందలు, వేలు, లక్షల కోట్లను కొట్టేస్తున్నారు… బ్యాంకు రుణాలు, భూములు, షేర్లు, ఏవేవో రూపాల్లో…
జీరో టాలరెన్స్ అనే సినిమాాటిక్ సూత్రం అప్పుడు 28 ఏళ్ల క్రితం ప్రేక్షకులకు కొత్తగా ఉందేమో, ఇప్పుడు కనెక్ట్ కాలేదు… పైగా బోర్ ప్రజెంటేషన్… ఫస్ట్ పార్టులో ప్రేక్షకుల్ని కనెక్టయినవి ప్రధానంగా పాటలు… ఇప్పటికీ అవి చెవుల్లో గింగురుమంటూనేే ఉంటాయి… నిజానికి తమిళనాడులోనే ఈ సినిమాకు హైప్ రాలేదంటే, అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రమే అని తెలిసినప్పుడే, తన రెమ్యునరేషన్ మొత్తం చెల్లించాల్సిందేనని కమలహాసన్ భీష్మించుకున్నాడు అంటేనే ఏదో తేడా కొట్టిందీ అని అర్థమైపోయింది…
ప్చ్, నటుడిగా కమలహాసన్‌ను ప్రేమించే అభిమానులకు జీర్ణం కాదు ఈ సినిమా పోకడ… అసలు ఇది కమలహాసన్ సినిమాయేనా..? ఆ దిగ్దర్శకుడు శంకర్ తీసిన సినిమాయేనా..? అని థియేటర్‌లోనే హాశ్చర్యపోతాం… ఎక్కడా ఒక్క సీన్‌లో కూడా హై లేదు, అసలు కమలహాసన్ నటన బాపతు ఇంపాక్ట్ ఎక్కడా కనిపించదు… పూర్ కేరక్టరైజేషన్, పూర్ ప్రజెంటేషన్… అసలు ప్యూర్ కథారాహిత్యం… ఆ సేనాపతిని మళ్లీ దింపడమే దెబ్బకొట్టింది… మరీ మక్కల్ నీది మయ్యం అనే కమలహాసన్ పార్టీ రిజల్టే… సారీ కమలహాసన్… ప్లీజ్, నో థర్డ్ పార్ట్ ప్లీజ్..!! (ఓవర్సీస్ ప్రీమియర్స్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా…)
Share this Article