Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో గ్రాఫిక్స్… నో డూప్స్… స్కేటింగ్ చేస్తూ ఈ హిట్ జంట డ్యూయెట్…

July 18, 2024 by M S R

స్కేటింగ్ నేపధ్యంలో తీయబడిన మొదటి తెలుగు సినిమా కావచ్చు 1974 లో వచ్చిన ఈ మంచి మనుషులు సినిమా . ఈ సినిమా కోసం శోభన్ బాబు , మంజుల స్కేటింగ్ నేర్చుకుని ఉంటారు . జగపతి బేనర్లో వి బి రాజేంద్రప్రసాద్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ & విజ్యువల్ హిట్ .

సినిమా సగంపైన సిమ్లా , మనాలీల్లో షూట్ చేయబడింది . సినిమా కూడా చాలా posh గా ఉంటుంది . నాగభూషణం బంగళా సెట్టింగ్ అదిరిపోతుంది . సిమ్లాలో పాటలు తెలుగు సాధారణ ప్రేక్షకులకు కనువిందు చేసాయి . పాటల్లో శోభన్ బాబు వేసుకున్న పూల పూల చొక్కాల వంటివి నేనూ కుట్టించుకున్నా .

సినిమా విజయానికి కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం ఎలా అయితే కారణమో , ఈ సినిమాకు కె వి మహదేవన్ సంగీతం అంతే కారణం . పడకు పడకు వెంటపడకు , విను నా మాట విన్నావంటే జీవితమంతా పూవుల బాట , హరిలో రంగ హరీ , నేను లేక నీవు లేవు , నిన్ను మరచిపోవాలని , పెళ్ళయిందీ ప్రేమ విందుకు వేళయింది పాటలు బాగా హిట్టయ్యాయి . ఆరుద్ర వ్రాసిన విను నా మాట పాట తప్ప మిగిలిన పాటలన్నీ ఆత్రేయే వ్రాసారు . సుశీలమ్మ , బాల సుబ్రహ్మణ్యంలు పాడారు .

Ads

జగ్గయ్య , అంజలీదేవి , నాగభూషణం , ముక్కామల , రావు గోపాలరావు , కె వి చలం , రాజబాబు ప్రభృతులు నటించారు . హిందీలో వచ్చిన ఆగలే లగజా సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . హిందీలో శశికపూర్ , శతృఘ్నసిన్హా , షర్మిలా టాగోర్ నటించారు . మాస్టర్ టిటూ రెండు భాషల్లోనూ నటించాడు .

హైదరాబాద్ సుదర్శన్లో షిఫ్టులు లేకుండా 175 రోజులు ఆడింది . హైదరాబాదులో 25 వారాలు ఆడిన శోభన్ బాబు మొదటి సినిమా ఇది . శోభన్ బాబు , మంజుల జోడీ బాగా క్లిక్ అయింది . సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడవచ్చు . An entertaining , emotional , musical and feel good movie ……… ( By డోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకే ఒక సినిమా… ఫుల్ స్టాప్… నేనూ నా సంగీతం… అదే నా ప్రపంచం…
  • అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…
  • తమ్ముడు పెళ్లి – మామ భరతం..! ఈ కథాకమామిషు ఏమిటనగా..!
  • జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…
  • విశ్వనాథుడు కదా… జావళి పాటకీ జయమాలినితో డాన్స్ చేయించగలడు…
  • 132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
  • నాలుగు దశాబ్దాల కెరీర్… సాఫీగా ఈరోజుకీ కుదుపుల్లేని జర్నీ…
  • ప్రేక్షకులకు తగిలే చెప్పు దెబ్బల మాటేమిటో కూడా చెప్పు..!!
  • ఎట్టకేలకు GST మోత కాస్త తగ్గిస్తున్నారు ప్రభువులవారు..!!
  • ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions