ఆడవాళ్ల పీరియడ్స్ సెలవుల విషయంలో మొన్నామధ్య సుప్రీంకోర్టు ఓ కామెంట్ చేసింది… ఈ సెలవులు మహిళల ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే ప్రమాదముంది అని..! అవును, మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకుంటే సెలవులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని కంపెనీలు భావిస్తే నిజంగానే మహిళల అవకాశాలకు అది దెబ్బ…
ఇప్పుడు కర్నాటకలో దాదాపు అలాంటిదే రచ్చ… దుమారం రేగుతోంది… అసలే కొంతకాలంగా కర్నాటకలో యాంటీ హిందీ ఆందోళనలున్నాయి… నార్తరన్ స్టేట్స్ నుంచి యువత పెద్ద ఎత్తున వలస వచ్చి, ఇక్కడి వనరులను వాడుకుంటూ, స్థానికుల అవకాశాలను దెబ్బకొడుతున్నారనే కోపం కూడా ఉంది…
అధికారం కోసం అలవిమాలిన ఉచిత హామీలు ఇచ్చి, అవి నెరవేర్చలేక, ఖజానాను దివాలా తీయించి, ఆర్థికంగా రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బ తీసిన ప్రభుత్వం ఇప్పుడు మరో నిర్ణయం వైపు కదులుతోంది…
Ads
ప్రతి కంపెనీ మేనేజ్‌మెంట్ పోస్టుల్లో 50 శాతం స్థానికులను మాత్రమే తీసుకోవాలనీ, నాన్ మేనేజ్‌మెంట్ పోస్టుల్లో ఏకంగా 75 శాతం స్థానికులకే ఇవ్వాలని ఓ బిల్లు రూపొందింది… The Karnataka State Employment of Local Candidates in the Industries, Factories and Other Establishments Bill- 2024 …. ఇదీ ఆ బిల్లు పేరు… కేబినెట్ క్లియర్ చేసింది, అసెంబ్లీలో పెట్టి పాస్ చేయాల్సి ఉంది…
స్థానికుడు అంటే తప్పనిసరిగా కన్నడ లాంగ్వేజీతో ఎస్సెస్సీ సర్టిఫికెట్ ఉండాలి… ప్రభుత్వం గుర్తించిన నోడల్ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడే కన్నడ ప్రొఫిషియెన్సీ టెస్టు పాసై ఉండాలి… స్థానికులు దొరక్కపోతే బయటివాళ్లను తీసుకోవచ్చు అని ఓ సడలింపు కూడా…! (ఇక్కడ మళ్లీ మెరిట్ అనే ఇష్యూ కీలకమవుతుంది…) దీనికితోడు ప్రతి కంపెనీ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల్లో వంద శాతం స్థానికులకే అవకాశం ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు…
అవును, స్థానికులకే ఇవ్వాలి, ఇక్కడ నైపుణ్యానికి ఏం తక్కువ..? మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూళ్లు… సరిపడే స్థాయిలో నిపుణులను తయారు చేస్తోంది రాష్ట్రం… ఐనా ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు..? స్థానికులు ఉన్నప్పుడు… ఇక్కడి వనరులను వాడుకుంటున్నప్పుడు ఇక్కడి ప్రజలకే ఉపాధి అవకాశాలు దక్కాలి కదా అంటున్నాడు ఓ మంత్రి…
ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తల నుంచి నెగెటివ్ రియాక్షన్ రావడంతో ఆ పోస్టును డిలిట్ చేశాడు… సీఎం స్థాయిలో పెట్టబడిన పోస్టు కూడా డిలిట్ చేయబడిందంటే రెసిస్టెన్స్ ఏమేరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు… నిజంగానే ఇది చట్టరూపం దాలుస్తుందా..? ఏమో, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలదు… పరిణామాలు, ప్రభావాల మీద అంచనాలు, దూరదృష్టి లేకుండా ఉండటమే కదా ప్రజెంట్ రాజకీయం అంటే..!
బెంగుళూరు నిజంగా ఓ విశ్వనగరం… ఆ వాతావరణం, వనరులు దేశంలోని అన్ని రాష్ట్రాల యువతను, నిపుణుల్ని ఆకర్షిస్తోంది… బోలెడు కంపెనీలు అక్కడ ఏర్పాటయ్యాయి… నార్తరన్ స్టేట్స్ నుంచే కాదు, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి లక్షలాది మంది వెళ్లారు, అక్కడ సెటిలయ్యారు… లెక్క ప్రకారం చూస్తే వాళ్లెవరూ స్థానికులు కారు, కానీ బెంగుళూరును ఓన్ చేసుకున్నారు…
ఇప్పుడు ప్రభుత్వం అడుగులను బట్టి అందరిలోనూ ఓ భయాందోళన మొదలైంది… కంపెనీల్లో కూడా… ఇదిలాగే కొనసాగితే మెల్లిమెల్లిగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేస్తాయి… అసలే కునారిల్లుతున్న రాష్ట్రాన్ని ఇది మరింత తిరోగమనంలోకి నడిపిస్తుంది… ఇది ముదిరితే బెంగుళూరుకు దీటైన విశ్వనగరం కాబట్టి హైదరాబాద్ కంపెనీలను ఆకర్షించే చాన్సుంది… చెన్నైకన్నా హైదరాబాద్ చాలా కోణాల్లో బెటర్…
ప్రత్యేకించి హైదరాబాద్ భాష, కల్చర్ విషయంలో చాలా ఫ్లెక్సిబుల్… అనేక రాష్ట్రాల కల్చర్లు ఆల్రెడీ ఇక్కడ సౌకర్యంగా సెటిలయ్యాయి ఎంతోకాలంగా… ఇంటర్నేషనల్ లెవల్ లివింగ్ కండిషన్స్… ముంబై, పూణె కూడా బెటరే గానీ… ఇప్పటికే కిక్కిరిసిపోయి, అడ్డగోలు రేట్లతో ఇరుకిరుకు అయిపోయాయి ఆ సిటీలు… సో, బెటర్ డెస్టినేషన్ విల్ బి ఓన్లీ హైదరాబాద్..!!
Share this Article